REC Recruitment 2023: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో నెలకు రూ.26 లక్షల జీతంతో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత..
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్‌ఈసీ లిమిటెడ్.. 125 జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి..
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్‌ఈసీ లిమిటెడ్.. 125 జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మిన్, సీసీ, లా, సెక్రటేరియల్, రాజ్‌భాష, సీఎస్, ఐటీ, హెచ్‌ఆర్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టును బట్టి డిగ్రీ/ గ్రాడ్యుయేషన్/ బీటెక్/ బీఈ/ డిప్లొమా/ సీఏ/ సీఎంఏ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ/ ఎంసీఏ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో 3 నుంచి 21 ఏళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 33 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ప్రతిఒక్కరూ తప్పనిసరిగా రూ.1000లు చెల్లించాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.7 లక్షల నుంచి రూ.26 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.