AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: భారత్‌లో బయటపడ్డ మరో నిధి.. కుప్పలు కుప్పలుగా బంగారు నిల్వలు..!

భారతదేశంలో మొత్తం బంగారు నిల్వలు దాదాపు 879.58 మెట్రిక్ టన్నులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువ భాగం కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్నాయి. దేశంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. ఇటీవల, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో కూడా భారీ బంగారు నిల్వలు కనుగొనబడ్డాయి. తాజగా ఇక్కడ కూడా బంగారు నిధి బయటపడింది.

Gold: భారత్‌లో బయటపడ్డ మరో నిధి.. కుప్పలు కుప్పలుగా బంగారు నిల్వలు..!
Gold Reserves
Jyothi Gadda
|

Updated on: Sep 26, 2025 | 6:40 PM

Share

ఒకప్పుడు ధైర్యవంతులైన యోధులకు నిలయంగా ఉన్న రాజస్థాన్ ఇకపై బంగారాన్ని దిగుమతిలోనూ ముందు వరుసలో ఉండనుంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని బన్స్వారా జిల్లాలో మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త బంగారు గనిని గుర్తించారు. దేశంలో బంగారు నిల్వలు కలిగిన నాల్గవ రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. దేశంలోని బంగారు సరఫరాలో 25శాతం ఇక్కడి నుండే వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. భూగర్భంలో వివిధ ప్రదేశాలలో బంగారు ఖనిజం రూపంలో బంగారం లభిస్తుంది. మైనింగ్ కోసం GPR, VLF పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఈ గని కేవలం రాజస్థాన్‌ రాష్ట్రానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి కూడా ఆర్థికంగా ఉపశమనం కలిగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో దాదాపు మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త బంగారు గని గుర్తించారు పరిశోధకులు. గతంలో జగ్‌పురా, భాకియాలలో బంగారు గనులు బయటపడ్డాయి. ఈ ప్రాంతంలో ఇది మూడవ గని. కొత్త గనిలో మైనింగ్ కోసం త్వరలోనే టెండర్లు జారీ చేయనున్నారు. భూమిలో బంగారాన్ని గుర్తించడానికి ప్రత్యేక పద్ధతులను ఉపయోగిస్తారు. రెండు ప్రధాన పద్ధతులలో బంగారం అన్వేషణ సాగిస్తారు. ఒకటి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR), రెండోది వెరీ లో ఫ్రీక్వెన్సీ (VLF).

భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు నేల ప్రతి పొరను పరిశీలిస్తారు. ఖననం చేయబడిన లోహాల సంకేతాలను వెల్లడిస్తారు. శాస్త్రవేత్తలు భూమి కింద ఉన్న లోహాలను గుర్తించడానికి ఈ సంకేతాలను అధ్యయనం చేస్తారు. నిర్ధారించబడిన తర్వాత అక్కడ తవ్వకాలు ప్రారంభిస్తారు. బంగారం గుర్తింపుకు మరో టెక్నిక్ VLF టెక్నిక్. భూగర్భ శాస్త్రవేత్తలు బంగారు నిక్షేపాల స్థానాన్ని గుర్తించడానికి భూగర్భంలోకి విద్యుదయస్కాంత తరంగాలను పంపుతారు. అయితే, బంగారం ఒకే చోట కేంద్రీకృతమై ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది బంగారు ఖనిజంగా వివిధ ప్రదేశాలలో దొరుకుతుంది. ఒక పెద్ద రాయి నుండి కొన్ని గ్రాముల బంగారాన్ని మాత్రమే తీయగలరు. అది కూడా అనేక ప్రక్రియల తర్వాత.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో మొత్తం బంగారు నిల్వలు దాదాపు 879.58 మెట్రిక్ టన్నులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువ భాగం కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్నాయి. దేశంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. ఇటీవల, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో కూడా భారీ బంగారు నిల్వలు కనుగొనబడ్డాయి. దేశీయ ఉత్పత్తి పరిమితంగా ఉండటం వల్ల భారతదేశం సంవత్సరానికి 2-3 టన్నుల బంగారాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. అయితే, అధిక వినియోగం కారణంగా, ఎక్కువ బంగారాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ సందర్భంలో, కొత్తగా కనుగొన్న బంగారు గనులు దేశ ఆర్థిక వ్యవస్థకు సహాయపడతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..