PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు మీ బ్యాంకు ఖాతాల్లోకి రాలేదా ? అయితే ఇలా చేయండి..
దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్రం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో
దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్రం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం (PM kisna yojana) ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తోంది కేంద్రం. పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటివరకు రైతులకు కోన్ని కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 1న ప్రధాని నరేంద్రమోదీ 10వ విడత నగదును కోట్లాది మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేశారు.
పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు కేంద్రం ఆరు వేల రూపాయాలను అందిస్తుంది. అయితే ఇవి ఒకేసారి కాకుండా… రెండు వేల చొప్పున మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ఇప్పటివరకు 9 విడతలుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఇక ఈ ఏడాది జనవరి 1న పదవ విడత నగదును పదికోట్ల మంది రైతులకు అందచేసింది. అయితే ఇప్పటివరకు ఈ 10 విడత డబ్బులు అందుకోని రైతులు చాలా మంది ఉన్నారు. నివేదిక ప్రకారం పీఎం కిసాన్ డబ్బు అందుకోని వారిలో మీరు ఉన్నారా ? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలెంటో ఇప్పుడు చూద్దాం. నివేదిక ప్రకారం పీఎం కిసాన్ 10వ విడత నగదును మార్చి 31, 2022 వరకు రైతుల ఖాతాకు బదిలీ చేస్తారు.
హెల్ప్ లైన్ నంబర్ సహాయం తీసుకోవచ్చు.. పీఎం కిసాన్ యోజన డబ్బు ఇంకా అందుకోకపోతే.. ఆ సమయంలో మీరు హెల్ప్ లైన్ నంబర్ సహాయం తీసుకోవచ్చు. పీఎం కిసాన్ యోజన టోల్ ఫ్రీ నంబర్ 18001155266, 155261కి కాల్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. ఇది కాకుండా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లేదా ఇమెయిల్ ఐడి.. pmkisan-ict@gov.in లో మరింత సమాచారాన్ని పొందవచ్చు.
Also Read: Pooja Hegde: బుట్టబొమ్మ స్టెప్‌ను సృష్టించింది తామే అంటోన్న పూజా.. అర్హతో ఆసక్తికరమైన వీడియో..
Teaser Talk: అసలు మనిషి చర్మంతో వ్యాపారం ఏంటి..? ఆసక్తిరేపుతోన్న హన్సిక కొత్త సినిమా టీజర్..
Nidhi Agarwal : అందాల నిధికి కాబోయేవాడికి ఆ క్వాలిటీస్ ఉండాలట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అమ్మడు
Bhamakalapam: ఆకట్టుకుంటున్న ప్రియమణి న్యూలుక్.. ఆహాలో రాబోతున్న భామా కలాపం..