Nidhi Agarwal : అందాల నిధికి కాబోయేవాడికి ఆ క్వాలిటీస్ ఉండాలట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అమ్మడు
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్ సూపర్ హిట్ అందుకుంది.
Updated on: Jan 12, 2022 | 8:39 PM

ప్రస్తుతం హీరోయిన్ నిధి అగర్వాల్ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్ సూపర్ హిట్ అందుకుంది.

ప్రస్తుతం నిధి .. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం హీరో. కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో గల్లా పద్మవతి నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుద కానుంది.

ఈ క్రమంలో నిధి అగర్వాల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కాబోయే భర్త ఎలా ఉండాలో ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.

“అబ్బాయిల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో కల ఉంటుంది. నాకు మాత్రం గౌరవించే వ్యక్తులంటే చాలా ఇష్టం. నన్నే కాదు.. చుట్టుప్రక్కల అందరితోనూ గౌరవభావంతో ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మా నాన్నలా ఉండాలి ” అంటూ చెప్పుకొచ్చింది నిధి.

హీరో, హరి హర వీరమల్లు సినిమా తర్వాత తెలుగులో సినిమాలు ఒప్పుకోలేదని తెలిపింది. ఏప్రిల్ నుంచి హిందీలో ఓ సినిమా చేస్తున్నానని.. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో ఓ సినిమా చేశానంటూ చెప్పుకొచ్చింది నిధి.





























