Gas Insulated Substations: ముంబైలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్స్.. ఆసియాలోనే అతిపెద్ద జీఐఎస్ ఏర్పాటు..!
Gas Insulated Substations:హైదరాబాద్‌కు చెందిన కంట్రోల్ ఎస్ ముంబైలో దేశంలోనే అతిపెద్ద గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (GIS) ఏర్పాటు..
Gas Insulated Substations:హైదరాబాద్‌కు చెందిన కంట్రోల్ ఎస్ ముంబైలో దేశంలోనే అతిపెద్ద గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (GIS) ఏర్పాటు చేస్తోంది. నవీ ముంబైలో ఏర్పాటు చేస్తున్న 10 డేటా సెంటర్ల కస్టర్‌కు ఇది నిరంతరాయంగా విద్యుత్ అందిస్తోంది. 300 మెగా వాట్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెల్లడించారు. దీని సామర్థ్యాన్ని 700 మెగావాట్ల వరకూ పెంచుకోవచ్చని అన్నారు. 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
రూ.750 కోట్ల పెట్టుబడులు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డేటా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కంట్రోల్ ఎస్ 10 కోట్ల డాలర్లు (దాదాపు రూ.750 కోట్లు) ఇన్వెస్ట్‌మెంట్ చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, ముంబైలలో డేటా కేంద్రాలున్నాయని, క్రమ క్రమంగా ఇతర పట్టణాలకు విస్తరించేలా చేయనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే రెండు సంవత్సరాలలో 60 లక్షల చదరపు అడుగులలో విస్తరించి ఉన్న డేటా కేంద్రాల సామర్థ్యాన్ని కలిగి ఉంటామన్నారు. ప్రస్తుతం దేశంలో 650 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లున్నాయన్నారు.
ఇవి కూడా చదవండి: