Vodafone idea: వొడాఫోన్‌ ఐడియా కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి 35.8 శాతం వాటా

Vodafone idea: ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుంది...

Vodafone idea: వొడాఫోన్‌ ఐడియా కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి 35.8 శాతం వాటా
Follow us
Subhash Goud

|

Updated on: Jan 13, 2022 | 8:44 AM

Vodafone idea: ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుంది. ఇందు కోసం సుమారు రూ.16,000 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటిగా మార్చేందుకు వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) నిర్ణయం తీసుకుంది. అయితే దేశంలో అతిపెద్ద మూడో టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వం వాటాదారుగా నిలువనుంది. స్పెక్ట్రమ్‌పై వడ్డీ, ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు బదులుగా కంపెనీలో వాటాలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి ఇవ్వనుంది టెలికం కంపెనీ. అయితే ప్రభుత్వానికి వడ్డీ బకాయి ఉండటంతో ప్రభుత్వానికి రూ.35.8 శాతం వాటా ఇవ్వనుంది. అప్పుడు కంపెనీలో వొడాఫోన్‌ గ్రూప్‌ వాటా 28.5 శాతం,, ఆదిత్య బిర్లా గ్రూప్‌ వాటా కేవలం 17.8 శాతానికి తగ్గింది.

కొంత కాలంగా వొడాఫోన్‌ ఐడియా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా సుమారు రూ.1.95 లక్షల కోట్ల రుణ భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్‌ బకాయిలు రూ.1,08,610 కోట్లు, ఏజీఆర్‌ బకాయిలు రూ.63,400 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. బ్యాంకులు, ఫైనాన్షియల్‌ కంపెనీల రుణాలు రూ.22,700 కోట్లుగా ఉన్నాయి.

వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది పెట్టుబడిదారులే కాదు, ఈ పరిణామం టెలికాం కంపెనీల వినియోగదారులపై కూడా భారీ ప్రభావాన్ని చూపుతుంది, ఒకవేళ ప్రభుత్వం Vodafone Ideaలో అతిపెద్ద వాటాదారుగా మారితే టెలికాం రంగంలో కేవలం 2 పెద్ద ప్రైవేట్ కంపెనీలు మాత్రమే మిగిలిపోతాయి. కంపెనీల నుండి చౌకైన ప్లాన్‌లు వచ్చే అవకాశాలు ఉండవు. కాగా, 2016 సంవత్సరం నుండి టెలికాం రంగంలోకి జియో ప్రవేశించడంతో టెలికం రంగాన్ని కుదిపేసింది. జియో భారీ ఎత్తున కస్టమర్లను చేర్చుకుంది. అయితే జియో ప్రవేశించిన తరువాత ఈ రెండు కంపెనీల కస్టమర్లు వేగంగా తగ్గారు. సుమారు 3 సంవత్సరాలలో వోడా ఐడియా కస్టమర్లు భారీగా తగ్గిపోయారు. ఇప్పుడు వోడా ఫోన్‌ఐడియా బోర్డు నిర్ణయం వల్ల కంపెనీ సమస్యలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనేది ప్రశ్నర్థకంగా మారింది.

ఇవి కూడా చదవండి:

Petrol and Diesel Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఏ నగరంలో ఎంత ఉందంటే..!

ITR Extention: ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..!

అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
అందరు చూస్తుండగానే ముక్కలైన మూగ జీవి!
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA