Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhamakalapam: ఆకట్టుకుంటున్న ప్రియమణి న్యూలుక్.. ఆహాలో రాబోతున్న భామా కలాపం..

ప్రియమణి. (Priyamani) టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోయింది. ఎవరే అతగాడు సినిమాతో తెలుగులోకి

Bhamakalapam: ఆకట్టుకుంటున్న ప్రియమణి న్యూలుక్.. ఆహాలో రాబోతున్న భామా కలాపం..
Priyamani
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 13, 2022 | 6:49 AM

ప్రియమణి. (Priyamani) టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోయింది. ఎవరే అతగాడు సినిమాతో తెలుగులోకి హీరోయి‏న్‏గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రియమణికి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది ప్రియమణి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమాతో ప్రియమణి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఎన్నో చిత్రాల్లో నటించిన ప్రియమణి ఆ తర్వాత అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఇటు వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఓ డ్యాన్స్ షోకు జడ్జీగా వ్యవహరిస్తుంది ప్రియమణి. ఇక ఇటీవల సమంత నటించిన హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్లో (The Family Man) నటించి మెప్పించింది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్రియమణి మరో వెబ్ సిరీస్ చేస్తుంది. అభిమన్యు తాడిమేటి కథ, దర్శకత్వం వహించిన భామా కలాపం అనే వెబ్ సిరీస్ లో ప్రియమణి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ సిరీస్ అతి తర్వలోనే ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో టెలికాస్ట్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తూ.. భామా కలాపం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో ప్రియమణి ఎనిమిది చేతుల్లో ఎనిమిది రకాల పరికరాలు పట్టుకుని ఆకట్టుకుంటుంది. గృహిణిగా ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూ తనకు ఎదురైన ఇబ్బందులను ఎలా ఎదుర్కుందో ఈ సిరీస్ ద్వారా చూపించనున్నారు. ఈ చిత్రాన్ని సుధీర్ ఈదరతో కలిసి ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై భోగవల్లి బాపినీడు నిర్మించారు. రాధేశ్యామ్ చిత్రానికి మ్యూజిక్ అందించిన జస్టిన్ ప్రభాకర్ భామా కలాపంకు సంగీతం అందిస్తున్నారు.

Also Read: Pooja Hegde: బుట్ట‌బొమ్మ స్టెప్‌ను సృష్టించింది తామే అంటోన్న పూజా.. అర్హ‌తో ఆస‌క్తిక‌ర‌మైన వీడియో..

Teaser Talk: అస‌లు మ‌నిషి చ‌ర్మంతో వ్యాపారం ఏంటి..? ఆసక్తిరేపుతోన్న హ‌న్సిక కొత్త సినిమా టీజ‌ర్‌..

Nidhi Agarwal : అందాల నిధికి కాబోయేవాడికి ఆ క్వాలిటీస్ ఉండాలట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అమ్మడు