UPI Payment: యూఏఈలో ఫోన్ పే సేవలు.. క్యూఆర్ కోడ్ సాయంతో లావాదేవీలు..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలు అందుబాటులోకి వచ్చాయి. ఆ దేశంలో మన భారతీయులు తమ ఫోన్ పే మొబైల్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్ పే కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మన దేశంలో బ్యాంకింగ్ రంగం డిజిటల్ బాటలో శరవేగంగా ప్రయాణిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ యూపీఐ ఆధారిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పేల వంటి ప్లాట్ ఫారంలలో క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ సేవలు విరివిగా వినియోగిస్తున్నారు. మన దేశంలో ఏ మూలకు వెళ్లినా యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇతర దేశాలలో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. క్రమంగా మన సమీపంలోని దేశాలకు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలు అందుబాటులోకి వచ్చాయి. ఆ దేశంలో మన భారతీయులు తమ ఫోన్ పే మొబైల్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్ పే కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫోన్ పే ఒక్కటే..
యూపీఐ చెల్లింపుల విషయానికి వస్తే ఫోన్ పేతో పాటు పేటీఎం, గూగుల్ పే, వాట్సాప్, పేజాప్ వంటి యాప్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఫోన్ చేసిన ఈ ప్రకటన ద్వారా మిగిలిన ప్రత్యర్థులకు గట్టి సంకేతాలిచ్చినట్లు అయ్యింది. ఫోన్ పే వినియోగదారులు వారి మొబైల్ నంబర్‌తో సైన్ ఇన్ చేస్తే సరిపోతుంది, ఇది నేరుగా వారి బ్యాంక్ ఖాతాకు లింక్ అవుతుంది. ఆ తర్వాత వినియోగదారులు నాలుగు-అంకెల యూపీఐ పిన్ ను సెటప్ చేసుకొని ఎంచక్కా లావాదేవీలు జరుపుకోవచ్చు.
యూఏఈలో ఫోన్ పే ఎలా పనిచేస్తుంది..
ఫోన్‌పే యాప్‌ని ఉపయోగించి తన నియో పే టెర్మినల్స్‌లో క్యూార్ కోడ్‌ని ఉపయోగించి త్వరగా చెల్లింపు చేసుకోవచ్చు. ఇందుకోసం యూఏఈలో ఫోన్ పే మ్యాష్ రెక్ తో కలిసి పని చేస్తోంది. మీరు ఇప్పటికే ఫోన్ పేని ఉపయోగిస్తుంటే.. మీరు యూఏఈలోని రిటైల్ అవుట్‌లెట్‌లు, పర్యాటక ప్రదేశాలలో అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి చెల్లింపు చేయవచ్చు. యూపీఐ చెల్లింపు మీ బ్యాంక్ ఖాతా నుంచి రూపాయలలో డిడక్ట్ అవుతుంది. మీకు మారకపు రేటు విలువను కూడా అందిస్తుంది.
యూఏఈలోని భారతీయులకు ప్రయోజనం..
యూఏఈలో నివసిస్తున్న భారతీయులు కూడా ఈ సేవ నుంచి ప్రయోజనం పొందవచ్చు, ఎందుకంటే వారు తమ యూఏఈ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి ఫోన్ పేకి సైన్ ఇన్ చేయవచ్చు. చెల్లింపు చేయడానికి వారి నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (ఎన్ఆర్ఈ) బ్యాంక్ ఖాతాను లింక్ చేయవచ్చు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వివిధ గ్లోబల్ పేమెంట్ బాడీలతో భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇతర దేశాలకు యూపీఐ తన పరిధిని విస్తరించింది. యూఏఈలో నివసిస్తున్న లేదా దేశానికి వెళ్లే వ్యక్తులు ఇప్పుడు త్వరిత, సురక్షితమైన యూపీఐ చెల్లింపు సేవ ప్రయోజనాన్ని పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..