Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన.. ఏ వయసులో ఈ స్కీమ్‌తో లాభం?
ఇతర చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే ఈ స్కీమ్ అత్యధికంగా 8.2% వడ్డీ రేటును అందిస్తుంది. సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. మీకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అదనంగా, సుకన్య యోజన కింద మెచ్యూరిటీపై అందుకున్న మొత్తమంతా పన్ను రహితమే. రాజన్ అధిక వడ్డీ , పన్ను ప్రయోజనాలకు అందుతున్నా...
మనం మన కుమార్తెల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం గురించి చర్చించినప్పుడు, అనుకోకుండానే సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రస్తావన వస్తుంది. రాజన్ తన స్నేహితులు లేదా సలహాదారులతో మాట్లాడినప్పుడు, అతని 10 ఏళ్ల కుమార్తె రియా కోసం సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టే విషయంపైనే ఆ చర్చ నడుస్తుంది.
ఇతర చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే ఈ స్కీమ్ అత్యధికంగా 8.2% వడ్డీ రేటును అందిస్తుంది. సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. మీకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అదనంగా, సుకన్య యోజన కింద మెచ్యూరిటీపై అందుకున్న మొత్తమంతా పన్ను రహితమే. రాజన్ అధిక వడ్డీ , పన్ను ప్రయోజనాలకు అందుతున్నా… ఇది అతనికి సరైన పెట్టుబడి కాకపోవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో రాజన్ ఎందుకు పెట్టుబడి పెట్టకూడదో తెలుసుకుందాం.
సుకన్య యోజనలో, కుమార్తె కోసం 10 సంవత్సరాల వరకు ఖాతాను తెరవవచ్చు. రాజన్ కుమార్తెకు కూడా పదేళ్లు. అతను ఖాతాను తెరవగలడు, అతను 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. రాజన్ 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయడానికి ఓకే చెప్పచ్చు. కానీ సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. జనవరి 2024లో రియా కోసం రాజన్ ఖాతాను తెరిచాడని అనుకుందాం; మెచ్యూరిటీ 2045లో ఉంటుంది. ఆ సమయానికి, రియాకు 31 ఏళ్లు ఉంటాయి. ఆమె ఉన్నత విద్యను అభ్యసిస్తున్న టైమ్ కే…. జీవితంలో ముఖ్యమైన సమయాన్ని దాటేసి ఉంటుంది. రియా రెండేళ్ల వయసులో రాజన్ ఖాతా తెరిచి ఉంటే, అది మరింత తెలివైన పని అయ్యుండేది.
రియాకు 18 ఏళ్లు నిండినప్పుడు ఆమె విద్య కోసం దాచి ఉంచిన మొత్తంలో 50% రాజన్ విత్‌డ్రా చేసుకోవచ్చు. రాజన్ సుకన్య ఖాతాలో ఏటా 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. రియా ప్రస్తుతం 10 ఏళ్ల వయస్సు ఉన్నందున, ఆమెకు 18 ఏళ్లు వచ్చేసరికి మొత్తం రూ. 12 లక్షల పెట్టుబడి అవుతుంది. ప్రస్తుత 8.2% వడ్డీ రేటును పరిగణనలోకి తీసుకుంటే 8 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం 16.95 లక్షల రూపాయలు కావచ్చు. రాజన్ అప్పుడు ఉండే ఈ మొత్తంలో 50% విత్‌డ్రా చేయగలరు. అది ఆ అమౌంట్ 8.47 లక్షల రూపాయలు.
అయినా, ద్రవ్యోల్బణం కారణంగా ఈ మొత్తం ఆమె ఉన్నత విద్య ఫీజులను పూర్తిగా కవర్ చేయకపోవచ్చు. ముందస్తుగా విత్ డ్రా చేయకపోతే.. 2045 నాటికి కార్పస్ సుమారు 70 లక్షల రూపాయలకు పెరుగుతుంది. దీనికి కారణం పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఆర్థిక నిపుణుడు బల్వంత్ జైన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే… సుకన్య యోజన కూతురి చదువు, పెళ్లికి మంచి ఎంపిక. అయినా, అతను దానిని ముందుగానే ప్రారంభించడానికి ఉన్న ప్రాముఖ్యతను గట్టిగా చెప్పారు. సుదీర్ఘ లాక్-ఇన్ పీరియడ్‌తో, మీ స్వల్పకాలిక అవసరాలను తీర్చుకోవడానికి ఇది తగినది కాదు. మీరు దీర్ఘకాలిక పెట్టుబడిదారు అయితేనే ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలి.
రాజన్ క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక అని చెప్పచ్చు. 15 సంవత్సరాల కాలంలో సవాలక్ష మార్కెట్ పరిస్థితుల్లో కూడా, 12% వార్షిక రాబడి సాధ్యమవుతుంది. ELSSని ఎంచుకోవడం కూడా పన్నులను ఆదా చేయడంలో సహాయపడుతుంది.
రాజన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏటా 1.5 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెడితే, అతను 10 సంవత్సరాలలో దాదాపు 29 లక్షల రూపాయలను పోగు చేయవచ్చు. ఇది 12% రాబడిని అంచనా వేస్తోంది. దీనికి విరుద్ధంగా, SSY లో 8 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టడం వల్ల దాదాపు 8.47 లక్షల రూపాయలు మాత్రమే లభిస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో వార్షికంగా 1.5 లక్షల రూపాయల పెట్టుబడిని 15 సంవత్సరాల పాటు కొనసాగిస్తే మొత్తం 22.5 లక్షల రూపాయల పెట్టుబడి అవుతుంది. వడ్డీతో కలిపి రాజన్ … 63 లక్షల రూపాయల మొత్తాన్ని కూడగట్టవచ్చు. ఒకవేళ 21 ఏళ్ల తర్వాత విత్ డ్రా చేసుకుంటే.., ఈ మొత్తం 1.24 కోట్ల రూపాయలకు పెరగవచ్చు. ఇది అతని కుమార్తె కలలను నెరవేర్చడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆకర్షణీయమైన వడ్డీ , పన్ను ఆదా ప్రయోజనాల కారణంగా సుకన్య సమృద్ధి మంచి ప్లాన్. అయితే, రాబడుల పరంగా చూస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీనిని అధిగమిస్తాయి. మీ కుమార్తె పెద్దదైతే, ఆమె ఉన్నత విద్య కోసం సుకన్య ఖాతాను తెరవడం తెలివైన నిర్ణయం కాకపోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచి ఆప్షన్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి