AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Digital: రిలయన్స్ డిజిటల్ నూతన స్టోర్.. ప్రారంభించిన ప్రముఖ నటి నభా నటేష్

రిలయన్స్ డిజిటల్ తన నూతన స్టోర్‌ను హయత్ నగర్‌లో బాగత్ విలేజ్ ఆర్టీసీ సూపర్ వైజర్స్ కాలనీ ఎదురుగా ప్రారంభించింది. గ్రౌండ్, పై అంతస్తుతో 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టోర్ సరసమైన ధరలలో విస్తృత శ్రేణి తాజా ఎలక్ట్రానిక్స్ అందిస్తుంది. అలాగే ఇన్-స్టోర్ సహాయం కోసం నిపుణులైన టెక్ స్క్వాడ్, ఎలక్ట్రానిక్స్ కొనుగోలు అనంతర సంరక్షణకు అంకితమైన రెస్క్యూ సర్వీస్ నిపుణులను..

Reliance Digital: రిలయన్స్ డిజిటల్ నూతన స్టోర్.. ప్రారంభించిన ప్రముఖ నటి నభా నటేష్
Reliance Digital
Subhash Goud
|

Updated on: Aug 03, 2024 | 5:02 PM

Share

రిలయన్స్ డిజిటల్ తన నూతన స్టోర్‌ను హయత్ నగర్‌లో బాగత్ విలేజ్ ఆర్టీసీ సూపర్ వైజర్స్ కాలనీ ఎదురుగా ప్రారంభించింది. గ్రౌండ్, పై అంతస్తుతో 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టోర్ సరసమైన ధరలలో విస్తృత శ్రేణి తాజా ఎలక్ట్రానిక్స్ అందిస్తుంది. అలాగే ఇన్-స్టోర్ సహాయం కోసం నిపుణులైన టెక్ స్క్వాడ్, ఎలక్ట్రానిక్స్ కొనుగోలు అనంతర సంరక్షణకు అంకితమైన రెస్క్యూ సర్వీస్ నిపుణులను కూడా అందిస్తుంది. వేగవంతమైన డెలివరీ, ఇన్ స్టాలేషన్ తో వినియోగదారులు ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా తమకు ఇష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందవచ్చు.

ఈ రిలయన్స్ డిజిటల్ హయత్ నగర్ స్టోర్ ను ప్రముఖ నటి నభా నటేష్ ప్రారంభించారు. ప్రముఖ నటితో మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొని ఎక్స్ క్లూజివ్ సంతకం చేసిన సరుకులను అందుకునే అవకాశం కూడా లభించింది. రిలయన్స్ డిజిటల్ కొత్త స్టోర్లో అద్భుతమైన ఎర్లీ బర్డ్ ఆఫర్లతో ప్రముఖ బ్యాంక్ కార్డులపై 10% వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది.

రిలయన్స్ డిజిటల్ 500కు పైగా అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లకు చెందిన 2,000కు పైగా ఉత్పత్తులను అందిస్తోంది. వీటిలో తాజా స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, హోమ్ థియేటర్లు, డిజిటల్ కెమెరాలు, ల్యాప్‌టాప్స్‌, యాక్సెసరీస్, ఇతర చిన్న ఎలక్ట్రానిక్స్ వస్తువులతో సహా వినియోగదారుల ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

“పర్సనలైజింగ్ టెక్నాలజీ”కి అనుగుణంగా రిలయన్స్ డిజిటల్ వినియోగదారులకు సరసమైన ధరలలో సాంకేతికత ఎంపికలను ప్రపంచాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈజీ ఈఎమ్ఐతో సహా బహుళ ఫైనాన్స్ ఎంపికలతో ఎలక్ట్రానిక్ పరికరాల పై తిరుగులేని డీల్స్‌ను అందించడం ద్వారా రిలయన్స్ డిజిటల్ ప్రతి కస్టమర్ వారి జీవనశైలికి తగిన ఖచ్చితమైన సాంకేతికతను కనుగొనడంలో సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుందని రిలయన్స్‌ డిజిటల్‌ తెలిపింది.

ఇది కూడా చదవండి: Bank Customers: ఆగస్టు 12 లోపు ఈ పని చేయండి.. లేకుంటే ఆ బ్యాంకు ఖాతాలు క్లోజ్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి