AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold rate: పడి లేచిన బంగారం ధర.. మరింత పెరుగుతుందా..? కారణాలు తెలిస్తే షాక్

మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి చాలా ఆసక్తి చూపుతారు. పండగలు, శుభకార్యాలు, ఇతర ముఖ్యమైన సమయాల్లో బంగారానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. బహుమతులను బంగారం రూపంలో అందజేయడం మన సంప్రదాయం. కాబట్టి దేశంలో బంగారం ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది.

Gold rate: పడి లేచిన బంగారం ధర.. మరింత పెరుగుతుందా..? కారణాలు తెలిస్తే షాక్
Gold Prices
Nikhil
|

Updated on: Aug 03, 2024 | 4:45 PM

Share

మన దేశంలో బంగారమంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండదు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి చాలా ఆసక్తి చూపుతారు. పండగలు, శుభకార్యాలు, ఇతర ముఖ్యమైన సమయాల్లో బంగారానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. బహుమతులను బంగారం రూపంలో అందజేయడం మన సంప్రదాయం. కాబట్టి దేశంలో బంగారం ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఇటీవల కేంద్ర బడ్జెట్ లో బంగారంపై దిగుమతి సుంకం తగ్గించిన నేపథ్యంలో దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అనంతరం తిరిగి పుంజుకుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

బంగారంపై సుంకం తగ్గింపు

బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ సుంకాలను తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ అంశాన్ని చేర్చింది. ఈ ప్రకటన తర్వాత బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అనంతరం తిరిగి మళ్లీ పెరుగుతోంది. ఎందుకంటే సుంకం తగ్గింపు ప్రభావం కన్నా సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, భవిష్యత్ ఆర్థిక విధానాలు ఎక్కువ ప్రభావం చూపాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎమ్సీఎక్స్)లో బంగారం ఫ్యూచర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఆగస్టు రెండో తేదీ నాటికి 10 గ్రాములకు రూ.641 పెరిగి రూ.70,595కి చేరుకుంది. న్యూయార్క్‌లో బంగారం ఫ్యూచర్స్ 1.12 శాతం పెరిగాయి. ఔన్సు రూ.2,508.60కు చేరింది.

పెరుగుతున్నధర

బంగారంపై దిగుమతి సుంకం తగ్గితే ధర కూడా తగ్గిపోవాలి. కానీ దానికి విరుద్ధంగా బంగారం రేటు పెరగడానికి అనేక కారణాలున్నాయి. సెప్టెంబర్ లో వడ్డీరేట్ల తగ్గుదల, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, ముఖ్యంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు దీనికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆసియాలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పాటు ఈటీఎఫ్ లు, దుకాణాల్లో భౌతిక కొనుగోళ్లు పెరగడం దీనికి కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.71 వేల నుంచి రూ.71,700లకు పెరిగిందని, సమీపంలో మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మార్కెట్ అంచనాలు

  • బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవారు జాగ్రత్తగా మార్కెట్ ను అంచనా వేయాలి. బంగారం ధరలు నిలకడగా పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.
  • ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణం నుంచి మనల్ని కాపాడే మార్గాలలో బంగారంలో పెట్టుబడి పెట్టడం చాలా ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అందుకే ఇప్పుడే కొనుగోలు చేయడం వల్ల ఉపయోగంగా ఉంటుంది.
  • ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, యుద్దాల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టడమే మంచింది.
  • బంగారం ధర ఎప్పుడు గణనీయంగా తగ్గిపోదు, స్వల్పంగా తగ్గినా వెంటనే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీర్థకాలంలో అనేక లాభాలుకలుగుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి