New National Highway: దేశంలో 8 కొత్త జాతీయ రహదారులు.. 6 లైన్‌ల రోడ్డు.. కేంద్రం ఆమోదం

భారతదేశంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే లక్ష్యంతో 8 కొత్త జాతీయ రహదారులను నిర్మించే ప్రణాళిక ఆమోదించింది కేంద్రం. ఈ ముఖ్యమైన ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్ట్ 936 కి.మీ పొడవుతో 8 హై-స్పీడ్ రోడ్ కారిడార్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీని అంచనా వ్యయం 50,655 కోట్లు..

New National Highway: దేశంలో 8 కొత్త జాతీయ రహదారులు.. 6 లైన్‌ల రోడ్డు.. కేంద్రం ఆమోదం
New National Highway
Follow us

|

Updated on: Aug 03, 2024 | 4:30 PM

భారతదేశంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే లక్ష్యంతో 8 కొత్త జాతీయ రహదారులను నిర్మించే ప్రణాళిక ఆమోదించింది కేంద్రం. ఈ ముఖ్యమైన ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్ట్ 936 కి.మీ పొడవుతో 8 హై-స్పీడ్ రోడ్ కారిడార్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీని అంచనా వ్యయం 50,655 కోట్లు.

దేశవ్యాప్తంగా మెరుగైన కనెక్టివిటీని నిర్ధారించడం, లాజిస్టిక్‌లను మరింత ప్రభావవంతంగా చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. అదే సమయంలో ఈ ప్రాజెక్టులను బ్రౌన్‌ఫీల్డ్ సైట్‌లకు అనుసంధానం చేయడానికి కృషి చేస్తామని, తద్వారా భూ సేకరణను తగ్గించవచ్చు. అలాగే నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయవచ్చని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా? ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్‌!

భూసేకరణ ప్రణాళిక

అదే సమయంలో ఈ ప్రాజెక్టుల కోసం భూసేకరణను కనిష్టంగా ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. దీని కోసం ఇప్పటికే ఎక్కడ భూమి అందుబాటులో ఉంటే దానిని ప్రాధాన్యతపై ఉపయోగిస్తారు. ఈ విధానం వల్ల భూసేకరణలో ఖర్చు, సమస్యలు కూడా తగ్గుతాయి.

ప్రధాన ప్రాజెక్టులు:

– ఆగ్రా-గ్వాలియర్ 6 లేన్ రోడ్

– ఖరగ్‌పూర్-మోరేగ్రామ్ కారిడార్

– కాన్పూర్ రింగ్ రోడ్

– గౌహతి రింగ్ రోడ్

– లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో రింగ్ రోడ్

– అయోధ్యలోని రింగ్ రోడ్

– పూణె-నాసిక్ 8-లేన్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్

ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌

ఈ ముఖ్యమైన ప్రాజెక్ట్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ తన ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ భారతదేశ మౌలిక సదుపాయాలను మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని, దేశ అభివృద్ధిని వేగవంతం చేస్తుందని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: Bank Customers: ఆగస్టు 12 లోపు ఈ పని చేయండి.. లేకుంటే ఆ బ్యాంకు ఖాతాలు క్లోజ్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి