Money tips: ఆ జాగ్రత్తలతో బోలెడంత డబ్బు మీ వెంటే..ఆర్థిక నిపుణుల సూచనలు ఏంటంటే..?

పిల్లలకు మంచి భవిష్యత్తును చూపించడానికి, సమాజం గౌరవంగా బతకటానికి చాలా అవసరం. మనిషికి గుర్తింపు అనేది డబ్బుతోనే ముడిపడి ఉంటుందనేది వాస్తవం. ఏది ఏమైనా సుఖంగా జీవించడానికి అవసరమయ్యే డబ్బును సంపాదించానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. దీని కోసం ఆర్థిక ప్రణాళిక అవసరం. డబ్బులను పొదుపు చేయడానికి కొందరు నిపుణులు కొన్ని చిట్కాలు తెలిపారు.

Money tips: ఆ జాగ్రత్తలతో బోలెడంత డబ్బు మీ వెంటే..ఆర్థిక నిపుణుల సూచనలు ఏంటంటే..?
Money
Follow us
Srinu

|

Updated on: Aug 03, 2024 | 4:25 PM

పిల్లలకు మంచి భవిష్యత్తును చూపించడానికి, సమాజం గౌరవంగా బతకటానికి చాలా అవసరం. మనిషికి గుర్తింపు అనేది డబ్బుతోనే ముడిపడి ఉంటుందనేది వాస్తవం. ఏది ఏమైనా సుఖంగా జీవించడానికి అవసరమయ్యే డబ్బును సంపాదించానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. దీని కోసం ఆర్థిక ప్రణాళిక అవసరం. డబ్బులను పొదుపు చేయడానికి కొందరు నిపుణులు కొన్ని చిట్కాలు తెలిపారు. చాలా మంది తాము సంపాదించిన డబ్బు అవసరాలకే సరిపోతోందని, పొదుపు చేయలేెకపోతున్నామని ఆందోళన చెందుతారు. కానీ సరైన ప్రణాళికతో ముందుకు వెళితే డబ్బులను సంపాదించడం కష్టమేమీకాదు. బడ్జెట్‌ వేసుకోవడం, రోజువారీ ఖర్చుల చిట్టా నిర్వహించడం, స్వల్ప, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా అనుకున్న ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవచ్చు. కాబట్టి డబ్బును సంపాదించలేకపోతున్నామన్న క్యాష్ క్రంచ్ ఫీలింగ్‌ను అధిగమించడం చాలా అవసరం. అందువల్ల డబ్బను పొదుపు చేయడానికి నిపుణుల సూచనలను ఓ సారి తెలుసుకుందాం.

బడ్జెట్

మీరు సంపాదించే ఆదాయం, మీ ఖర్చులపై స్పష్టమైన అవగాహన ఉండాలి. దాని కోసం బడ్జెట్ వేసుకోవడం చాలా అవసరం. అప్పుడే మీరు పొదుపు చేయగలిగే ఆదాయంపై కచ్చితమైన లెక్క ఉంటుంది.

 ఖర్చులు

మీరు చేసే ఖర్చులపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడం వల్ల పొదుపు చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

ఆర్థిక లక్ష్యాలు

ప్రతి ఒక్కరికీ ఆర్థిక లక్ష్యాలు ఉండడం చాలా అవసరం. లేకపోతే డబ్బులు సంపాదించడం కుదరదు. ఆర్థిక లక్ష్యాలే మీకు ఉత్సాహం కలిగించి, డబ్బును సంపాదించడానికి తోడ్పడతాయి. స్వల్ప, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం వల్ల డబ్బులను పొదుపు చేేసే అవకాశం కలుగుతుంది.

అవసరాలు

మీ ఖర్చులపై పర్యవేక్షణ చాలా ముఖ్యం. మీరు డబ్బులను అవసరాలకు ఖర్చు చేస్తున్నారా, విలాసాలకు వెచ్చిస్తున్నారా గమనించుకోవాలి. అవసరాలకు ఖర్చు చేయడం తప్పదు. విలాసాలు, లగ్జరీలకు వెచ్చిస్తే మాత్రం వాటిని తగ్గించుకోవాలి. ఆ డబ్బులను పొదుపు పథకాలలో పెట్టుబడి పెడితే కొంతకాలానికి మీరు పెద్ద మొత్తంలో సొమ్ములను అందిస్తాయి.

అత్యవసర నిధి

మనకు జీవితంలో అత్యవసర ఖర్చులు ఎదురుపడతాయి. వాటిని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. లేకపోతే అప్పులు చేయాల్సి ఉంటుంది. వాటికి వడ్డీల రూపంలో భారం పడుతుంది. కాబట్టి అత్యవసర సమయంలో ఖర్చు పెట్టుకోవడానికి కొంత పొదుపు చేయాలి. అత్యవసర నిధి రూపంలో డబ్బులను దాచుకోవడం చాలా ఉత్తమం.

పెట్టుబడి, పొదుపు

నెలవారీ ఆదాయాన్ని, కుటుంబ ఖర్చులను లెక్క వేసుకుని ఎంత పొదుపు చేయగలతో గమనించండి. ఆ పొదుపు వివిధ పథకాలలో పెట్టుబడిగా పెట్టండి. ఈ అలవాటు మీకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. పొదుపు చేసేందుకు మీకు ఆత్మవిశ్వాసం కల్పిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి