AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC Life Penalty: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కి 2 కోట్ల జరిమానా.. కారణం ఏంటో తెలుసా?

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) బీమా కంపెనీ HDFC లైఫ్‌పై చర్య తీసుకుంది. రెగ్యులేటర్ కంపెనీకి రూ.2 కోట్ల జరిమానా విధించింది. రెగ్యులేటర్ ఈ చర్య నిబంధనలకు అనుగుణంగా అక్రమాలకు సంబంధించింది. దీనిపై తీసుకున్న చర్యల గురించి కంపెనీ స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ ద్వారా ఈ చర్య తీసుకునే ముందు ఆన్-సైట్ ఇన్‌స్పెక్షన్ జరిగిందని రెగ్యులేటరీ..

HDFC Life Penalty: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కి 2 కోట్ల జరిమానా.. కారణం ఏంటో తెలుసా?
Hdfc Life
Subhash Goud
|

Updated on: Aug 03, 2024 | 3:56 PM

Share

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) బీమా కంపెనీ HDFC లైఫ్‌పై చర్య తీసుకుంది. రెగ్యులేటర్ కంపెనీకి రూ.2 కోట్ల జరిమానా విధించింది. రెగ్యులేటర్ ఈ చర్య నిబంధనలకు అనుగుణంగా అక్రమాలకు సంబంధించింది. దీనిపై తీసుకున్న చర్యల గురించి కంపెనీ స్టాక్ మార్కెట్‌కు తెలియజేసింది. రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ ద్వారా ఈ చర్య తీసుకునే ముందు ఆన్-సైట్ ఇన్‌స్పెక్షన్ జరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ తెలిపింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సెప్టెంబర్ 2020లో ఆన్-సైట్ తనిఖీని నిర్వహించింది. ఆ తర్వాత ఇప్పుడు పెనాల్టీ విధించాలని రెగ్యులేటర్ నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: Bank Customers: ఆగస్టు 12 లోపు ఈ పని చేయండి.. లేకుంటే ఆ బ్యాంకు ఖాతాలు క్లోజ్‌

రెండు వేర్వేరు కేసుల్లో జరిమానా:

ఇవి కూడా చదవండి

రెండు వేర్వేరు కేసుల్లో కంపెనీకి కోటి రూపాయల జరిమానా విధించారు. మొదటి కేసు పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించినది. అందుకు గాను హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌పై ఐఆర్‌డిఏఐ కోటి రూపాయల జరిమానా విధించింది. అదే సమయంలో వివిధ సేవల అవుట్‌సోర్సింగ్‌కు సంబంధించిన అవకతవకలకు కంపెనీకి ప్రత్యేకంగా రూ.1 కోటి జరిమానా విధించబడింది. ఇలా మొత్తం రూ.2 కోట్ల జరిమానా విధించారు.

సంస్థకు పలు సూచనలు

ఫైనాన్షియల్ పెనాల్టీ విధించడమే కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కి ఐఆర్‌డీఏ ఇతర సూచనలను కూడా ఇచ్చింది. రెగ్యులేటర్ ద్వారా కంపెనీకి అనేక ఆదేశాలు, సలహాలు అందించింది. ఇచ్చిన సూచనలను సరిగ్గా పాటించాలని కంపెనీకి తెలిపింది. లోపాలను గుర్తించి నిర్ణీత గడువులోగా సరిచేయాలని కూడా కంపెనీని కోరింది. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని ఐఆర్‌డిఎఐ తెలిపింది.

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏ) ఆగస్టు 1న జరిమానా విధించి ఆదేశాలు ఇవ్వడంతో ఈ చర్య తీసుకుంది. భారతదేశంలో బీమా రంగాన్ని పర్యవేక్షించడానికి, సరైన వృద్ధిని నిర్ధారించడానికి IRDA సృష్టించబడింది. బీమా పరిశ్రమ వృద్ధికి భరోసా ఇస్తూ పాలసీదారులందరి ప్రయోజనాలను పరిరక్షించడం ఐఆర్‌డీఏఐ ప్రధాన లక్ష్యం.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా? ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి