Ratan tata: రతన్ టాటాకు నెరవేరని కల ఇదేనా.. ? ఈవీ కారు ఆగిపోవడానికిి కారణమిదే
లాభాలను ఆశించికుండా, ప్రజల సంక్షేమాన్ని కోరుకున్న వ్యాపారవేత్త రతన్ టాటా ముంబైలో ఇటీవల కన్నుమూశారు. ఆయన మరణం విని ప్రజలందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. దేశంలో అనేక మంది పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. సంపాదనలో అనేక మెట్లు ఎక్కుతూ ప్రపంచ కుబేరులతో పోటీ పడుతున్నారు. కానీ వారందరికీ మించిన ఆదరణ రతన్ టాటా పొందారు.
లాభాలను ఆశించికుండా, ప్రజల సంక్షేమాన్ని కోరుకున్న వ్యాపారవేత్త రతన్ టాటా ముంబైలో ఇటీవల కన్నుమూశారు. ఆయన మరణం విని ప్రజలందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. దేశంలో అనేక మంది పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. సంపాదనలో అనేక మెట్లు ఎక్కుతూ ప్రపంచ కుబేరులతో పోటీ పడుతున్నారు. కానీ వారందరికీ మించిన ఆదరణ రతన్ టాటా పొందారు. ఆయన జీవన విధానం, ఆలోచనలు, సేవాగుణం అందరికీ స్ఫూర్తిదాయకం. టెట్లీ టీ నుంచి జాగ్వార్ ల్యాండ్ రోవర్, ఎయిర్ ఇండియా వరకూ రతన్ టాటా అన్ని వస్తువులను పరిశీలించారు. కానీ ఆయన కలలు గన్న నానో ఎలక్ట్రిక్ వెర్షన్ ఆయన ఉండగా బయటకు రాలేదు. కోయంబత్తూరుకు చెందిన జయమ్ ఆటోమెటీవ్స్ (జయం ఆటో)తో కలిసి టాటా ఈ ఉత్పత్తి ప్రారంభించింది. కోవిడ్, ఇతర కారణాలతో కార్ల తయారీ ముందుకు సాగలేదు.
భవిష్ అగర్వాల్ పోస్టు
ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఇటీవల సామాజిక మాద్యమం ఎక్స్ లో నానో ఎలక్ట్రిక్ కారు విషయాన్ని గుర్తుచేశారు. రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఆయన ఆహ్వానం మేరకు కోయంబత్తూరు వెళ్లి టెస్ట్ ట్రాక్ లో కారును నడిపామని తెలిపారు. ఆ అనుభవం ఓలా ఎలక్ట్రిక్ ను ప్రారంభించేందుకు తనకు ప్రేరణ కలిగించిందన్నారు.
కోయంబత్తూరులో టెస్ట్ డ్రైవ్
రతన్ టాటా 2017 లో భవిష్ అగర్వాల్ కు ఫోన్ చేసి ముంబై రావాలని ఆహ్వానించారు. నీకు ఒక ఉత్తేజకరమైన విషయాన్నిచూపిస్తానని తెలిపారు. దీంతో భవిష్ ముంబై వెళ్లారు. అక్కడి నుంచి రతన్ టాటా ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు వెళ్లారు. అక్కడ నానో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నారు. అక్కడి టెస్ట్ ట్రాక్ లో రతన్ తో కలిసి భవిష్ డ్రైవింగ్ చేశారు. ఆ సమయంలో రతన్ ఈవీలపై చాాలా ఉత్సాహంగా ఉన్నారు.
2015లో ప్రణాళిక
టాటా కంపెనీ 2015 నుంచే తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. దానిలో భాగంగా నియో ఈవీ (నానో ఎలక్ట్రిక్ ) ఉత్పత్తి జరిగింది. దాన్నిజయం, ట్రాటా గ్రూప్ సంయుక్తంగా డెవలప్ చేశాయి. మీడియాలో వచ్చిన వార్త ప్రకారం.. ఈ కారును 48, 72 వెర్షన్లలో తయారు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. జయం కంపెనీ 400 కార్ల బ్యాచ్ ఉత్పత్తిని ప్రారంభించడంతో ఈ ప్రాజెక్టు ఊపందుకుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ముందుకు సాగలేదు అప్పటికే ఉత్పత్తి చేసిన కార్లను హైదరాబాద్, బెంగళూరులో వినియోగించడానికి ఓలా క్యాబ్ లకు సరఫరా చేసింది. జయం ఆటో మేనేజింగ్ డైరెక్టర్ జె.ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం..అనేక ప్రభుత్వ నిబంధనల కారణంగా ప్రాజెక్టు విజయవంతం కాలేదు. కోవిడ్ 19, కొత్త క్రాష్ నిబంధనలు తదితర వివిధ కారణాలున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..