Ratan Tata: మీ స్మృతులు మరవలేమంటున్న నెటిజన్లు.. రతన్ టాటాకు సోషల్ మీడియాలో భారీగా పెరుగున్న ఫాలోవర్స్..

కొందరు మరణించీ చిరంజీవులు.. ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు. సమయం, సందర్భంతో పని లేదు.. అటువంటి మహనీయులను తలచుకోవడానికి.. ఇటీవల భారతదేశం కోహినూర్ కంటే విలువైన రత్నం.. రతన్ టాటాను కోల్పోయింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ.. రతన్ టాటాను పోగొట్టుకున్న బాధను అనుభవిస్తున్నారు. అందరి ముఖంలో ఆ బాధ కనిపిస్తుంది. రతన్ టాటా మరణించిన 4 రోజుల్లోనే ఇన్ స్టాగ్రామ్ లో రతన్ తాతా పేజీని అనుసరించే వారు భారీగా పెరిగారు.

Ratan Tata: మీ స్మృతులు మరవలేమంటున్న నెటిజన్లు.. రతన్ టాటాకు సోషల్ మీడియాలో భారీగా పెరుగున్న ఫాలోవర్స్..
Ratan Tata Instagram FollowersImage Credit source: Ratan Tata Instagram Followers
Follow us
Surya Kala

|

Updated on: Oct 14, 2024 | 7:06 PM

కొందరు మరణించీ చిరంజీవులు.. ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు. సమయం, సందర్భంతో పని లేదు.. అటువంటి మహనీయులను తలచుకోవడానికి.. ఇటీవల భారతదేశం కోహినూర్ కంటే విలువైన రత్నం.. రతన్ టాటాను కోల్పోయింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ.. రతన్ టాటాను పోగొట్టుకున్న బాధను అనుభవిస్తున్నారు. అందరి ముఖంలో ఆ బాధ కనిపిస్తుంది. రతన్ టాటా మరణించిన 4 రోజుల్లోనే ఇన్ స్టాగ్రామ్ లో రతన్ తాతా పేజీని అనుసరించే వారు భారీగా పెరిగారు. ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది పెరిగారు. రతన్ టాటా గురించిన ఎన్నో జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. రతన్ టాటాను అనుసరించని వ్యక్తులు కూడా ఇప్పుడు రతన్ టాటా పేజీని అనుసరిస్తున్నారు. రతన్ టాటా పోస్ట్‌ల చూడడమే కాదు క్రింద తమ ప్రేమని తెలియజేస్తూ రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

4 రోజుల్లో 1 మిలియన్ ఫాలోవర్స్

రతన్ టాటా మరణించిన రోజు వరకు.. రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌ని పేజీని దాదాపు 10 మిలియన్ల మంది అనుసరించేవారు. అయితే ఆయన తుది శ్వాస విడిచి భువి నుంచి దివికేగిన అనంతరం అంటే కేవలం 4 రోజుల్లోనే రతన్ టాటా ఫాలోవర్స్ 1 మిలియన్లు పెరిగారు. కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 67 పోస్ట్‌లను మాత్రమే షేర్ చేశారు. వీటిని నెటిజన్లు చాలా ఇష్టపడ్డారు. ఇష్టపడుతున్నారు కూడా.. చాలా మంది అనుచరులున్న రతన్ టాటా మాత్రం కేవలం రెండు ఖాతాలను మాత్రమే అనుసరించేవారు. మొదటి పేజీ ముంబైలోని చిన్న జంతు ఆసుపత్రి, రెండవది టాటా ట్రస్ట్.

రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ ఫాలోయింగ్

Ratan Tata Instagram Followers And Following

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో రతన్ టాటాకు ఫ్యాన్ ఫాలోయింగ్

రతన్ టాటా అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాపారవేత్త.. ఇంకా చెప్పాలంటే జీరో హేటర్స్ ఉన్న వ్యాపార వేత్త రతన్ టాటా అని చెప్పవచ్చు. రతన్ టాటాకు X ప్లాట్‌ఫారమ్‌లో కోట్లాది మంది అనుచరులు కూడా ఉన్నారు. X ప్లాట్‌ఫారమ్‌లో రతన్ టాటా పేజీని 13.2 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.. ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయితే ఇక్కడ కూడా రతన్ టాటా కేవలం 7 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో రతన్ టాటా చివరి పోస్ట్

రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో తన చివరి పోస్ట్‌ను అక్టోబర్ 9 న చేశారు అందులో తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దు అంటూ తెలిపారు. రతన్ టాటా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స అన్న వార్తలు వినిపించినప్పటి నుంచి ప్రజలు ఆందోళన చెందుతున్నారు అన్న విషయం తెలుసుకున్న రతన్ టాటా తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రతన్ టాటా చేసిన ఈ చివరి పోస్ట్‌ను సుమారు 2,664,124 మంది వ్యక్తులు లైక్ చేసారు. వేలాది మంది కామెంట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..