Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు.. రేపు సిఫార్సు లేఖలు స్వీకరింమని ప్రకటన.. ఎందుకంటే
దక్షిణ కోస్తాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వార్నింగ్ ఇచ్చింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గంటకు 35-45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండగా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాల్లోని మండలాల్లో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండగా తుఫాన్ ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనాలపై పడింది.
వర్షాలు వరదలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ తుఫాన్ గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం వలన రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీకి భారీ వర్ష సూచన తో టీటీడీ అప్రమత్తం అయ్యింది. దక్షిణ కోస్తాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వార్నింగ్ ఇచ్చింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గంటకు 35-45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండగా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాల్లోని మండలాల్లో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండగా తుఫాన్ ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనాలపై పడింది.
తిరుమలకు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ అలెర్ట్ అయ్యింది. అధికారులతో వర్చువల్ గా సమావేశమైన ఈవో శ్యామలరావు 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ అధికారులు విపత్తును ఎదుర్కోనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈఓ ఆదేశాలు జారీ చేశారు. తిరుమల కొండపై విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాలకు ఇబ్బంది ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలన్నారు. ఘాట్ రోడ్డులో అంబులెన్స్, ట్రక్కులు, ట్రాక్టర్, జేసిబిలతో పాటు సిబ్బందిని సంసిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు ఈవో శ్యామలరావు.
మరోవైపు భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. వాతావరణ శాఖ హెచ్చరికలు దృష్ట్యా 16న తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. కనుక రేపు అంటే అక్టోబరు 15న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరింమని ఓ ప్రకటన జారీ చేసింది. ఈ విషయాన్నీ భక్తులు గమనించి తిరుమల సిబ్బందికి సహకరించాలని టీటీడీ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..