AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharad Purnima: శరత్ పౌర్ణమి రోజున ఈ వస్తువులను దానం చేయండి.. ఏడాది పొడవునా డబ్బుకు లోటు ఉండదు

శరత్ కాలంలో ఈ రోజున చంద్రుడు 16 కళల్లో ప్రకశిస్తాదని.. చంద్రుని కిరణాలలో అమృతం ఉంటుందని నమ్మకం. ఈ రోజున చేసే పూజకు, స్నానానికి, దానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఈ రోజున దానధర్మాలు చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారు. పంచాంగం ప్రకారం ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథి అక్టోబర్ 16 బుధవారం రాత్రి 08:41 గంటలకు ప్రారంభమవుతుంది.

Sharad Purnima: శరత్ పౌర్ణమి రోజున ఈ వస్తువులను దానం చేయండి.. ఏడాది పొడవునా డబ్బుకు లోటు ఉండదు
Sharad Purnima
Surya Kala
|

Updated on: Oct 14, 2024 | 5:18 PM

Share

హిందూ మతంలో ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసం శుక్ల పక్ష పౌర్ణమిని శరత్ పూర్ణిమ పండుగగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుడు, రాధలతో పాటు శివపార్వతులను పూజించే సంప్రదాయం ఉంది. అంతే కాదు చంద్రుడిని కూడా పుజిస్తారు. శరత్ కాలంలో ఈ రోజున చంద్రుడు 16 కళల్లో ప్రకశిస్తాదని.. చంద్రుని కిరణాలలో అమృతం ఉంటుందని నమ్మకం. ఈ రోజున చేసే పూజకు, స్నానానికి, దానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఈ రోజున దానధర్మాలు చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారు.

పంచాంగం ప్రకారం ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథి అక్టోబర్ 16 బుధవారం రాత్రి 08:41 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే గురువారం అక్టోబర్ 17 సాయంత్రం 04:53 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో శరత్ పూర్ణిమ పండుగను అక్టోబర్ 16 న మాత్రమే జరుపుకుంటారు. ఈ రోజు సాయంత్రం 05:04 గంటలకు చంద్రోదయం జరుగుతుంది.

శరత్ పూర్ణిమ రోజున అన్న వితరణ చేయడం మంచిదని నమ్మకం. ఈ రోజున అన్నం సంతర్పణ చేయడం వల్ల లక్ష్మీ దేవిని ప్రసన్నం అవుతుందని ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం. బియ్యం శ్రేయస్సు, సంపదలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. శరత్ పూర్ణిమ రోజున అన్నవితరణ చేయడం వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నురాలై ఇంట్లో సంపద పెరుగుతుంది. అంతే కాదు, శరత్ పూర్ణిమ రోజున అన్నవితరణ చేయడం వల్ల మనిషి జీవితంలోని సమస్యలు తొలగిపోయి మంచి ఫలితాలు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

శరత్ పూర్ణిమ రోజున ఈ వస్తువులను దానం చేయడం శుభప్రదం..

  1. బియ్యం: బియ్యం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రంగా భావిస్తారు. శరత్ పూర్ణిమ రోజున తెల్ల బియ్యాన్ని దానం చేయడం వల్ల సంపదలు చేకూరుతాయి.
  2. పాలు: పాలు స్వచ్ఛతకు చిహ్నం. పాలు దానం చేయడం వల్ల ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ధన లాభం వస్తుంది.
  3. చందనం: గంధాన్ని శుభప్రదంగా భావిస్తారు. గంధాన్ని దానం చేయడం ద్వారా ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. సంపదల దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
  4. వస్త్రాలు: పేదవారికి వస్త్రదానం చేయడం వల్ల పుణ్యం, ధనలాభం కలుగుతాయి.
  5. పండ్లు: పండ్లు దేవతలకు ప్రీతికరమైనవి. పండ్లను దానం చేయడం ద్వారా సకల దేవతల అనుగ్రహం పొంది ఐశ్వర్యాన్ని పొందుతాడు.
  6. బెల్లం: బెల్లం శ్రేయస్సు, ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దీన్ని దానం చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. బెల్లం దానం చేయడం వల్ల పితృ దోషాలు తొలగిపోయి పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది.
  7. దీప దానం: దీపం జ్ఞానానికి ప్రతీక. దీపదానం చేయడం వల్ల జ్ఞాన వ్యాప్తి చెందుతుంది. మేధస్సు అభివృద్ధి చెందుతుంది. దీపదానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా కోరుకున్న ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు

దానం చేసే సముయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి

  1. దానం చేసేటప్పుడు మనసులో ఎలాంటి దురాశ, ద్వేషం ఉండకూడదు.
  2. దానం ఎల్లప్పుడూ అవసరంలో ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలి.
  3. దానం చేసేటప్పుడు నిర్మలమైన మనస్సుతో “ఓం” జపిస్తూ ఉండండి.
  4. శరత్ పూర్ణిమ రాత్రి చంద్రకాంతిలో పరమాన్నం తయారు చేసి, దానిని ప్రసాదంగా తినండి.

లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగించండి.

శరత్ పూర్ణిమ రోజున ఈ చర్యలు చేయడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. సంవత్సరం పొడవునా డబ్బుకు లోటు ఉండదు.

దాతృత్వం ప్రాముఖ్యత

హిందూ మతంలో దానం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మానవుని మోక్షానికి దాతృత్వమే ఏకైక మార్గం అని నమ్ముతారు. ప్రజలు మనశ్శాంతి కోసం, కోరికల నెరవేర్చుకోవడానికి, పుణ్య ప్రాప్తి కోసం, గ్రహ ప్రభావాల నుంచి భగవంతుని ఆశీర్వాదాల లభించడానికి దానం చేస్తారు. హిందూ మతంలోని దానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మీరు చేసిన దానం వలన కలిగే ప్రయోజనం జీవితంలో మాత్రమే కాదు మరణానంతరం కూడా ఉంటుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)