AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: సరదాగా డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకున్న దంపతులు.. రిజల్ట్ చూసి షాక్‌కు గురైన భార్యాభార్తలు

సైన్స్ అభివృద్ధి తర్వాత తన గురించి తాను ఎక్కువగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి కోరికవలన చాలాసార్లు అనేక రహస్యాలు బయటపడ్డాయి. ఒకొక్కసారి జీవితం ముక్కలయింది అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఒక జంట జీవితంలో చోటు చేసుకుంది. తమ జన్మ రహస్యం తెలిసిన తర్వాత వీరి జీవితం పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. వివాహంపై , దాంపత్య జీవితంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి

Viral News: సరదాగా డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకున్న దంపతులు.. రిజల్ట్ చూసి షాక్‌కు గురైన భార్యాభార్తలు
Viral NewsImage Credit source: social media
Surya Kala
|

Updated on: Oct 14, 2024 | 3:41 PM

Share

కొన్ని రహస్యాలు దాచుకుంటే జీవితం సుఖంగా సాగుతుందని అంటారు. అనుకోకుండా ఆ రహస్యాలు తెరుచుకుంటే జీవితం పూర్తిగా ఛిద్రమవుతుంది. ఏదేమైనా.. సైన్స్ అభివృద్ధి తర్వాత తన గురించి తాను ఎక్కువగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి కోరికవలన చాలాసార్లు అనేక రహస్యాలు బయటపడ్డాయి. ఒకొక్కసారి జీవితం ముక్కలయింది అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఒక జంట జీవితంలో చోటు చేసుకుంది. తమ జన్మ రహస్యం తెలిసిన తర్వాత వీరి జీవితం పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. వివాహంపై , దాంపత్య జీవితంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి.

ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన నివాసి సెలీనా, జోసెఫ్ క్వినోస్‌లు పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పదేళ్లుగా ఇద్దరూ హ్యాపీ వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఓ రోజు సరదాగా డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరీక్షలన్నీ చాలా సులువుగా చేయించుకోవచ్చు. దీని కారణంగా ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి సులభంగా డిఎన్ ఏ పరీక్షలను చేయించుకుంటారు. ఆ జంట కూడా అదే చేసింది. DNA పరీక్షను చేయించుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన నిజం వారి కాళ్ల కింద భూమి కుంగి పోయిందా అనేలా చేసింది.

DNA పరీక్షలో షాకింగ్ నిజం

ఈ దంపతులు తాము తీసుకున్న నిర్ణయానికి సంబంధించి విషయంపై పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. తమ వారసత్వం గురించి తెలుసుకోవాలనే కోరికతో మేము ఈ పరీక్ష చేయించుకున్నాం.. ఎందుకంటే మా కుమార్తె రంగు చాలా నల్లగా ఉంటుంది. అయితే తమ కొడుకు గిరజాల జుట్టుతో తెల్లగా అందంగా ఉంటాడు. దీంతో తమకు డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. అయితే మీరు ఎవరు, మీ నేపథ్యం ఏమిటి అని ప్రజలు తమని అడిగినప్పుడు స్థానిక అమెరికన్ అని చెప్పామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

డైలీ స్టార్ నివేదిక ప్రకారం సెలీనా, జోసెఫ్ క్వినోస్ DNA పరీక్ష చేయించుకున్నారు. అయితే ఈ పరీక్ష ఫలితం వారివద్దకు చేరినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. ఈ నివేదిక ప్రకారం సెలీనా, జోసెఫ్ వాస్తవానికి దాయాదులు. ఈ విషయం తెలిసిన తరువాత వీరిద్దరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే వీరికి ఈ విషయం గురించి తెలియదు ఎందుకంటే ఇప్పటికే మూడు తరాలు గడిచిపోయాయి. సోషల్ మీడియాలో తమ కథను కూడా పంచుకున్నారు. ఒకే కుటుంబంలోని వ్యక్తులను వివాహం చేసుకోవడం శాస్త్రీయంగా సరైనది కాదని చాలా మంది వ్యక్తులు విడాకులు తీసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే దీనిపై సెలీనా మాట్లాడుతూ.. తన భర్తను, పిల్లలను వదిలి వెళ్లడం తనకు ఇష్టం లేదని.. అందుకే తన భర్తకు విడాకులు ఇవ్వనని స్పష్టం చేసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..