Watch: ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.

Watch: ఆ ఊరిపై పాములు పగబట్టాయా.? ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పాములే.

|

Updated on: Oct 15, 2024 | 1:37 PM

విష సర్పాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.. బుసలు కొడుతూ భయపడుతున్నాయి.. ఇళ్లల్లో, వాకిట్లో, వాష్ రూమ్ లో ఎక్కడ చూసినా పాములే పాములు..! కొన్ని గంటల వ్యవధిలోనే మూడు పాములు ఒకే ప్రాంతంలో దర్శనమివ్వడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.. పాములు పగ పట్టాయా అన్నట్టుగా భయపెడుతున్నాయి విషసర్పాలు. అవి కూడా నాగుపాములే కావడంతో.. ఇక అక్కడ ఆందోళన మరింత పెరిగింది.

విష సర్పాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.. బుసలు కొడుతూ భయపడుతున్నాయి.. ఇళ్లల్లో, వాకిట్లో, వాష్ రూమ్ లో ఎక్కడ చూసినా పాములే పాములు..! కొన్ని గంటల వ్యవధిలోనే మూడు పాములు ఒకే ప్రాంతంలో దర్శనమివ్వడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.. పాములు పగ పట్టాయా అన్నట్టుగా భయపెడుతున్నాయి విషసర్పాలు. అవి కూడా నాగుపాములే కావడంతో.. ఇక అక్కడ ఆందోళన మరింత పెరిగింది. అల్లూరి ఏజెన్సీ పాడేరులో ఎక్కడ చూసినా పాములే కనిపిస్తున్నాయి. ఇటీవల ఎగిరే పాము రంగురంగుల్లో కనిపిస్తూ భయపెట్టింది. తాజాగా నాగుపాములు జనాలను పరుగులు పెట్టిస్తున్నాయి.

గంటల వ్యవధిలో అదే ప్రాంతంలో మూడు వేరు వేరు చోట్ల మూడు నాగుపాములు కనిపించాయి. రెండు రోజుల క్రితం చాకలిపేటలోని ఉపాధ్యాయుడు ఇంట్లో ఎగిరే పాము రంగురంగుల్లో కనిపించింది. అరుదైన ఆ వింత పామును చూసి అందరూ భయాందోళనకు గురయ్యారు. దాన్ని చాకచక్యంగా పట్టుకుని స్నేక్ క్యాచర్ సహాయంతో అడవుల్లో విడిచిపెట్టారు. ఆ భయం నుంచి తెరుకోకముందే.. మళ్లీ లోచలీపుట్టులో కనకమహాలక్ష్మి అనే మహిళ ఇంట్లో వాష్ రూమ్ లో నాగు పాము కనిపించింది. భారీ నాగుపామును చూసి హడాలెత్తి పోయారు కుటుంబ సభ్యులు. స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. దాన్ని రెస్క్యూ చేసిన కొంత సమయానికే గుడివాడ కాలనీలో మరో ఇంట్లో నాగుపాము దర్శనమిచ్చింది. శివాజీ అనే కుటుంబం నివాసం ఉంటున్న ఇంటిమట్ల వద్ద బారీ నాగుపాము కనిపించింది. దాన్ని కూడా రెస్క్యూ చేశారు. ఆ పక్కనే ఉన్న రేకుల కాలనీలో మనోహర్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో మరో నాగుపాము కనిపించింది. ఆదమరిస్తే కాటేసే లా ఉంది. గంటల వ్యవధిలోనే మూడు వేరువేరు చోట్ల మూడు నాగుపాములను చాకచక్యంగా బంధించాడు స్నేక్ కేచర్ వాసు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
రవి నీచత్వంతో ఆ రాశుల వారికి కొత్త సమస్యలు.. పరిహారాలు ఇవే..
రవి నీచత్వంతో ఆ రాశుల వారికి కొత్త సమస్యలు.. పరిహారాలు ఇవే..
లక్కీ ఛాన్స్ అంటే వీళ్లదే గురూ..! భార్యభర్తలకు ఆరు మద్యం దుకాణాలు
లక్కీ ఛాన్స్ అంటే వీళ్లదే గురూ..! భార్యభర్తలకు ఆరు మద్యం దుకాణాలు
పంట పొలాల్లో పాదముద్రలు.. భయం గుప్పెట రైతులు!
పంట పొలాల్లో పాదముద్రలు.. భయం గుప్పెట రైతులు!
కొత్త ఫోన్‌ కొంటున్నారా.? మార్కెట్లోకి దూసుకొస్తున్న నయా మాల్‌
కొత్త ఫోన్‌ కొంటున్నారా.? మార్కెట్లోకి దూసుకొస్తున్న నయా మాల్‌
యజమాని మరణం తట్టుకోలేక శునకం కన్నుమూత.. కన్నీరుమున్నీరైన కుటుంబం
యజమాని మరణం తట్టుకోలేక శునకం కన్నుమూత.. కన్నీరుమున్నీరైన కుటుంబం
మూసీ పరివాహాక ప్రజలకు అలర్ట్‌.. తెరుచుకున్న జంట జలాశయాల గేట్లు
మూసీ పరివాహాక ప్రజలకు అలర్ట్‌.. తెరుచుకున్న జంట జలాశయాల గేట్లు
ఆ చిన్నారి ఇంత వయ్యారంగా మారిపోయింది..
ఆ చిన్నారి ఇంత వయ్యారంగా మారిపోయింది..
వాటే సింప్లిసిటీ.. ఈ ప్రధాని పనికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే
వాటే సింప్లిసిటీ.. ఈ ప్రధాని పనికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే
అపర్ణ ప్లాన్ సక్సెస్.. రుద్రాణి మాస్టర్ ప్లాన్.. బయటపడిన నిజం!
అపర్ణ ప్లాన్ సక్సెస్.. రుద్రాణి మాస్టర్ ప్లాన్.. బయటపడిన నిజం!
రోజుకి ఎన్ని ఎండు ద్రాక్ష తినాలి..? అతిగా తింటే అనర్థాలే సుమీ..!
రోజుకి ఎన్ని ఎండు ద్రాక్ష తినాలి..? అతిగా తింటే అనర్థాలే సుమీ..!