Sharad Purnima 2024: శరత్ పున్నమి వెరీ వెరీ స్పెషల్.. ఈ రోజు చంద్రకిరణలు తగిలిన పాలుని, పాయసాన్ని తినమని చెబుతారు.. ఎందుకంటే..

బియ్యం, పాలతో చేసిన పాయసాన్ని శరత్ పూర్ణిమ రోజ సాయంత్రం చంద్రకాంతిలో పెట్టి పుజిస్తారు. దీని వెనుక మతపరమైన కారణం ఉంది. శరత్ పూర్ణిమ రోజు రాత్రి చంద్రకాంతి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున చంద్రుడు పదహారు దశల్లో కనిపిస్తాడని నమ్ముతారు. శరత్కాలంలో ఆకాశం నిర్మలంగా ఉండటం వల్ల చంద్రుడు మరింత తేజోవంతంగా ప్రకాశిస్తూ దర్శనం ఇస్తాడు. ఇది మన శరీరాన్ని, మనస్సును శుద్ధి చేస్తుంది. సానుకూల శక్తిని అందిస్తుంది. కనుక చంద్రుని కిరణాలు తాకేలా ఆ రోజు వెన్నెలలో తిరగమని చెబుతారు.

Sharad Purnima 2024: శరత్ పున్నమి వెరీ వెరీ స్పెషల్.. ఈ రోజు చంద్రకిరణలు తగిలిన పాలుని, పాయసాన్ని తినమని చెబుతారు.. ఎందుకంటే..
Sharad Purnima 2024
Follow us

|

Updated on: Oct 14, 2024 | 2:47 PM

శరదృతువులో ఆశ్వీయుజ మాసం శుక్ల పక్ష పౌర్ణమి శరత్ పూర్ణిమను ఓ పండగగా జరుపుకుంటారు. ఈ రోజు శరదృతువు ఆగమనాన్ని సూచిస్తుంది. ఈ పండగను కొజాగరాత్రిపూర్ణిమ, కాముడిపున్నమి అని కూడా అంటారు. శరత్ పూర్ణిమ రోజున శ్రీ మహా విష్ణువు లక్ష్మి దేవి, చంద్రుడిని పూజిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం శరత్ పూర్ణిమ రోజున శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలను ప్రదర్శించాడు. అందుకే ఈ పున్నమిని రాస పున్నమి అని కూడా అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు చాలా వేల సంవత్సరాల క్రితం ఈ చంద్రుని వెన్నెలలో గోపికలందరితో కలిసి నాట్యం చేశాడని చెబుతారు. శరద్ పూర్ణిమ నృత్యం, వేడుకలకు ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఈ రోజున లక్ష్మీదేవి భూమిని సందర్శించడానికి వస్తుందని కూడా నమ్మకం. ఇక శరత్ పౌర్ణమి రోజు రాత్రి పూజానంతరం చంద్రకాంతిలో అంటే వెన్నెలలో ఖీర్ ఉంచే సంప్రదాయం ఉంది. దీని వెనుక కారణం ఏమిటి?

శరత్ పూర్ణిమ తేదీ

హిందూ క్యాలెండర్ ప్రకారం శరత్ పూర్ణిమ తిథి అక్టోబర్ 16 బుధవారం రాత్రి 8:41 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 17న సాయంత్రం 4:53 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఈ ఏడాది శరత్ పూర్ణిమ పండగను అక్టోబర్ 16 న జరుపుకుంటారు. ఈ రోజు సాయంత్రం 5.40 గంటలకు చంద్రోదయం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

శరత్ పూర్ణిమ పూజ ముహూర్తం

శరత్ పూర్ణిమ రోజున చంద్రోదయం సాయంత్రం 5.05 గంటలకు ఉంటుంది. ఈ రోజున చంద్రుడి వెనెలలో పాయసాన్ని పూజించడానికి శుభ సమయం రాత్రి 8.40 గంటలకు ప్రారంభమవుతుంది.

పాలతో చేసిన పాయసం ఎందుకు ఉంచాలి?

బియ్యం, పాలతో చేసిన పాయసాన్ని శరత్ పూర్ణిమ రోజ సాయంత్రం చంద్రకాంతిలో పెట్టి పుజిస్తారు. దీని వెనుక మతపరమైన కారణం ఉంది. శరత్ పూర్ణిమ రోజు రాత్రి చంద్రకాంతి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున చంద్రుడు పదహారు దశల్లో కనిపిస్తాడని నమ్ముతారు. శరత్కాలంలో ఆకాశం నిర్మలంగా ఉండటం వల్ల చంద్రుడు మరింత తేజోవంతంగా ప్రకాశిస్తూ దర్శనం ఇస్తాడు. ఇది మన శరీరాన్ని, మనస్సును శుద్ధి చేస్తుంది. సానుకూల శక్తిని అందిస్తుంది. కనుక చంద్రుని కిరణాలు తాకేలా ఆ రోజు వెన్నెలలో తిరగమని చెబుతారు. అంతేకాదు పాలు లేదా పరమాన్నం వెన్నెల కిరణాలు తగిలేలా పెట్టడంతో దానికి అమృతం వంటి ఔషధ గుణాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున పాలు, బియ్యం పాయసన్ని ఒక పాత్రలో ఉంచి నెట్ గుడ్డ కప్పి చంద్ర కిరణాలు ఆ పాత్రపై ప్రసరించేలా ఉంచుతారు. దీని తరువాత మరుసటి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఆ పాయసాన్ని శ్రీ విష్ణువుకు నైవేద్యంగా సమర్పించి, కుటుంబ సభ్యులకు పంచిపెట్టిన తర్వాత సేవిస్తారు.

చంద్రుని 16 దశలు

శరత్ పూర్ణిమ రోజున చంద్రుని కాంతిలో చంద్రుడు 16 కళలు ఉంటాయని విశ్వాసం. అమృతం, ఆలోచనలు, అందం, ఆరోగ్యం, కోరికల నెరవేర్పు, జ్ఞానం, ప్రకాశం, శాంతి, కీర్తి, కాంతి,(సంపద) ప్రేమ, శాశ్వతం, సంపూర్ణత అంటే కార్యాచరణ, పూర్ణామృతం అంటే ఆనందం ఈ కళలు ఆ పాలకు లేదా పాల పదార్ధాలకు చేరుకుంటాయని విశ్వాసం.

శరత్ పూర్ణిమ పూజ విధి

శరత్ పూర్ణిమ రోజున పూజ చేయడానికి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేయాలి. దీని తరువాత నీటిలో గంగాజలం కలిపి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలీ. విష్ణువుకు నైవేద్యంగా పాయసాన్ని సమర్పించండి. ఆ తర్వాత ఒక పీటాన్ని ఏర్పాటు చేసి ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి, విష్ణువు,లక్ష్మి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించండి. ఆ తర్వాత పూర్ణ క్రతువులతో శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించండి. తర్వాత మంత్రాలు పఠిస్తూ హారతి ఇచ్చి పూజను పూర్తి చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

విందు భోజనానికి వచ్చిన కోతి.. ఆశ్చర్యపోయిన అతిథులు.
విందు భోజనానికి వచ్చిన కోతి.. ఆశ్చర్యపోయిన అతిథులు.
రతన్ టాటాను కదిలించిన ఘటన.. పెంపుడు జంతువుల కోసం రూ. 165 కోట్లు.!
రతన్ టాటాను కదిలించిన ఘటన.. పెంపుడు జంతువుల కోసం రూ. 165 కోట్లు.!
మగ మహారాజులకు ఇవి అమృతంతో సమానం.! రోజుకి రెండు తిన్నారంటే..
మగ మహారాజులకు ఇవి అమృతంతో సమానం.! రోజుకి రెండు తిన్నారంటే..
ఫ్యాన్స్‌కి పూనకాలే.! బాలయ్యను సరికొత్త ప్రయోగం..
ఫ్యాన్స్‌కి పూనకాలే.! బాలయ్యను సరికొత్త ప్రయోగం..
ఇడ్లీ అర్డర్ చేస్తే.. వచ్చింది చూసి షాక్!
ఇడ్లీ అర్డర్ చేస్తే.. వచ్చింది చూసి షాక్!
వేలంలోకి అరుదైన నాగా మానవ పుర్రె.. మండిపడ్డ ఆ ప్రాంత ప్రజలు.!
వేలంలోకి అరుదైన నాగా మానవ పుర్రె.. మండిపడ్డ ఆ ప్రాంత ప్రజలు.!
ఆలయంలో షాకింగ్ ఘటన.. నాలుక కోసి అమ్మవారికి సమర్పించిన భక్తుడు.!
ఆలయంలో షాకింగ్ ఘటన.. నాలుక కోసి అమ్మవారికి సమర్పించిన భక్తుడు.!
ఇదెక్కడి విడ్డూరం.! 50 ఏళ్లుగా ఎండిన ఎడారిలో వరదలు.!
ఇదెక్కడి విడ్డూరం.! 50 ఏళ్లుగా ఎండిన ఎడారిలో వరదలు.!
నారా వారి ఇంట పెళ్లి బాజాలు.. రోహిత్-శిరీష నిశ్చితార్థం వేడుకలు.!
నారా వారి ఇంట పెళ్లి బాజాలు.. రోహిత్-శిరీష నిశ్చితార్థం వేడుకలు.!
బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ విధ్వంసం.. ఎన్టీఆర్ అనుకున్నది సాధించారా.?
బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ విధ్వంసం.. ఎన్టీఆర్ అనుకున్నది సాధించారా.?