AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల భక్తుల మనసు దోచిన ప్రసాదాలు ఇవే.. ఒక్కో మహా ప్రసాదం వెనుక ఒక్కో విశిష్టత..

ఇష్టదైవానికి నివేదించిన ప్రసాదాలను స్వీకరించడాన్ని భక్తులు ఒక వరంగా భావిస్తారు. తమకు లభించిన మహాభాగ్యంగా ఆనందిస్తారు. ఆవిధంగా రుచికి, మహత్తుకు పేరెన్నిక గన్నది తిరుమల శ్రీవారి ప్రసాదం. వెంకటేశుడి లడ్డూకి పోటీనిచ్చే మహా ప్రసాదం మరేదీ లేకపోవచ్చుగాక. కానీ.. భక్తజన కోటిలో విపరీతమైన పాపులారిటీ ఉన్న మహా ప్రసాదాలు చాలానే ఉన్నాయి. దేని స్పెషాలిటీ దానిదే. అన్నీ భక్తులకు ట్వంటీఫోర్ క్యారెట్స్ ధన్యతనిచ్చే ప్రసాదాలే.

తెలుగు రాష్ట్రాల భక్తుల మనసు దోచిన ప్రసాదాలు ఇవే.. ఒక్కో మహా ప్రసాదం వెనుక ఒక్కో విశిష్టత..
iconic prasads
Ram Naramaneni
|

Updated on: Oct 13, 2024 | 9:06 PM

Share

తిరుమల శ్రీవారి చెంత లడ్డూ ప్రసాద పరిమళం ఎంతంటే ఏం చెప్పగలం..? అన్నవరం సత్యదేవుడికి నివేదించే గోధుమ నూక ప్రసాదం గుండెకు ఎంతెంత హాయికరం..? మంత్రాలయం రాఘవేంద్రుడి మఠంలో దొరికే పరిమళ ప్రసాద.. తాకితేనే భక్తి ప్రపూర్ణం. సింహాచలం ప్రసాదం తింటే.. అక్కడికెళ్లి అప్పన్నస్వామి దర్శన భాగ్యం చేసుకున్నట్టే.. శబరిమలై అయ్యప్ప సన్నిధిలో అరవణ పాయసం.. అరచేత దక్కిన పుణ్యఫలం. పత్రం-పుష్పం-ఫలం-తోయం..! పండ్లో పూలో అరచెంచాడు నీళ్లో ఏదిచ్చినా స్వీకరిస్తానంటూ స్వామి వారు ఉదార స్వభావంతో చెబితే చెప్పొచ్చు గాక. ఆయన నోటిని తీపి చేసేవి.. ఆయనకంటూ అత్యంత ప్రీతిపాత్రమైనవి కొన్నుంటాయి. వాటిని వండి నివేదన చెయ్యాల్సిన బాధ్యత సగటు భక్తుడిదేగా..? అలా పుట్టిందే స్వామివారి ప్రసాదం. ఆ మామూలు ప్రసాదాలే మహా ప్రసాదాలైతే..! మామిడి, కమల, పుచ్చకాయ, తులసి ఆకులు, జామ, ప్యాషన్‌ ఫ్రూట్, దేశీయ పానీయాలు, సగ్గు బియ్యం.. ఇలా లెక్కకు మించి ముడి పదార్థాలతో తయారయ్యే లడ్డూలైనా, వడలైనా, పాయసాలైనా.. పులిహోరలైనా, దద్దోజనమైనా..! గర్భగుడిలో మూల విరాట్టు దగ్గరుంచి.. పూజించి, అర్చించి, ఆ మంత్రజలాన్ని చిలకరించి.. ఆ విధంగా పునీతమయ్యాకే పదార్థం ప్రసాదమౌతుంది. ఆ ప్రసాదం మహా ప్రసాదమౌతుంది. భగవంతుడికి.. భక్తుడికి.. అనుసంధానమైనది..! భక్తికి భక్తి… క్రేజుకు క్రేజు.. పరిమళానికి పరిమళం..! నాలుగు పొలుకులు చేతుల్లోకి తీసుకుని, కళ్లకద్దుకుని నోట్లో వేసుకుంటే చాలు.. గుండెల్ని నిమురుతూ. పొట్టలోకి దిగితే అదోరకం ఆధ్యాత్మిక తన్మయత్వం. భక్తుడికి దొరికే అనిర్వచనీయమైన అనుభూతి. మహా ప్రసాదం అనగానే మొదటగా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి