- Telugu News Spiritual Dhanteras 2024: date, puja time and tips, dhanteras Importance, know the total details
Dhanteras 2024: ఈ ఏడాది ధన్‌తేరాస్ అక్టోబర్ 29 లేదా 30నా? ఖచ్చితమైన తేదీ, పూజ శుభ సమయం, పద్ధతి, ప్రాముఖ్యత ఏమిటంటే
ధనత్రయోదశిని ధన్‌తేరస్ ని పిలుస్తారు. ఈ పండగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున ధన్వంతరి, లక్ష్మీ దేవితో పాటు సంపదకు దేవుడు అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు. ఈ రోజున ధన్వంతరిని ఆరాధించడం వలన ఆరోగ్యాన్ని పొందుతారని నమ్మకం. అంతేకాదు లక్ష్మీ దేవిని, కుబేరుని పూజించడం ద్వారా ఆర్దిక ఇబ్బందులు కలగవని.. సిరి సంపదలకు లోటు ఉండదని విశ్వాసం.
Updated on: Oct 14, 2024 | 3:16 PM

హిందువులకు ఏడాది పొడవునా ఏదోక పండగ ఉంటుంటే ఉంటుంది. ప్రతి పండగకు ఒకొక్క విశిష్టత కూడా ఉంటుంది. దసరా నవరాత్రుల సందడి అయింది.. ఇప్పుడు అందరి దృష్టి రానున్న దీపావలి పండగ మీద ఉంది. దీపావళిని పండగను దేశంలో అనేక ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ ఐదు రోజుల పండగలలో ఒకటి ధన్‌తేరస్ పండుగ. ధనత్రయోదశిని ధన్‌తేరస్ ని పిలుస్తారు లక్ష్మీ దేవిని, కుబేరుని పూజించడం ద్వారా ఆర్దిక ఇబ్బందులు కలగవని.. సిరి సంపదలకు లోటు ఉండదని విశ్వాసం. ఈ రోజున ప్రజలు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.

ధన్‌తేరస్ తేదీ (ధన్తేరాస్ 2024 తేదీ): వేద క్యాలెండర్ ప్రకారం త్రయోదశి తిథి మంగళవారం అక్టోబర్ 29వ తేదీ 2024 ఉదయం 10:31 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ త్రయోదశి తిథి అక్టోబర్ 30, 2024 బుధవారం మధ్యాహ్నం 1:15 గంటలకు ముగుస్తుంది. కనుక ఉదయం తిథి ప్రకారం ధనత్రయోదశి పండుగ అక్టోబర్ 29 న జరుపుకోవాలి.

ధన్‌తేరస్ పూజ శుభ ముహూర్తం: హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6:31 గంటల నుంచి రాత్రి 8:13 గంటల వరకు ధన్‌తేరస్ పూజకు అనుకూలమైన సమయం. ఈ ఏడాది మొత్తం 1 గంట 41 నిమిషాల సమయం ధన్‌తేరస్ పూజకు శుభ సమయం.

ధన్‌తేరస్ పూజ విధి: ధన్‌తేరస్ రోజున శుభ సమయంలో ధన్వంతరి దేవుడితో పాటు లక్ష్మీ దేవి, కుబేరుడు విగ్రహాన్ని లేదా చిత్ర పటాలను ప్రతిష్టించండి. దీని తర్వాత కుబేరుడిని, ధన్వంతరిలను పూజించండి. తర్వాత నెయ్యి దీపం వెలిగించి.. సాయంత్రం వీధి తలుపు దగ్గర కూడా దీపం వెలిగించండి. ధన్‌తేరస్ పూజా సముయంలో ధన్వంతరుడికి పసుపు మిఠాయిలను ప్రసాదంగా సమర్పించండి. ఆ తర్వాత మంత్రాలు జపించి హారతి ఇవ్వండి.

ధన్‌తేరస్ రోజున ఏమి కొనాలంటే: ధనత్రయోదశి రోజున షాపింగ్ చేయడం మంచిదని భావిస్తారు. ఈ రోజున బంగారు, వెండి ఆభరణాలు, పాత్రలు, ఇత్తడి, చీపుర్లు కొనుగోలు చేయడం చాలా శుభప్రదం.

ధనత్రయోదశి ప్రాముఖ్యత: ధన్వంతరి జన్మదినాన్ని పురస్కరించుకుని ధనత్రయోదశి పండుగను జరుపుకుంటారు. శాస్త్రాల ప్రకారం ధనత్రయోదశి రోజున ధన్వంతరి సముద్ర మథనం సమయంలో చేతిలో అమృతంతో నిండిన బంగారు కలశంతో ప్రత్యక్షమయ్యాడు. దేవతలు ఆ కలశంలో ఉన్న అమృతాన్ని సేవించి అమరులయ్యారు. ఈ రోజున ధన్వంతరిని ఆరాధించిన వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు.




