AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గ్రామంలో ఏకాదశి రోజున దసరా వేడుకలు.. దీని వెనుక బలమైన కారణం ఇదే..

ఉత్తర బెంగాల్‌లోని రాజ్‌వంశీయుల ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో ఏకాదశి ఉదయం నుంచి భండారీ రూపంలో అమ్మవారికి పూజలు చేశారు.  బైరాగురి, దువార్స్‌లోని అలీపుర్‌దువార్‌లోని తూర్పు భోలార్ దబ్రీతో సహా దువార్‌లోని అనేక ప్రాంతాలలో దుర్గను భండారీ రూపంలో పూజిస్తారు. దుర్గ దేవికి పది చేతులు ఉన్నప్పటికీ, భండారీ ఇక్కడ రెండు చేతులతో దర్శనం ఇస్తుంది. సింహ వాహనం మీద దుర్గాదేవి దర్శనం ఇస్తే.. ఇక్కడ పులి వాహనంగా భండారీ దర్శనమిస్తుంది.

ఆ గ్రామంలో ఏకాదశి రోజున దసరా వేడుకలు.. దీని వెనుక బలమైన కారణం ఇదే..
Durga Puja Of Alipurduar 2024Image Credit source: social media
Surya Kala
|

Updated on: Oct 14, 2024 | 4:24 PM

Share

దసరా పండుగ ముగిసింది.. అయితే దేశంలో ఒక గ్రామంలో మాత్రం దసరా పండుగను ఒక రోజు తర్వాత అంటే ఏకాదశి రోజున చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాల దుర్గాపూజ ముగిసిన వెంటనే ఉత్తర బెంగాల్ లోని బోధన్ గ్రామాల్లో దసరా సందడి నెలకొంది. ఉత్తర బెంగాల్‌లోని రాజ్‌వంశీయుల ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో ఏకాదశి ఉదయం నుంచి భండారీ రూపంలో అమ్మవారికి పూజలు చేశారు.  బైరాగురి, దువార్స్‌లోని అలీపుర్‌దువార్‌లోని తూర్పు భోలార్ దబ్రీతో సహా దువార్‌లోని అనేక ప్రాంతాలలో దుర్గను భండారీ రూపంలో పూజిస్తారు. దుర్గ దేవికి పది చేతులు ఉన్నప్పటికీ, భండారీ ఇక్కడ రెండు చేతులతో దర్శనం ఇస్తుంది. సింహ వాహనం మీద దుర్గాదేవి దర్శనం ఇస్తే.. ఇక్కడ పులి వాహనంగా భండారీ దర్శనమిస్తుంది. జిల్లాలోని అనేక గ్రామాలలో సిరి సంపదలను సుఖ సంతోషాలు ఇచ్చే దైవంగా భండారీ దేవిని పూజిస్తారు. చుట్టుపక్కల గ్రామాల్లో పండుగ వాతావరణం మళ్లీ నెలకొంది.

Durga Puja Of Alipurduar 1

Durga Puja Of Alipurduar 1

రాజవంశీ కమ్యూనిటీ ప్రజలే కాదు.. గ్రామీణ బెంగాల్‌లోని అన్ని మతాల ప్రజలు కూడా భండారీ దేవతకు పూజలు చేస్తారు. దుర్గా దేవీ భండారీని మరొక రూపంగా భావిస్తారు. ఉత్తర బెంగాల్‌లోని విస్తారమైన అటవీ ప్రాంతాలలోని అటవీ నివాసులు “బందుర్గా” అని పూజిస్తారు. బందుర్గా అనేది శక్తిశ్వరూపిణి. ఉత్తర బెంగాల్ అడవుల్లో కూడా దుర్గాదేవి బలి తర్వాత పండుగ ముగుస్తుంది. రాజవంశీ సమాజంలో భండారీ పూజ చుట్టూ ఒక అందమైన జానపద కథ ఉంది.

దుర్గాదేవి అసుర సంహారం తర్వాత ఆమె తండ్రి ఇంటి నుండి కైలాసానికి వెళుతున్నప్పుడు.. ఈ అటవీ గ్రామం మీదుగా దేవత వెళుతున్నప్పుడు ఆ ప్రాంత రైతులు ‘తల్లి’ దుర్గను ఒక రాత్రి తమ గ్రామంలో ఉండమని కోరారని చెబుతారు. ఎందుకంటే గ్రామంలో తీవ్ర క్షామం ఉంది. అప్పుడు దేవత ఈ గ్రామంలో ఒక రాత్రి బస చేసిందని వ్యవసాయదారులు నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

ఏకాదశి రోజున గ్రామస్తుల నుంచి పూజను అందుకున్న దుర్గాదేవి కైలాసానికి బయలుదేరారింది. దీని తర్వాత గ్రామంలోని దుర్భిక్షం తొలగిపోయిందని చెబుతారు. ఆ ప్రాంతం సంపదలతో నిండిపోయింది. ధాన్యంతో గోదాము నిండిపోయింది. అందుకే ఇక్కడ దుర్గాదేవిని భండారీ రూపంలో పూజిస్తారు. దేవి ఆ గ్రామంలో ఒక రాత్రి గడిపి ఏకాదశి రోజున కైలాసానికి తిరిగి వెళ్ళింది. బయలుదేరే ముందు దేవత తన నిజస్వరూపంతో దర్శనం ఇస్తూ గ్రామస్తుల ఆతిథ్యానికి సంతృప్తి చెంది. అక్కడ ప్రజల ధాన్యం నిల్వలను నింపింది. పూజల సందర్భంగా భక్తులు పావురాలకు ధాన్యం సమర్పిస్తారు.

Durga Puja Of Alipurduar 3

Durga Puja Of Alipurduar 3

లాగోవా తూర్పు భోలా, అలీపుర్‌దువార్ పట్టణంలోని దబ్రి గ్రామంలో 130 సంవత్సరాలుగా భండారీ పూజ జరుగుతోంది. గ్రామంలోని బీఎఫ్‌పీ ప్రాథమిక పాఠశాల మైదానంలో ఈ పూజలు నిర్వహిస్తారు. పూజల సందర్భంగా జాతర నిర్వహిస్తారు. దుర్గాదేవి మరో రూపంలో ప్రజలు పూజిస్తారు.

పూజా కమిటీకి చెందిన బీరేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ.. ఈ పూజను తమ పూర్వీకులు చేశారని చెప్పారు. ఈ పూజ సమయంలో గ్రామంలోని అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఎక్కడున్నా ఇంటికి తిరిగి వస్తారు. భండారీ దేవిని పూజలో పాల్గొంటారు. ఈ పూజ సందర్భంగా భోలాలోని దబ్రిలోని BFP ప్రాథమిక పాఠశాల మైదానంలో భారీ జాతర నిర్వహించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)