అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతిరూపం భగిని హస్తభోజనం.. అన్నాచెల్లెళ్ల మరో పండుగను ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలంటే..
హిందూ మతంలో రాఖీ పండగ వలెనే అన్నాచెల్లెళ్ళు పండగను ఎంతో వైభవంగా, ఉత్సాహంతో జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్ళు పండుగ రోజున సోదరీమణులను సోదరీమణులను తమ ఇంటికి పిలిచి తిలకం పెట్టి పూజిస్తారు. కడుపు నిండుగా రకరాకాల ఆహార పదార్ధాలతో బోజనం పెడతారు. తర్వాత సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు బహుమతులు ఇస్తారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా భాయ్ దూజ్ లేదా అన్నాచెల్లెళ్ళ పండగ అని పిలుస్తారు.
హిందూ మతంలో రాఖీ పండగ వలెనే అన్నాచెల్లెళ్ళు పండగను ఎంతో వైభవంగా, ఉత్సాహంతో జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్ళు పండుగ రోజున సోదరీమణులను సోదరీమణులను తమ ఇంటికి పిలిచి తిలకం పెట్టి పూజిస్తారు. కడుపు నిండుగా రకరాకాల ఆహార పదార్ధాలతో బోజనం పెడతారు. తర్వాత సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు బహుమతులు ఇస్తారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా భాయ్ దూజ్ లేదా అన్నాచెల్లెళ్ళ పండగ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్షం రెండవ రోజున అంటే దీపావళి పండగ వెళ్ళిన రెండోరోజున అన్నాచెల్లెళ్ళ పండగగా జరుపుకుంటారు.
అన్నాచెల్లెళ్ళ పండగ తేదీ
హిందూ క్యాలెండర్ ప్రకారం అన్నాచెల్లెళ్ళ పండగ జరుపుకునే తిధి నవంబర్ 2వ తేదీ రాత్రి 8:21 గంటలకు ప్రారంభమై నవంబర్ 3వ తేదీ రాత్రి 10:05 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం అన్నాచెల్లెళ్ళ పండగను నవంబర్ 3వ తేదీ ఆదివారం జరుపుకుంటారు.
అన్నాచెల్లెళ్ళ పండగ 2024 పూజకు అనుకూలమైన సమయం
అన్నాచెల్లెళ్ళ పండగ రోజున తన సోదరుడికి తిలకం పెట్టి పూజ చేయడానికి అనుకూలమైన సమయం మధ్యాహ్నం 1:19 నుంచి 3:22 వరకు ఉంటుంది. అన్నాచెల్లెళ్ళ పండగ రోజున సోదరుడిని పూజించి కడుపునిండా భోజనం పెట్టడానికి మొత్తం 2 గంటల 12 నిమిషాల సమయం లభిస్తుంది.
అన్నాచెల్లెళ్ళ పండగ పూజ సమయంలో పాటించాల్సిన నియమాలు
అన్నాచెల్లెళ్ళ పండగ రోజున సోదరీమణులు ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, ఇల్లుని శుభ్రం చేయాలి. కొత్త బట్టలు ధరించి తమ ఇంటికి వచ్చిన సోదరుడికి తిలకం దిద్దాలి. ఆ తర్వాత ఒక ప్లేటులో కుంకుమ, చందనం, అక్షతలు, పసుపు, తమలపాకులు, మిఠాయిలు పెట్టుకోవాలి. సోదరుడిని శుభ్రమైన స్థలంలో స్టూల్‌పై కూర్చోబెట్టాలి. దీని తరువాత శుభ సమయంలో ఉంగరపు వేలితో అన్న లేదా తమ్ముడికి తిలకం దిద్దండి. అలాగే ఆ తిలకంపై అక్షతలు దిద్ది.. సోదరుడికి స్వీట్లు తినిపించండి. అనంతరం సోదరునికి హారతి ఇవ్వండి.
అన్నాచెల్లెళ్ళ పండగ ప్రాముఖ్యత
అన్నాచెల్లెళ్ళ పండగ అన్న చెల్లెళ్ళు.. అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమకు చిహ్నంగా జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు తిలకం దిద్ది.. కొబ్బరికాయను ఇస్తారు. తమ సోదరుడు సంతోషం, శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం దేవతలను ప్రార్థిస్తారు. ఆ తర్వాత సోదరులు తమ సోదరిని ఎటువంటి సందర్భం ఎదురైనా తోడుగా ఉంటామని.. తమ అక్కాచెల్లెలను కాపాడుతామని హామీ ఇస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)