AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Rice Benefits: ప్రీగా లేదా రూపాయికే బియ్యం అంటూ రేషన్ బియ్యాన్ని చిన్న చూపు చూస్తున్నారా.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

కిలో బియ్యం రుపాయని అని లేదా ప్రీగా వచ్చాయని చాలా మంది ఈ రేషన్ బియ్యాన్ని చులకనగా చూస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ బియ్యంతో చేసిన అన్నం లేదా ఆహారపదార్ధాలు తినడం ఏదో పాపం.. నేరంగా చూస్తారు. మార్కెట్ లో దొరికే సన్న బియ్యం కొనుగోలు చేసి తినడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే రేషన్ బియ్యమే మన శరీరానికి మేలు చేస్తాయని తెలుసా.!. నేటి వరకు నిరుపేదలు ఫుల్ టైం ఫుడ్ గా ఉన్న ఈ రేషన్ బియ్యం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Ration Rice Benefits: ప్రీగా లేదా రూపాయికే బియ్యం అంటూ రేషన్ బియ్యాన్ని చిన్న చూపు చూస్తున్నారా.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
Ration Rice Benefits
Surya Kala
|

Updated on: Oct 14, 2024 | 6:16 PM

Share

సమాజంలో నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా లేదా తక్కువ ధరకు రేషన్ షాప్ ద్వారా బియ్యం అందిస్తోంది. ప్రతి నెలా చౌక దుకాణంల ద్వారా బియ్యం, నూనే, పంచదార, కందిపప్పు వంటి కొన్ని రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తోంది. కిలో బియ్యం రుపాయని అని లేదా ప్రీగా వచ్చాయని చాలా మంది ఈ రేషన్ బియ్యాన్ని చులకనగా చూస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ బియ్యంతో చేసిన అన్నం లేదా ఆహారపదార్ధాలు తినడం ఏదో పాపం.. నేరంగా చూస్తారు. మార్కెట్ లో దొరికే సన్న బియ్యం కొనుగోలు చేసి తినడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే రేషన్ బియ్యమే మన శరీరానికి మేలు చేస్తాయని తెలుసా.!. నేటి వరకు నిరుపేదలు ఫుల్ టైం ఫుడ్ గా ఉన్న ఈ రేషన్ బియ్యం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి తెలుసుకుంటే.. ఇప్పటి వరకూ రేషన్ బియ్యం తినడానికి ఇష్టపడని వారు సైతం వెంటనే రేషన్ బియ్యంతో చేసిన ఆహారం తినడానికి రెడీ అవుతారు. రేషన్ బియ్యం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెల్సుకుందాం..

వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే చాలా ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. ఈ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసి, పాలిష్ చేసి, వేరే రూపంలో మార్కెట్ లోకి ఎక్కువ ధరతో మనకే తిరిగి అమ్మేస్తున్నారు.

రేషన్ బియ్యాన్ని ఎలా శుభ్రం చేయాలంటే: రేషన్ బియ్యంతో అన్నం వండడం కొంచెం కష్టంగా భావిస్తారు. అయితే ముందు రేషన్ బియ్యాన్ని కొన్న తర్వాత బాగా ఆరబెట్టి దుమ్ము, పొట్టు లేకుండా చేసుకోవాలి. వండడానికి ముందు రేషన్ బియ్యాన్ని నీళ్లలో కొంచెం ఉప్పు వేసి నానబెట్టాలి. ఇలా చేసిన తర్వాత ఆ బియ్యాన్ని వంట చేసుకుని తినొచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ రేషన్ బియ్యంతో అన్నం తినడం ఇష్టం లేకుంటే పొంగల్ గా తినొచ్చు. లేదా ఇడ్లీ, దోసె, ఇడియప్పం, ఉప్మా, అప్పం చేసి తినొచ్చు. కొందరు ఈ బియ్యాన్ని 10 గంటలకు పైగా నానబెట్టి గ్రైండ్ చేస్తే పిండిగా చేసి రకరకాల వంటకాలు తయారు చేస్తారు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు: ఈ రేషన్ బియ్యం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధిని నయం చేయడానికి మధుమేహ నిపుణులు ఈ రేషన్ బియ్యాన్ని సిఫార్సు చేస్తున్నారు.

రేషన్ బియ్యం వండి తింటే జీర్ణ సమస్యలు తీరుతాయి.

చిన్నారులు, యువత, గర్భిణుల్లో వరుసగా 67శాతం, 57శాతం, 52శాతం రక్తహీనత ఉన్నట్టు జాతీయ కుటుంబ సర్వే నివేదిక వెల్లడించింది. కనుక ఈ బియ్యాన్ని తింటే విటమిన్లు అందటమే కాదు రక్తహీనత బారినపడకుండా ఉండొచ్చు.

అదేవిధంగా సన్నగా ఉన్నవారు రోజూ ఇది తింటే బరువు పెరుగుతారు.. ఈ అన్నం తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు.. 3 పూటలా తినే ఆహారం 2 పూటలకు తగ్గిపోతుంది.. శరీరం కూడా బలపడుతుంది.

ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 లను కలిపిన ఈ బియ్యాన్ని రేషన్ షాప్ ద్వారా ప్రజలకు అందిస్తోంది ప్రభుత్వం.

సామాజిక హోదా:​ఎక్కువ మంది రేషన్ బియ్యాన్ని “సామాజిక హోదా” అనే సర్కిల్‌లో చేర్చినందున.. ఈ బియ్యం తినడం వలన కలిగే ప్రయోజనాలను గుర్తించకుండానే వీటిని దూరంగా ఉంచుతున్నారు. అంతే కాదు ధర తక్కువగా ఉండడం లేదా ఉచితంగా ఇవ్వడంతో ఈ బియ్యం తో చేసిన పదార్ధాలు తినడం వలన కలిగే ప్రయోజనాలను విస్మరించి.. సన్న బియ్యం తినడం వైపు దృష్టి సారిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..