AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఇవి తింటే మీ పని ఖతమే.. షుగర్ డబుల్ అవుతుందట జాగ్రత్త!

డయాబెటిస్.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది.. అనేక దేశాల్లో లక్షలాది మంది బాధితులుగా ఉన్నారు.. ముఖ్యంగా జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య నానాటికి పెరిగి పోతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌లో రక్తంలో చక్కెరను నియంత్రించడం అతిపెద్ద సవాలు..

డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఇవి తింటే మీ పని ఖతమే.. షుగర్ డబుల్ అవుతుందట జాగ్రత్త!
Diabetes care
Shaik Madar Saheb
|

Updated on: Oct 14, 2024 | 5:32 PM

Share

డయాబెటిస్.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది.. అనేక దేశాల్లో లక్షలాది మంది బాధితులుగా ఉన్నారు.. ముఖ్యంగా జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య నానాటికి పెరిగి పోతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌లో రక్తంలో చక్కెరను నియంత్రించడం అతిపెద్ద సవాలు.. వాస్తవానికి, మధుమేహం అనేది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయబడని లేదా సరిగ్గా ఉపయోగించబడని పరిస్థితి.. అటువంటి పరిస్థితిలో, రక్తంలో ఉన్న చక్కెర సరిగ్గా ఉపయోగించబడదు.. ఇలాంటి పరిస్థితుల్లో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.. అందుకే.. మధుమేహం విషయంలో రక్తంలో చక్కెర స్థాయులను సాధారణంగా ఉండేలా చూసుకోవడం మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చాలా తక్కువ లేదా చక్కెర కంటెంట్ లేని ఆహారాన్ని తినాలని సలహా ఇస్తున్నారు. అయితే.. మధుమేహం రోగులు డ్రైఫ్రూట్స్ తింటుంటే అలర్ట్ అవ్వాల్సిందే.. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే ఈ 5 రకాల డ్రై ఫ్రూట్స్ తినడం మానుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిస్‌లో ఈ డ్రై ఫ్రూట్స్ తినకండి..

  1. కిస్‌మిస్: కిస్‌మిస్ (ఎండుద్రాక్ష) లో సహజ చక్కెర పుష్కలంగా ఉంటుంది. కిస్‌మిస్‌లు చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ కూడా చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ రోగులు దీనిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.. లేదా పూర్తిగా నివారించాలి.
  2. ఖర్జురం: ఖర్జూరం కూడా చాలా తీపి డ్రై ఫ్రూట్.. ఇది అధిక మొత్తంలో సహజ చక్కెరను కలిగి ఉంటుంది. రుచికరమైన ఖర్జూరం రక్తంలో చక్కెరను వేగంగా ప్రభావితం చేస్తుంది. ఒక ఖర్జూరంలో దాదాపు 66 కేలరీలు, 18 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఖర్జూరాన్ని ఎక్కువగా తినకూడదు.
  3. అంజీర్: అంజీర్ అద్భుతమైన డ్రై ఫ్రూట్.. దీనిని డయాబెటిక్ రోగులు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక ఎండిన అత్తి పండులో సుమారు 21 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అయితే ఇది అధిక చక్కెర స్థాయిలను కలిగి ఉంటుంది.
  4. పిస్తాపప్పు: పిస్తాలో మంచి కొవ్వులు.. ఫైబర్ ఉన్నప్పటికీ వాటిలో చక్కెర పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే, పిస్తాపప్పుల వినియోగాన్ని పరిమితం చేయడం మంచిది. ఎందుకంటే వాటిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. మీరు పిస్తాలను తినాలనుకుంటే దానిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.. అంతేకాకుండా వాటిని నేరుగా తినే కన్నా.. ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలతో కలపాలి.
  5. జీడిపప్పు: జీడిపప్పులో అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. ఒక చిన్న ప్యాక్ జీడిపప్పు (30 గ్రాములు) లో సుమారు 9 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 18 గ్రాముల కొవ్వుతో నిండి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చాలా జాగ్రత్తగా తినమని సలహా ఇస్తారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి