Car loans: కొత్త కారు కొనడానికి టెన్షన్ వద్దు.. పిలిచి మరీ లోన్లు ఇస్తున్న బ్యాంకులు
దేశంలో పండగల సీజన్ నడుస్తోంది. దసరా ఉత్సవాలు పూర్తయ్యాయి. ఇక దీపావళి పండగ రానుంది. ప్రజలందరూ మంచి జోష్ లో ఉన్నారు, బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతున్నారు. పండగల సీజన్ నేపథ్యంలో దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయి. కొత్త కారు కొనుగోలు చేయడానికి రుణాలు మంజూరు చేస్తున్నాయి.
దేశంలో పండగల సీజన్ నడుస్తోంది. దసరా ఉత్సవాలు పూర్తయ్యాయి. ఇక దీపావళి పండగ రానుంది. ప్రజలందరూ మంచి జోష్ లో ఉన్నారు, బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతున్నారు. పండగల సీజన్ నేపథ్యంలో దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయి. కొత్త కారు కొనుగోలు చేయడానికి రుణాలు మంజూరు చేస్తున్నాయి. సులభమైన నిబంధనలు, సౌకర్యవంతమైన ఈఎంఐలతో కార్ల కోసం వంద శాతం రుణాలను అందిస్తున్నాయి. పండగ సందర్భంగా కొత్త కారును ఇంటికి ఆహ్వానించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. వార్షిక శాతం రేట్లు లేదా ఏపీఆర్ లుగా పిలవబడే ఆటో రుణాలపై వడ్డీ రేటు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. రుణ గ్రహీత ఆదాయం, రుణం మొత్తం, క్రెడిట్ స్కోర్, కారు విలువ, ఆర్బీఐ రెపోరేటును ఆధారంగా చేసుకుని లెక్కిస్తారు. పండగ సీజన్ లో వివిధ బ్యాంకుల తాజా కార్ల లోన్ వడ్డీ రేట్లు ఈ కింద తెలిపిన విధంగా ఉన్నాయి.
క్రెడిట్ స్కోర్
వివిధ రకాల రుణాలను మంజూరు చేేసేముందు బ్యాంకులు మన క్రెడిట్ స్కోర్ ను పరిశీలిస్తాయి. అది బాగుంటేనే రుణాన్ని త్వరగా మంజూరు చేస్తాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి రుణం పొందటానికి కనీస క్రెడిట్ స్కోర్ లేదు. అయితే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే మాత్రం లోన్ మొత్తాన్ని తగ్గిస్తుంది. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే రుణాలు చాలా త్వరగా మంజూరవుతాయి. క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక క్రమశిక్షణకు కొలమానంగా ఉంటుంది. మీ రుణాన్ని సక్రమంగా చెల్లిస్తారనే నమ్మకాన్ని బ్యాంకులకు కలిగిస్తుంది.
కారు రుణాలు
- కొత్త కారు కొనుగోలు చేయడానికి బ్యాంకులు రూ.5 లక్షలు రుణంగా మంజూరు చేస్తున్నాయి. ఐదేళ్ల కాలవ్యవధిలో ప్రతి నెలా ఈఎంఐల రూపంలో తీర్చాల్సి ఉంటుంది. రుణంపై వసూలు చేసే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
- యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా కారు కొనుగోలుకు రూ.5 లక్షల రుణం మంజూరు చేస్తుంది. దానిపై 8.70 నుంచి 10.45 శాతం వడ్డీ విధిస్తుంది. ప్రతి నెలా ఈఎంఐగా రూ.10,307 నుంచి రూ.10.735 వరకూ కట్టాలి. ప్రాసిసింగ్ ఫీజలు లేవు.
- పంజాబ్ నేషనల్ బ్యాంకు కారు లోన్ పై 8.75 నుంచి 10.60 శాతం వడ్డీ విధిస్తుంది. ప్రతి నెలా ఈఎంఐగా రూ.10.319 నుంచి రూ.10.772 చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజుగా 0.25 శాతం అంటే రూ.1,000 నుంచి 1,200 వసూలు చేస్తారు.
- బ్యాంకు ఆఫ్ బరోడాలో 8.95 నుంచి 12.70 శాతం వడ్డీ ఉంటుంది. ఈఎంఐగా రూ.10.367 నుంచి 11,300 కట్టాలి. ప్రాసెసింగ్ ఫీజుగా రూ.750 వసూలు చేస్తారు.
- కెనరా బ్యాంకులో 8.70 నుంచి 12.70 శాతం వడ్డీ విధిస్తారు. ప్రాసెసింగ్ చార్జీలు లేవు. ఈఎంఐ రూ.10,307 నుంచి 11,300 చెల్లించాలి.
- స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో కారు లోన్ ఈఎంఐ రూ.10,391 నుంచి రూ.10,648 వ రకూ ఉంటుంది. 9.05 నుంచి 10.10 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ప్రాసెసింగ్ చార్జీలు ఉండదు.
- యూకో బ్యాంకులో 8.45 నుంచి 10.55 శాతం, ఐడీబీఐ బ్యాంకులో 8.80 నుంచి 9.65 శాతం, ఐసీఐసీఐలో 9.10 నుంచి 10.43 శాతం, హెచ్ డీఎఫ్ సీలో 9.20 నుంచి 10.42 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..