Credit score: మంచి క్రెడిట్ స్కోర్ అంటే ఎంత..? రుణాల మంజూరుకు ఎంత కీలకమంటే..?

క్రెడిట్ స్కోర్ అనే మాట ఇటీవల తరచూ వినిపిస్తోంది. బ్యాంకుల నుంచి రుణాలను పొందటానికి చాలా కీలకంగా మారింది. ఈ స్కోర్ బాగుంటే రుణాలు త్వరగా మంజూరవుతాయి. అవి కూడా తక్కువ వడ్డీ కే పొందే అవకాశం ఉంది. అయితే క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి, అది ఎంత ఉండాలి అనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. క్రెడిట్ స్కోరు అంటే మీ ఆర్థిక క్రమశిక్షణను సూచిక అని చెప్పవచ్చు.

Credit score: మంచి క్రెడిట్ స్కోర్ అంటే ఎంత..? రుణాల మంజూరుకు ఎంత కీలకమంటే..?
Follow us
Srinu

|

Updated on: Oct 14, 2024 | 7:30 PM

క్రెడిట్ స్కోర్ అనే మాట ఇటీవల తరచూ వినిపిస్తోంది. బ్యాంకుల నుంచి రుణాలను పొందటానికి చాలా కీలకంగా మారింది. ఈ స్కోర్ బాగుంటే రుణాలు త్వరగా మంజూరవుతాయి. అవి కూడా తక్కువ వడ్డీ కే పొందే అవకాశం ఉంది. అయితే క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి, అది ఎంత ఉండాలి అనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. క్రెడిట్ స్కోరు అంటే మీ ఆర్థిక క్రమశిక్షణను సూచిక అని చెప్పవచ్చు. ప్రస్తుతం అన్నీ లావాదేవీలు ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. మనం నిర్వహించే ప్రతి లావాదేవీ రికార్డు అవుతుంది. మీరు తిసుకున్న రుణాలు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులను సక్రమంగా చెల్లిస్తూ ఉంటే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. వాయిదాలు కట్టకపోయినా, గతంలో తీసుకున్న రుణం ఎగవేసినా స్కోర్ తగ్గిపోతుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే మీరు రుణాలను సక్రమంగా కట్టగలరని బ్యాంకులు నిర్ధారణకు వస్తాయి.

క్రెడిట్ స్కోర్

  • క్రెడిట్ స్కోర్ అనేది 300 నుంచి 900 లోపు ఉంటుంది. మీ ఆర్థిక లావాదేవీల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. ఈ మూడు అంకెల నంబరే మీకు రుణాల మంజూరు లో కీలకంగా మారుతుంది.
  • 750 నుంచి 900 మధ్య క్రెడిట్ స్కోర్ ఉంటే అత్యుత్తమంగా భావిస్తారు. వీరికి తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి.
  • 700 నుంచి 749 మధ్య స్కోర్ ఉంటే ఉత్తమ కేటగిరిలోకి వస్తారు. మీ క్రెడిట్ చరిత్ర బాగానే ఉందని సూచిస్తుంది. దీని ద్వారా కూడా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి.
  • 650 నుంచి 699 మధ్య క్రెడిట్ స్కోర్ ఉంటే పర్వాలేదు. దీని ద్వారా కూడా రుణాలు మంజూరవుతాయి. అయితే కొంచె వడ్డీ ఎక్కువగా విధించే అవకాశం ఉంది.
  • 600 నుంచి 649 మధ్య ఉంటే దాన్ని అతి తక్కువ క్రెడిట్ స్కోర్ గా భావిస్తారు. ఈ విభాగంలో వారు రుణాలు పొందటానికి కష్టమవుతుంది. ఒకవేళ మంజూరైనా వడ్డీరేటు అధికంగా విధిస్తారు.
  • 600 కన్నా తక్కువ ఈ విభాగంలోని వారికి ఆర్థిక క్రమశిక్షణ లేనట్టు బ్యాంకులు గుర్తిస్తాయి. రుణాలిస్తే సక్రమంగా కట్టలేరనే నిర్ధారణకు వస్తాయి. రుణం కోసం వీరు చేసుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తాయి.

మెరుగుపర్చుకోవాలంటే..

  • క్రెడిట్ స్కోర్ ను మెరుగుపర్చుకోవాలంటే మీ క్రెడిట్ కార్డు బిల్లులు, రుణాల ఈఎంఐలను సకాలంలో చెల్లించాలి.
  • రుణం తీసుకోవడానికి బహుళ దరఖాస్తులను పంపకూడదు. మీ ఆర్థిక పరిస్థితి బాగోలేదనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. మీరు అప్పుల కోసం ఎదురు చూస్తున్నారని రుణదాతలకు తెలుస్తుంది.
  • క్రెడిట్ కార్డుల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి. నిర్దేశించిన పరిమితిలో 30 శాతానికి మంచి వాడకూడదు.

ప్రయోజనాలు

  • బలమైన క్రెడిట్ స్కోర్ తో అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. సులభంగా రుణాలు, క్రెడిట్ కార్డులు మంజూరవుతాయి.
  • మంచి స్కోర్ ఉంటే మీరు రుణాలను సక్రమంగా చెల్లిస్తారనే నమ్మకం బ్యాంకులకు కలుగుతుంది.
  • అధిక క్రెడిట్ స్కోర్ ఉన్నవారు తక్కువ వడ్డీకే రుణాలను పొందుతారు. దాని ద్వారా ఈఎంఐలు తక్కువగా ఉంటాయి. సులభంగా వాటిని కట్టే వీలుండడం, తద్వారా మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది.
  • దేశంలో జీతం పొందే ఉద్యోగస్తుల్లో 25 శాతం మంది 770, అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ కలిగి ఉన్నారు. స్వయం ఉపాధి పొందుతున్నవారిలో 14 శాతం మాత్రమే ఈ విభాగంలో కొనసాగుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్