Renewable Energy: పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ అరుదైన ఘనత..
పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ దూసుకుపోతోంది. తాజాగా అరుదైన మార్క్‌ను దాటేసింది. మొత్తం పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సెప్టెంబర్‌లో 200 జీడబ్ల్యూ మార్క్‌ను దాటి.. 201,457.91 MWకి చేరుకుంది. వీటిలో చిన్న, పెద్ద హైడ్రో, బయోమాస్‌తో పాటు వ్యదర్థాల నుంచి సేకరించిన పవర్ ఉన్నాయి. వీటిలో సోలార్...
పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ దూసుకుపోతోంది. తాజాగా అరుదైన మార్క్‌ను దాటేసింది. మొత్తం పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సెప్టెంబర్‌లో 200 జీడబ్ల్యూ మార్క్‌ను దాటి.. 201,457.91 MWకి చేరుకుంది. వీటిలో చిన్న, పెద్ద హైడ్రో, బయోమాస్‌తో పాటు వ్యదర్థాల నుంచి సేకరించిన పవర్ ఉన్నాయి. వీటిలో సోలార్ (90,762 మెగావాట్లు), గాలి (47,363 మెగావాట్లు) ఇందులో ఎక్కువ భాగం ఉన్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అందించిన డేటా ప్రకారం రాజస్థాన్ (31.5 GW), గుజరాత్ (28.3 GW), తమిళనాడు (23.7 GW), కర్ణాటక (22.3 GW), పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో మొదటి నాలుగు రాష్ట్రాలుగా నిలిచాయి.
కాగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి మంగళవారంతో 50 ఏళ్లలోకి అడుగు పెట్టనుంది. ఈ సంస్థను భాగస్వామ్య దారులందరికీ సాంకేతిక సహాయాన్ని అందించడానికి ఏర్పాటు చేశారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘2047 నాటికి భారత విద్యుత్ రంగం అభివృద్ధిపై మేథోమథన సెషన్‌ను నిర్వహిస్తామని తెలిపారు. 2047 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. 2024 చివరి నాటికి ప్రపంచం 1,100 GW సౌర విద్యుత్ తయారీ సామర్థ్యం కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇక 2023 ప్రారంభం నుంచి మాడ్యూల్ ధరలు సగానికి పైగా తగ్గాయి. పునరుత్పాదక ఇంధన రంగంపై ఏజెన్సీ తన తాజా నివేదికలో పేర్కొంది. సవాలుతో కూడిన మార్కెట్ పరిస్థితులు సుమారు 300 GW పాలిసిలికాన్‌త పాటు 200 GW పొరల తయారీ సామర్థ్యం ప్రాజెక్టులను రద్దు చేశాయని, దీని విలువ సుమారు $25 బిలియన్లు అని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు పెరుగుతున్నాయి.
కానీ 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 2030 నాటికి ప్రపంచ RE సామర్థ్యాన్ని 11,000 GWగా సూచిస్తుంది. పునరుత్పాదక శక్తిపై IEA నివేదిక ప్రస్తుత ట్రెండ్‌లు ప్రపంచ సామర్థ్యాన్ని 9,760 GWకి తీసుకువెళతాయని లేదా 2022 నుండి 2.7 రెట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అయితే గ్రిడ్‌లో పెట్టుబడులు అవసరానికి అనుగుణంగా లేవు. గ్రిడ్ కనెక్షన్‌ల కోసం ఎదురుచూస్తున్న అధునాతన అభివృద్ధి దశల్లో మొత్తం గ్లోబల్ విండ్, సోలార్ PV, జలవిద్యుత్ సామర్థ్యం 2023లో 1,500 GW నుంచి జూలై 2024 నాటికి 1,650 GWకి పెరిగిందని IEA నివేదిక పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..