ఆన్‌లైన్‌లో రూ. లక్ష విలువైన ల్యాప్‌టాప్‌ను ఆర్డర్.. 13 నిమిషాల్లో డెలివరీ.. యూజర్ షాక్!
ఓ వ్యక్తి ఖరీదైన ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేస్తే, ఆర్డర్ చేసిన 13 నిమిషాల్లోనే కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు దాని మినిట్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం ద్వారా బ్లింక్‌ఇట్, జెప్టో వంటి బ్రాండ్‌లకు పోటీని ఇస్తోంది.
భారతదేశంలో ఇన్‌స్టంట్ కామర్స్ సిస్టమ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నెయిల్ కట్టర్ వంటి చిన్న వస్తువుల నుండి ఖరీదైన వస్తువుల వరకు, BlinkIt, Zepto వంటి బ్రాండ్‌లు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నాయి. ఓ వ్యక్తి ఖరీదైన ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేస్తే, ఆర్డర్ చేసిన 15 నిమిషాల్లోనే కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు దాని మినిట్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం ద్వారా బ్లింక్‌ఇట్, జెప్టో వంటి బ్రాండ్‌లకు పోటీని ఇస్తోంది. దీని కింద మీ ఆర్డర్ 15 నిమిషాల్లో డెలివరీ చేయబడుతుంది.
ఒక సోషల్ మీడియా ట్విట్టర్ ఎక్స్ వినియోగదారు Acer Predator Neo (2023) గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేశాడు దీంతో Flipkart నిమిషాల్లోనే డెలివరీ చేసింది. దీని ధర రూ. 1 లక్ష కంటే ఎక్కువ. JioCinemaలో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ టెక్ సన్నీ R గుప్తా, ఇటీవల Flipkart నుండి ఈ ల్యాప్‌టాప్‌ను నిమిషాల్లో ఆర్డర్ చేశారు. కేవలం 13 నిమిషాల్లో స్టార్‌బక్స్ అవుట్‌లెట్ (ఆ సమయంలో అతను ఉన్న ప్రదేశం)కి డెలివరీ చేశారు. ఎక్స్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇప్పుడు అతను ఇన్‌స్టంట్ కామర్స్‌కు అలవాటు పడ్డానని చెప్పాడు.
He is here!
I’m now going to be used to quick commerce! pic.twitter.com/2J6AFWAash
— Sunny R Gupta (@sunnykgupta) August 24, 2024
ఇన్‌స్టంట్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఇంత త్వరగా ఎందుకు చేస్తున్నాయని కొంతమంది వినియోగదారులు ఆశ్చర్యపోయారు. బహుశా ఎవరికీ ల్యాప్‌టాప్ చాలా అత్యవసరంగా అవసరం లేదు. కాబట్టి వారు దానిని కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేయాలనుకుంటున్నారు. దీనిపై గుప్తా స్పందిస్తూ.. ‘నిజం చెప్పాలంటే గత కొన్ని నెలలుగా ల్యాప్‌టాప్‌ని చూస్తున్నాడు.. తాజాగా షార్ట్‌లిస్ట్‌కి వెళ్లి నిర్దిష్ట ల్యాప్‌టాప్‌ని ఎంచుకున్నాడు. 15 నిమిషాల్లో దాన్ని పొందే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ తక్షణ డెలివరీని చూసిన యూజర్ షాక్ అయ్యాడు. ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు చాలా వేగంగా డెలివరీ చేస్తుందని నమ్మలేకపోయాడు. ఒక ఫోన్ డెలివరీ కావడానికి 15 రోజులు పట్టింది. అలాంటిది ఖరీదైన లాప్‌టాప్ అంత త్వరగా డెలివరీ అవుతుందని అనుకోలేదు అంటూ సంతోషం వ్యక్తం చేశాడు సదరు వినియోగదారుడు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..