AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Nano EV: టాటా నానో ఈవీ లాంచింగ్‌ అప్పుడే.. ఫీచర్స్‌, ధరపై ఓ లుక్కేయండి

ఈసారి మరిన్న ఆకర్షణీయమైన ఫీచర్లతో, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో టాటా నానో ఈవీ కారు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే కంపెనీ మాత్రం ఇప్పటి వరకు ఈ కారుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ తాజాగా ఈ కారు విడుదలకు సంబంధించి ఎట్టకేలకు..

Tata Nano EV: టాటా నానో ఈవీ లాంచింగ్‌ అప్పుడే.. ఫీచర్స్‌, ధరపై ఓ లుక్కేయండి
Tata
Narender Vaitla
|

Updated on: Oct 14, 2024 | 7:43 AM

Share

దివంగత వ్యాపార దిగ్గజం రతన్‌ టాటా కలల ప్రాజెక్ట్‌, సామాన్యుడి కారు కలను నిజం చేసిన టాటా నానా ఆటోమొబైల్‌ మార్కెట్‌లో ఓ సంచలనంగా దూసుకొచ్చిన విషయం తెలిసిందే. రూ. లక్షలో కారును తీసుకొచ్చి అప్పట్లో సంచలనం సృష్టించారు. అయితే ఈ కారు ఆశించిన స్థాయిలో మాత్రం ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాటా నానో కొత్త వెర్షన్‌ అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే.

ఈసారి మరిన్న ఆకర్షణీయమైన ఫీచర్లతో, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో టాటా నానో ఈవీ కారు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే కంపెనీ మాత్రం ఇప్పటి వరకు ఈ కారుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ తాజాగా ఈ కారు విడుదలకు సంబంధించి ఎట్టకేలకు ఓ ప్రకటన చేసింది. టాటా నానో ఈవీ కారును ఈ ఏడాది చివరల్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో మరోసారి టాటా నానో కారుకు సంబంధించిన చర్చ మొదలైంది. ఈ కారు కచ్చితంగా ప్రజలను ఆకర్షిస్తుందని కంపెనీ ధీమాతో ఉంది. దీనికి కారణం ఇందులో తీసుకురానున్న ఫీచర్లే. మరీ తక్కువ ధర కాకుండా మిడ్ రేంజ్‌లో ఈ కారును తీసుకొస్తుండడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఇంతకీ టాటా నానో ఈవీలో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఫీచర్ల విషయానికొస్తే ఈ కారు 15 కేడబ్ల్యూహెచ్‌ కెపాసిటీతో కూడిన బ్యాటరీతో రానుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 312 కి.మీల రేంజ్‌ ఇస్తుందని తెలుస్తోంది. ఇక ఈ కారు గంటకు 120 కి.మీల వేగంతో దూసుకెళ్తుంది. 4 సీట్ కెపాసిటీతో వచ్చే ఈ కారులో 7 ఇంచెస్‌ టచ్‌ స్క్రీన్‌తో కూడి ఇన్ఫొమెంట్ సిస్టమ్‌ను అందించనున్నారు. అలాగే ఇందులో 6 స్పీకర్లను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పవర్‌ స్టీరింగ్, పవర్‌ విండోస్‌ ఈ కారు సొంతం.

యాంటీ లాక్‌ బ్రేక్ సిస్టమ్‌తో కూడిన ఈ కారు కేవలం 10 సెకండ్లలో 0 నుంచి 100 కి.మీల వేగాన్న అందుకోగలదు. ఎయిర్‌ బ్యాగ్స్‌తో రానుంది. ధర విషయానికొస్తే ఈ కారు బేస్‌ వేరియంట్ రూ. 3.5 లక్షలుగా ఉండనుంది తెలుస్తోంది. ఇందులో టాప్‌ వేరియంట్ రూ. 5 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ కారుకు సంబంధించిన అధికారిక ఫొటో త్వరలోనే విడుదల చేయనున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..