- Telugu News Photo Gallery Business photos No tension even if the tires get punctured, There are many benefits with tire inflators, Tyre inflators details in telugu
Tyre inflators: టైర్లకు పంక్ఛర్ పడినా నో టెన్షన్.. టైర్ ఇన్ ఫ్లేటర్లతో ఎంతో ప్రయోజనం
నేడు కాలంతో మనిషి పరుగులు తీస్తున్నాడు. తక్కువ సమయంలో అనేక పనులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దానికి అనుగుణంగానే కార్లు, మోటారు సైకిళ్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇవి లేకపోతే రోజు గడవని పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరూ తమ అవసరాలను అనుగుణంగా నిత్యం కార్లు, ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారు. వీటితో ప్రయాణం చాలా సులువుగా, వేగంగా జరురగుతుంది. అదే సమయంలో టైర్లకు పంక్చర్లు పడినప్పడు ప్రయాణం ఆగిపోతుంది. పంక్చర్ షాపుల కోసం వెతకడం ప్రారంభిస్తాం. ఆ సమయంలో చాలా విసుగ్గా, చికాకుగా ఉంటుంది. అలాంటప్పుడు టైర్ ఇన్ ఫ్లేటర్లు చాలా ఉపయోగంగా ఉంటాయి. వాటి ద్వారా టైర్లలో గాలిని నింపి, దగ్గరలోని పంక్ఛర్ షాపు వద్ద సులభంగా వెళ్లవచ్చు. అక్కడ పంక్చర్ వేయించుకుని ప్రయాణం కొనసాగించవచ్చు. అమెజాన్ లోప్రస్తుతం లభిస్తున్నటాప్ ఇన్ ఫ్లేటర్ల గురించి తెలుసుకుందాం.
Srinu |
Updated on: Oct 14, 2024 | 8:03 PM

ప్రముఖ హీరో గ్రూప్ నుంచి విడుదలైన క్యూబో స్మార్ట్ టైర్ ఇన్ ఫ్లేటర్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. 150 పీఎస్ఐ స్థాయి, 2000 ఎంఏహెచ్ బ్యాకరీ, టైప్ సీ పోర్ట్, డిజిటల్ డిస్ ప్లే, ఐదు ఎయిర్ ఫిల్ మోడ్ లు, లెడ్ లైట్ దీని ప్రత్యేకతలు. కాంపాక్ట్ డిజైన్ కారణంగా సులభంగా తీసుకువెళ్లవచ్చు. బ్యాటరీ, కారు పవర్ రెండింటికీ మద్దతు ఇస్తుంది. అమెజాన్ లో క్యూబో స్మార్ట్ టైర్ ఇన్ ఫ్లేటర్ రూ.2,390కు అందుబాటులో ఉంది. కార్లు, బైక్ ల కోసం ఉపయోగపడుతుంది.

కార్లు, బైక్ ల కోసం రూపొందించిన అగార్ గెలాక్సీ టైర్ ఇన్ ఫ్లేటర్ ను చాలా సులభంగా వినియోగింవచ్చు. రీచార్జి చేయగల సులభమైన బ్యాటరీ, కార్డ్ లెస్ ఆపరేషన్, పోర్టబుల్ డిజైన్ తో ఆకట్టుకుంటోంది. దీని ద్వారా టైర్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గాలిని నింపుకోవచ్చు. .అగార్ గెలాక్సీ ఇన్ ఫ్లేటర్ అమెజాన్ లో రూ.1999కి అందుబాటులో ఉంది.

అగారో ప్రియో హైపవర్ కార్లు, మోటారు సైకిళ్ల కు ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. దీనిలో 120 వాట్ల ఎయిర్ పంప్, 12వీ కార్ ఫ్లగ్, 150 పీఎస్ఐ, ఎమర్జెన్సీ ఎల్ఈడీ లైట్ ఉన్నాయి. కాంపాక్ట్, పోర్టబుల్ డిజైన్ కారణంగా ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. ఈ ఇన్ ఫ్లేటర్ అమెజాన్ లో రూ.1,699కి అందుబాటులో ఉంది.

అగారో పోర్టబుల్ ప్లాస్టిక్ సైకిళ్ల, ఇతర గాలిని అవసరమైన వస్తువుల కోసం దీన్ని రూపొందించారు. దీనిలోని అధిక పీడనంతో గాలి చక్కగా నింపుకోవచ్చు. అలాగే ఎక్కడికైనా సులువుగా తీసుకువెళ్లగలిగే అవకాశం ఉంది. రీడింగ్ కోసం డిజిటల్ డిస్ ప్లేతో పాటు అంతర్నిర్మిత లైట్ ఏర్పాటు చేశారు. అయితే పెద్ద వాహనాల టైర్లకు అంతంగా ఉపయోగపడదు. అమెజాన్ లో ఈ ఇన్ ఫ్లేటర్ రూ.2,998కు అందుబాటులో ఉంది.

లైరోవో 160 పీఎస్ఐ డబుల్ సిలిండర్ పోర్టబుల్ ఫుట్ పంప్ ఎయిర్ ఇన్ ఫ్లేటర్ కార్లు, బైక్ లు, సైకిళ్లకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రత్యేకంగా మోటారు సైకిళ్ల కోసం తయారు చేశారు. పోర్టబుల్ డిజైన్ కారణంగా ప్రయాణంలో కూడా తీసుకువెళ్లవచ్చు. రీడింగ్ కచ్చితంగా తెలుసుకునేందుకు డిజిటల్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. అలాగే ఎల్ఈడీ లైట్ కూడా అమర్చారు. అమెజాన్ లో ఈ ఇన్ ఫ్లేటర్ రూ.1,199 ధరకు అందుబాటులో ఉంది.





























