Bikes Under 2 Lakh: రూ.2లక్షలలోపు ధరలో బెస్ట్ 200సీసీ బైక్స్.. జాబితా చూస్తే షాక్ అవుతారు..
మన దేశంలోని ద్విచక్ర వాహన మార్కెట్లో చాలా వైవిధ్యం ఉంటుంది. లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకూ ప్రతి ఒక్కరికీ అనేక రకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. రూ. 50వేలకి బండి దొరకుతుంది. అదే సమయంలో రూ. 2 లక్షలు ఆ పైన కూడా టూ వీలర్స్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. బండి సామర్థ్యాలను బట్టి రేటు మారుతుంటుంది. అయితే మీకు మిడ్ రేంజ్ బడ్జెట్లోనే అంటే రూ. 2లక్షలలోపు ధరలోనే 200సీసీ బైక్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఆటో దిగ్గజాలైన టీవీఎస్, బజాజ్, కేటీఎం, హీరో వంటి బ్రాండ్ల నుంచి రూ. 2లక్షల బడ్జెట్లో మంచి స్పోర్ట్స్ లుక్ లో కనిపించే బైక్స్ ఉన్నాయి. అలాంటి టాప్ బైక్స్ మీకు పరిచయం చేస్తున్నాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
