- Telugu News Photo Gallery Business photos With these hot summers are like snow storms, Huge discount on Amazon, Amazon sale on air conditioners details in telugu
Amazon sale: వీటితో మండు వేసవిలోనూ మంచు పవనాలే.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్..!
ప్రస్తుతం కాాలానికి సంబంధం లేకుండా ఏసీల వినియోగం పెరుగుతోంది. గతంలో కేవలం వేసవిలోనే వీటి అవసరం ఉండేది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, నగరాల్లో నివాసం, ఇరుకు గదుల కారణంగా స్వచ్ఛ మైన, శుభ్రమైన గాలి అవసరం ఎక్కువైంది. దీంతో చల్లదనంతో పాటు స్వచ్ఛమైన గాలిని అందించే ఏసీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫాం అయిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అనేక రకాల వస్తువులను భారీ తగ్గింపులో అందుబాటులో ఉంచారు. వాటిలో 1.5 టన్ స్ల్పిట్ ఏసీలను విక్రయిస్తున్నారు. క్వారియర్, పానాసోనిక్, లాయిడ్, డైకిన్, హిటాచీ తదితర ప్రముఖ బ్రాండ్ల ఏసీలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. అమెజాన్ లో అందుబాటులో ఉన్నఏసీలు, వాటి ప్రత్యేకతలు ఇవే..!
Srinu |
Updated on: Oct 15, 2024 | 4:30 PM

క్యారియర్ ఏసీ మంచి ఫిల్టర్, గాలి శుద్ధీకరణ ఫీచర్ తో పీల్చే గాలిని శుభ్రంగా, హానికరమైన రేణువులు లేకుండా విడుదల చేస్తుంది. ఇల్లు లేదా కార్యాలయం రెండింటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆటో క్లెన్సర్ ఫీచర్, 6 ఇన్ 1 కన్వర్టిబుల్ మోడ్, ఈస్టర్ నీయో టెక్నాలజీ అదనపు ప్రత్యేకతలు. అమెజాన్ సేల్ లో క్వారియర్ 1.5 టన్ను 3 స్టార్ ఏఐ ఫెక్సికూల్ ఏసీని రూ.34,990కు కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.1696 ఈఎంఐ చెల్లించే అవకాశం కూడా ఉంది.

డైకిన్ ఏడాది పొడవునా మీకు చల్లదనాన్ని అందించేలా మెరుగైన మన్నికతో ఉంటుంది. దీనిలోని 17100 బ్రిటీష్ థర్మల్ యూనిట్ శీతలీకరణ శక్తి తో వేసవిలో కూడా శీతాకాలం అనుభూతిని పొందవచ్చు. 3 డీ ఎయిర్ ఫ్లో, డ్యూ క్లీన్ టెక్నాలజీలు, ట్రిపుల్ డిస్ ప్లే, మెరుగైన ఇండోర్ ఎయిర్ క్వాలీటీ కోసం పీఎం 2.5 ఫిల్టర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. డైకిన్ 1.5 టన్ 3 స్మార్ట్ ఇన్వెర్టర్ స్ప్లిట్ ఏసీని అమెజాన్ లో 36,490కి కొనుగోలు చేసుకోవచ్చు.

హిాటాచీ తక్కువ స్థలంలో బిగించేకునేందుకు వీలున్న ఈ ఏసీ తో పెద్ద గదులను కూడా చాాలా సులువుగా చల్లబర్చుకోవచ్చు. దీనిలో 5 కిలో వీట్ల కూలింగ్ పవర్ ఉంది. ఐస్ క్లీన్ ఫీచర్ తో స్వచ్ఛమైన గాలి వీస్తుంది. ఎక్స్పెండబుల్ ప్లస్ టెక్నాలజీతో అన్ని మూలలకూ గాలి వెళుతుంది. హెక్సా సెన్సార్, వంద శాతం రాగి నిర్మాణం, డస్ట్ ఫిల్టర్ అదనపు ప్రత్యేకతలు. హిటాచీ 1.5 టన్ క్లాస్ 3 స్టార్ ఇన్వెర్టర్ స్ప్లిట్ ఏసీని అమెజాన్ లో 37,490కి కొనుగోలు చేసుకోవచ్చు.

లాయిడ్ స్వచ్ఛమైన, చల్లనైన గాలిని అందించడానికి లాయిడ్ ఏసీలో అనేక ఫీచర్లు ఉన్నాయి. గోల్డెన్ ఫిన్ ఆవిరిపోరేటర్, యాంటీ వైరల్ ఫిల్టర్, పీఎం 2.5 ఫిల్టర్ తో పనతీరు చాలా నాణ్యంగా ఉంటుంది. 5 ఇన్ 1 కన్వర్టిబుల్ ఫంక్షన్ తో మీకు అనుగుణంగా సెట్టింగ్ లను మార్చుకోవచ్చు. ఏ గదికైనా చక్కగా సరిపోయే ఈ ఏసీతో వేసవికాలంలో కూడా శీతల పవనాలను ఆస్వాదించవచ్చు. లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ అమెజాన్ లో 33,490కు అందుబాటులో ఉంది. అలాగే ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.4 వేల వరకూ ప్రత్యేక తగ్గింపు అందిస్తున్నారు.

పానాసోనిక్ లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన పానాసోనిక్ ఏసీతో గదికి కొత్త అందం వస్తుంది. పనితీరు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రాగి కండెన్సర్, 7 ఇన్ 1 కన్వర్టిబుల్ ఫీచర్, ట్రూ ఏఐ మోడ్,ఎయిర్ ఫ్యూరిఫికేషన్, స్పెషల్ డిస్ ప్లే తదితర ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. మీ వాయిస్ లేదా స్మార్ట్ పరికరాన్ని వినియోగించి నియంత్రణ చేయవచ్చు. పానాసోనిక్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీని అమెజాన్ లో రూ.41,390కి కొనుగోలు చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఎంపిక కూడా అందుబాటులో ఉంది.





























