Cyber Frauds: కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచన.. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఈ ఒక్క పని చేయండి చాలు..
మీకు ఫ్యామిలీ కోడ్ ఉందా? లేకపోతే ఇప్పుడే ఓ ఫ్యామిలీ కోడ్ పెట్టుకోండి.. కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచన... ఇది మిమ్మల్ని సైబర్ క్రైమ్ నుంచి కాపాడుతుంది.. లేటెస్ట్‌గా అమెరికా ఎఫ్‌బీఐ ఒక సూచన చేసింది. ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ కోడ్ కలిగి ఉండాలని చెప్పింది. ఈ కోడ్ ఒక పదం అయి ఉండొచ్చు, లేదా ఒక ఏదైనా నెంబర్, ఇష్టమైన పాట, ఇంకేదైనా వస్తువు పేరు అయి ఉండొచ్చు.. భలే ఉంది కాదా ఈ ఐడియా..
సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నేరగాళ్లు కొత్త దారులు తొక్కుతున్నారు. మనం ఊహించిన దాని కంటే ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగించి నిలువు దోపిడీ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే అవగాహన ఒక్కటే మార్గం. లేటెస్ట్‌గా అమెరికా ఎఫ్‌బీఐ ఒక సూచన చేసింది. ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ కోడ్ కలిగి ఉండాలని చెప్పింది. ఈ కోడ్ ఒక పదం అయి ఉండొచ్చు, లేదా ఒక ఏదైనా నెంబర్, ఇష్టమైన పాట, ఇంకేదైనా వస్తువు పేరు అయి ఉండొచ్చు. ఈ కోడ్ కుటుంబంలో ఉన్న సభ్యులకు మాత్రమే తెలిసేలా ఉండాలి.
అసలు ఈ ఫ్యామిలీ కోడ్ ఎందుకు?
సైబర్ క్రిమినల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ ప్రపంచంలో మిమ్మల్ని క్రియేట్ చేస్తారు. మీ ఫోటోలను డీప్ ఫేక్ చేసి జైల్లో ఉన్నట్టుగానో, ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకున్నట్లుగాను క్రియేట్ చేస్తారు. ఆ ఫోటోలను మీకు పంపించి డబ్బులు పంపించమని బ్లాక్ మెయిల్ చేస్తారు. అంతేకాదు ఏఐ టెక్నాలజీతో మీ కుటుంబ సభ్యుల వాయిస్‌ను సృష్టించి వారితో మాట్లాడించినట్లుగా మాట్లాడిస్తారు. ఇంకా అడ్వాన్సుడ్‌గా మీ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లను క్లోనింగ్ చేసి మీకు ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాస్వర్డ్ డబ్బులు అడుగుతారు. వాలెట్ పోయిందనో, క్రెడిట్ కార్డు పనిచేయడం లేదనో, కారు ప్రమాదానికి గురైందని ఇలాంటి కారణాలు చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులు లాగుతారు. అలాంటప్పుడు ఈ ఫ్యామిలీ కోడ్ ఉపయోగపడుతుంది. ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే మీ కుటుంబ సభ్యుల్ని మన ఫ్యామిలీ కోడ్ ఏంటి అని అడిగితే.. అక్కడే అది సైబర్ క్రైమ్ కాల్ అనేది మీకు అర్థమవుతుంది.
ఇండియా సైబర్ క్రైమ్‌కు అతిపెద్ద బాధితదేశం. ప్రతి గంటకు కొన్ని వందల కోట్లు డిజిటల్ చోరీకి గురవుతున్నాయి. అందులో ఇలాంటివి చాలా ఎక్కువ. కాబట్టి కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం ఒక ఫ్యామిలీ కోడ్ క్రియేట్ చేసుకుంటే కేవలం సైబర్ క్రైమ్ కోసమే కాదు చాలా విషయాల్లో అది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి ఎవరైనా అపరిచితులు వెళ్లిన మీ పిల్లలు ఫ్యామిలీ కోడ్ అడుగుతారు. మీ భాగస్వామి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని అర్జెంటుగా ఆయన మెయిల్ ఐడి పాస్వర్డ్ చెప్పాలని ఎవరైనా అడిగినా, సార్ బిజీగా ఉన్నారు మిమ్మల్ని అడగమన్నారని చెప్పినా ఫ్యామిలీ కూడా అడిగితే బండారం బయటపడుతుంది. సో ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనగా ఈ ఫ్యామిలీ కోడ్ ఏర్పాటు చేసుకోండి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి