Market Fall History: గ్లోబల్ ఇన్సిడెంట్లకు భారత స్టాక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అయ్యింది.. రికవరీకి ఎన్ని రోజులు పట్టాయి.. పూర్తి వివరాలు..
Market Fall History: అంతర్జాతీయ ఎక్కడ ఏ చిన్న ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా.. దాని ఇంపాక్ట్ ముందుగా స్టాక్ మార్కెట్లపై కచ్చితంగా ఉంటుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధభేరి మోగించడంతో ఇవాళ మార్కెట్లు మళ్లీ పతనమయ్యాయి.
Market Fall History: అంతర్జాతీయ ఎక్కడ ఏ చిన్న ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా.. దాని ఇంపాక్ట్ ముందుగా స్టాక్ మార్కెట్లపై కచ్చితంగా ఉంటుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధభేరి మోగించడంతో.. ఇవాళ భారత మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనమవడం చూస్తే అది నిజమే అనిపిస్తోంది. డ్రా డౌన్‌లో ఇవాళ ఆల్‌టైం రికార్డు సృష్టించిన మార్కెట్లు.. ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బతీశాయి. పుతిన్ ఇచ్చిన షాక్‌తో ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. కేవలం దేశీయ మార్కెట్లు మాత్రమే కాదు.. ఆసియా నుంచి యూరప్ వరకు అన్ని ఎక్ఛేంజ్లలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. దేశీయ మార్కెట్స్ హిస్టరీలో ఇలాంటి బ్లాక్ డేస్ చాలానే ఉన్నాయి. గత ఇరవై సంవత్సరలుగా.. అలాంటి చీకటి రోజుల్లో.. మార్కెట్లు ఎంతెంత నష్టపోయాయి? ఆ లాస్ నుంచి రికవరీ కావడానికి ఎంత సమయం పట్టింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ట్విన్ టవర్స్ పై దాడి జరిగినప్పుడు..
ఇరవై ఏళ్ల క్రితం.. 11-09-2001న అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద టెర్రర్ అటాక్ జరిగింది. ఆ దెబ్బకు మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. ఆ ఒక్కరోజే 1.0 శాతం నష్టం జరిగింది. ఆ సమయంలో నష్టాల పరంపర.. 11 రోజుల పాటు కొనసాగితే.. టోటల్ డ్రాడౌన్ 17.3 శాతంగా నమోదైంది. ఈ లాస్ నుంచి రికవరీ కావడానికి.. 66 రోజులు పట్టిందంటే.. ఏ స్థాయిలో మార్కెట్లు నష్టపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత.. 2004 మార్చి 14న జరిగిన మాడ్రిడ్ ట్రైన్ బాంబింగ్స్.. మార్కెట్లకు పెద్ద షాకే ఇచ్చారు. ఒక్కరోజులోనే 2.7 శాతం పడిపోయాయి. ఈ నష్టాలు 10 రోజుల పాటు కొనసాగితే.. మొత్తం డ్రా డౌన్ 7 శాతంగా నమోదైంది. దీని నుంచి బయటపడేందుకు మార్కెట్లకు 20 రోజుల సమయం పట్టింది.
లండన్ టెర్రర్ ఎటాక్ సమయంలో..
జూలై 7, 2005న లండన్‌లో జరిగిన టెర్రర్ అటాక్.. మార్కెట్ల మీద తీవ్ర స్థాయిలో ప్రభావం చూపింది. వన్డే ఫాల్ 2.2 శాతంగా నమోదు కాగా.. టోటల్ డ్రా డౌన్ 2.2 శాతంగా రికార్డైంది. నష్టం ఒక్కరోజే వచ్చినప్పటికీ.. ఆ లాస్ నుంచి కోలుకునేందుకు మార్కెట్లకు ఏకంగా 12 రోజులు పట్టిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత.. 2017లో సిరియాపై అమెరికా చేసిన దాడి కూడా మార్కెట్లపై భారీ ఎఫెక్ట్ నే చూపింది. ఆ ఏడాది ఏప్రిల్ 17న జరిగిన ఈ అటాక్‌తో.. మార్కెట్లు కుదేలయ్యాయి. వన్డే ఫాల్ 0.1 శాతం కాగా.. 6 రోజుల పాటు ఆ లాస్ కంటిన్యూ అయ్యింది. టోటల్ డ్రా డౌన్ 0.5శాతంగా నమోదైంది. రికవరీకి11 రోజులు పట్టింది.
నార్త్ కొరియాపై బైడెన్ కన్నెర్ర చేసినప్పుడు..
అప్పట్లో నార్త్ కొరియాకు.. నాటి యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ కూడా మార్కెట్లను పెద్దగానే షేక్ చేసింది. 09- 08-2017న జరిగిన ఈ ఘటనతో.. మార్కెట్లలో వన్డే ఫాల్ 0.7 శాతంగా నమోదైంది. మూడ్రోజుల పాటు లాస్ కంటిన్యూ కాగా.. టోటల్ డ్రా డౌన్ 2.7శాతంగా నమోదైంది. ఆ లాస్ నుంచి కోలుకునేందుకు మార్కెట్లకు అత్యధికంగా 34 రోజులు పట్టింది. 2019 సెప్టెంబర్ 14న సౌదీలో జరిగిన డ్రోన్ అటాక్.. మార్కెట్లనూ అటాక్ చేసింది. వన్డే ఫాల్ 0.7 శాతంగా నమోదైంది. ఆరు రోజుల పాటు మార్కెట్లపై ఆ ప్రభావం కనిపించింది. మొత్తం టోటల్ డ్రా డౌన్ 3.4శాతంగా నమోదై… ఏడ్రోజులు గడిస్తే తప్ప రికవరీ కాలేకపోయింది.
అమెరికా-చైనా మధ్య హీట్ పెరిగినప్పుడు..
2020లో ఇరాన్ జరిగిన ఎయిర్ స్ట్రయిక్.. ఇరాన్ జనరల్ హత్య.. మార్కెట్లను ప్రభావితం చేసింది. జనవరి 3న జరిగిన ఈ ఇన్సిడెంట్‌తో.. మార్కెట్లకు వన్డే ఫాల్ 0.5 శాతంగా నమోదైంది. నాలుగు రోజుల పాటు వరుసగా పతనమై.. టోటల్ డ్రా డౌన్ 2.4 శాతంగా నమోదైంది. రికవరీకి 11రోజులు పట్టింది. 2020లో అగ్రరాజ్యం అమెరికాకు, చైనాకు మధ్య టెన్షన్ వాతావరణం నెలకొనడం కూడా మార్కెట్లను దెబ్బకొట్టింది. ఆ ఏడాది మే2న .. 0.9శాతం నష్టాల్ని చవిచూశాయి మార్కెట్లు. ఈ లాస్ 8రోజుల పాటు కంటిన్యూ అవడంతో టోటల్ డ్రా డౌన్ 1.0శాతంగా నమోదైంది. ఈ దెబ్బ నుంచి కోలుకోవడానికి మార్కెట్లకు 9 రోజులు పట్టింది.
ఇండియా- చైనా మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు..
అదే ఏడాది.. అంటే 2020లో ఇండియా- చైనా మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడం.. మార్కెట్లను దెబ్బకొట్టింది. జూన్ 15న.. 1.6శాతం పతనమయ్యాయి దేశీయ మార్కెట్లు. 3రోజుల పాటు అదే లాస్ కంటిన్యూ కావడంతో.. 1.6 శాతం టోటల్ డ్రా డౌన్ ను మూటగట్టుకున్నాయి. ఆరు రోజుల తర్వాతే కోలుకున్నాయి. ఇప్పుడు, ఉక్రెయిన్‌పై రష్యా మొదలెట్టిన యుద్ధం.. మార్కెట్లను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఉక్రెయిన్, రష్యా మధ్య టెన్షన్ మొదలైన ఫిబ్రవరి 2న 3.1 శాతం నష్టాన్ని మూటగట్టుకున్న మార్కెట్లు.. ఇవాళ పుతిన్ ఇచ్చిన షాక్‌తో దాదాపు ఐదు శాతం నష్టంతో ముగిశాయి. ఇన్వెస్టర్లను నిండి ముంచుతూ.. పది లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
ఇవీ చదవండి..
Stock Markets Crash: రష్యా దెబ్బ.. దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..