Billionaires Loss: రష్యా యద్ద బాంబ్.. నాలుగు గంటల్లో అపర కుబేరులకు మూడు లక్షల కోట్ల నష్టం
Billionaires Loss: ప్రపంచదేశాల భయాన్ని గురువారం ఉదయం ఉక్రెయిన్‌పై.. రష్యా ప్రత్యక్ష దాడికి దిగి నిజం చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి.
Billionaires Loss: ప్రపంచదేశాల భయాన్ని గురువారం ఉదయం ఉక్రెయిన్‌పై.. రష్యా ప్రత్యక్ష దాడికి దిగి నిజం చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. యుద్ధం ప్రారంభమైన 4-5 గంటల్లోనే ప్రపంచంలోని టాప్-20 సంపన్నుల సంపద రూ.3.11 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. అదే సమయంలో, భారతదేశం గురించి మాట్లాడుకుంటే.. ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఉదయ్ కోటక్, దిలీప్ సంఘ్వీ సహా టాప్-10 వ్యాపారవేత్తలు కూడా రూ. 60 వేల కోట్లకు పైగా నష్టపోయారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ నికర విలువ అత్యధికంగా రూ. లక్ష కోట్లు పడిపోయింది.
యుద్ధం ప్రారంభమైన వెంటనే.. భారత స్టాక్ మార్కెట్ పెద్ద ఎత్తున పడిపోయింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇంతకు ముందు కూడా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లో గందరగోళ పరిస్థితి నెలకొని ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఉదయం రష్యా ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగడంతో స్టాక్ మార్కెట్ భయాందోళనల మధ్య భారీగా పతనమైంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ డేటా ప్రకారం ధనిక వ్యాపారవేత్తల లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా తమ మార్కెట్ విలువను కోల్పోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ నికర విలువ యుద్ధం కారణంగా పడిపోతున్న షేర్ల ధరల కారణంగా మధ్యాహ్నం 12 గంటల వరకు రూ.21,000 కోట్లు క్షీణించింది. అదే విధంగా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి రూ.9,700 కోట్లు, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శివ్ నాడార్ రూ.5,300 కోట్లు, రాధాకిషన్ దమానీ, దిలీప్ సంఘ్వీ, కుమార్ బిర్లా వంటి బడా వ్యాపారవేత్తలు కూడా వేల కోట్ల నష్టాన్ని చవిచూశారు.
యుద్ధ వార్త రాగానే అమెరికా, యూకే, జపాన్, ఇండియా, చైనా సహా దాదాపు చాలా దేశాల స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. దీని కారణంగా ప్రపంచంలోని టాప్-20 ధనవంతులు కొన్ని గంటల్లోనే తమ సంపదలో మిలియన్ డాలర్లను కోల్పోయారు. ఎక్కువగా నష్టపోయివ వారి జాబితాలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచారు. ఫేస్‌బుక్‌కు చెందిన మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్, ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ల సంపద కూడా భారీగానే క్షీణించింది. ప్రపంచంలోని టాప్ 3 వ్యాపారవేత్తలు ప్రపంచంలోని టాప్ 3 ధనవంతులైన ఎలన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ మరియు జెఫ్ బెజోస్ లు రూ. 1.51 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
ఇవీ చదవండి..
Brain Dead: తాను చనిపోతూ ఎనిమిది మందికి ప్రాణదానం.. బ్రెయిన డెడ్ వ్యక్తి అవయవాలు చెన్నైకి..