AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Volkswagen ID.4 EV: సరికొత్త వోక్స్ వాగెన్ మోడల్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే అన్ని కిలో మీటర్లు ప్రయాణించొచ్చా..

Volkswagen ID.4 EV: వోక్స్ వాగెన్ అమెరికా మార్కెట్ కోసం 2022 సంవత్సరానికి గాను సరికొత్త ID.4 మోడల్ ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తెచ్చింది. ఇది గతంలో విడుదల చేసిన మోడల్ కు అప్‌డేట్ గా మార్కెట్ లోకి వచ్చింది.

Volkswagen ID.4 EV: సరికొత్త వోక్స్ వాగెన్ మోడల్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే అన్ని కిలో మీటర్లు ప్రయాణించొచ్చా..
Volkswagen
Ayyappa Mamidi
|

Updated on: Feb 24, 2022 | 7:32 PM

Share

Volkswagen ID.4 EV: వోక్స్ వాగెన్ అమెరికా మార్కెట్ కోసం 2022 సంవత్సరానికి గాను సరికొత్త ID.4 మోడల్ ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తెచ్చింది. ఇది గతంలో విడుదల చేసిన మోడల్ కు అప్‌డేట్ గా మార్కెట్ లోకి వచ్చింది. గతంలో ఉన్న కార్ మోడల్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేసిన తరువాత 420 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చేది. తాజాగా వచ్చివ అప్‌డేటెడ్ వెర్షన్ కేవలం ఒక్క ఛార్జ్ తో 480 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ ప్రకటించింది. వోక్స్ వాగెన్ అందుబాటులో ఉంచిన ఆల్-వీల్-డ్రైవ్ ID.4 ప్రో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 402 కి.మీ, ID.4 Pro S RWD ఒక్కసారి ఛార్జ్ చేస్తే 431 కి.మీ, AWD 395 కి.మీ మైలేజ్ ఇస్తాయి.

దీనికి తోడు అన్ని ID.4 మోడళ్లలో 84 kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంది. వెనుక చక్రాల డ్రైవ్ ID.4 201 హార్స్‌పవర్ (150 కిలోవాట్లు)తో ప్రామాణిక బ్యాటరీతో వస్తుంది. AWD మోడల్ కు ఉండే అదనపు మోటార్ వల్ల 295 హార్స్‌పవర్ (220 కిలోవాట్లు) అదనంగా లభిస్తోంది.

వోక్స్ వాగెన్ తన ID.4 ఎలక్ట్రిక్ కారులో మైలేజ్ ని ఎలా పెంచుకుందన్న సాంకేతికత వివరాలను ఇప్పటికీ వెల్లడించలేదు. అయితే జనవరి మాసంలో కంపెనీ ఇచ్చిన నివేదిక ప్రకారం ID.4 మోడల్ కారు యజమానులు దాని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లో కొన్ని చిన్న అప్‌డేట్‌లను ఆశించవచ్చని వెల్లడించింది. వోక్స్ వాగెన్ ప్రతినిధి Motor1కు ఇచ్చిన వివరాల ప్రకారం కార్ తయారీలో మెరుగుపరచబడిన ఫిట్, ఫినిషింగ్ ఫలితంగా మైలేజ్ విషయంలో కార్ మరింతగా మెరుగుపడినట్లు వెల్లడించారు. ఉత్పత్తి కాలక్రమేణా జరిగే మార్పుల్లో భాగంగా ఈ మెరుగుదల సహజమైనదేనని ఆయన అన్నారు.

వోక్స్ వాగెన్ కూడా ID.4 యజమానుల కోసం ఎలక్ట్రిఫై అమెరికా సంస్థతో మూడు-సంవత్సరాల అపరిమిత-వినియోగ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. అది వారికి 30 నిమిషాల ఛార్జింగ్ సెషన్‌లను ఉచితంగా అందిస్తుంది. ప్రస్తుత మెరుగుపరచబడిన ID.4 కార్ మోడల్ ధర భారత కరెన్సీ ప్రకారం రూ. 30.41లక్షలుగా ఉంది.

Also Read..

SBI customers alert: పొరపాటున మీ పిన్ నంబర్, పాస్ వర్డ్ చెప్పకూడని వారికి చెప్పేశారా.. అయితే ఇలా చేయండి..

Loan App: ఆ లోన్ యాప్ గుర్తింపును రద్దు చేసిన RBI.. మీరూ అందులో రుణం తీసుకున్నారేమో చూసుకోండి..