Loan App: ఆ లోన్ యాప్ గుర్తింపును రద్దు చేసిన RBI.. మీరూ అందులో రుణం తీసుకున్నారేమో చూసుకోండి..

Loan App: రూల్స్ అతిక్రమిస్తున్న ఆన్ లైన్ రుణ యాప్(Loan Apps) లపై రిజర్వు బ్యాంక్(RBI) మరో సారి కఠిన చర్యలు తీసుకుంది. ఆర్బీఐ నిబంధనలను పాటించకుండా ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తున్న రుణ యాప్ పై చర్యలు తీసుకుంది.

Loan App: ఆ లోన్ యాప్ గుర్తింపును రద్దు చేసిన RBI.. మీరూ అందులో రుణం తీసుకున్నారేమో చూసుకోండి..
Rbi On Loan App
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 24, 2022 | 6:00 PM

Loan App: రూల్స్ అతిక్రమిస్తున్న ఆన్ లైన్ రుణ యాప్(Loan Apps) లపై రిజర్వు బ్యాంక్(RBI) మరో సారి కఠిన చర్యలు తీసుకుంది. ఆర్బీఐ నిబంధనలను పాటించకుండా ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తున్న రుణ యాప్ లను గుర్తించటం, వాటిని గాడిలో పెట్టే పనిలో ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా.. రిజర్వ్ బ్యాంక్ లోగోలను అనధికారికంగా ఉపయోగించటంతో పాటు రుణాలు తీసుకునేవారిపై అధిక వడ్డీ రేట్లు విధించడం వంటి నిబంధనల ఉల్లంఘనల కారణంగా PC ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను రద్దు చేసింది. దీనికి సంబంధించి తీసుకున్న చర్యల వివరాల గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటన చేసింది.

PC ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాథమికంగా ‘Cashbean’ అనే మొబైల్ యాప్ ద్వారా రుణ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఔట్‌సోర్సింగ్‌పై RBI ఆదేశాలను ఉల్లంఘించడంతో పాటు కేవైసీ నిబంధనలను తెలుసుకోవడం వంటి పర్యవేక్షక సమస్యల కారణంగా కంపెనీకి గతంలో ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ ను రద్దుచేసినట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.

కంపెనీ వడ్డీ రేట్ల విషయంలో తన రుణగ్రహీతలకు అపారదర్శకతను పాటించకపోవటంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. అందువల్ల RBI చట్టం, 1934లోని సెక్షన్ 45-Iలోని క్లాజ్ (a) కింద తీసుకున్న చర్యల ద్వారా ఇకపై PC ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్.. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ (NBFC) వ్యాపార లావాదేవీలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. దీనికి తోడు ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్‌ను ఉల్లంగిస్తూ.. రుణగ్రహీతల నుంచి లోన్ల రికవరీ కోసం రిజర్వ్ బ్యాంక్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థల లోగోలను అనధికారికంగా సదరు కంపెనీ ఉపయోగించడాన్ని ఆర్బీఐ తప్పుపట్టింది.

వడ్డీ రేటు మరియు ఇతర ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు కనుగొనబడింది, RBI తెలిపింది. “అందువలన, M/s PC ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, RBI చట్టం, 1934లోని సెక్షన్ 45-Iలోని క్లాజ్ (a)లో నిర్వచించిన విధంగా, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ (NBFI) యొక్క వ్యాపార లావాదేవీలను నిర్వహించదు,” RBI ఒక విడుదలలో తెలిపారు. యాప్ స్టోర్ లో ఉన్న మెుత్తం 1100 వివిధ రుణ యాప్ లలో సుమారు 600 అనధికారికంగా వ్యాపారాలను కొనసాగిస్తున్నట్లు గత నవంబర్ లోనే రిజర్వు బ్యాంక్ గుర్తించింది. వీటిని కట్టడి చేసేందుకు వెరిఫైడ్ యాప్ ల సమాచారంతో కూడిన పబ్లిక్ రిజిస్ట్రర్ ను సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టింది.

Also read..

Emergency Fund: ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి.. దానికోసం ఎంత అవసరం.. ఎక్కడ దాచుకోవాలి..

Stock Markets Crash: రష్యా దెబ్బ.. దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..