Emergency Fund: ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి.. దానికోసం ఎంత అవసరం.. ఎక్కడ దాచుకోవాలి..

Emergency Fund: చాలా మంది అత్యవసరం కోసం ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి ఉండాలని భావిస్తుంటారు. కానీ అందరికీ సామాన్యంగా ఉండే అనుమానాలకు సమాదానాలు ఇక్కడ తెలుసుకోండి..

Emergency Fund: ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి.. దానికోసం ఎంత అవసరం.. ఎక్కడ దాచుకోవాలి..
Emergency Fund
Follow us

|

Updated on: Feb 24, 2022 | 5:22 PM

Emergency Fund: చాలా మంది అత్యవసరం కోసం ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి ఉండాలని భావిస్తుంటారు. కానీ అందరికీ సామాన్యంగా ఉండే అనుమానం ఏమిటంటే ఆ డబ్బును ఎఫ్ డి(Fixed deposit) లో పెట్టుబడి పెట్టాలా లేక మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) లో పెట్టుబడి పెట్టాలా అన్నదే. ఇవేవీ కాకుండా ఇంకేమైనా ఇతర ఇన్వెస్ట్ మెంట్ మార్గాలు ఉన్నాయా అని తెలుసుకుందాం రండి.. ఎమర్జెన్సీ లేదా కండింజెంట్ ఫండ్ అనేది మీ పర్సనల్ ఫైనాన్స్ లో ఒక భాగమే. దీనిని అసలు ఏర్పాటు చేయటానికి వెనుక ఉన్న అసలు కారణం ఏమిటంటే జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు అత్యవసరంగా డబ్బు అవసరం అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మీకు ఈ ఎమర్జెన్సీ ఫండ్ అండగా నిలుస్తుంది. ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు సహాయకారిగా నిలుస్తుంది.

ప్రత్యేకంగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ కలిగి ఉండడం వల్ల అనుకోకుండా ఎదురైన సమస్యను పరిష్కరించటానికి.. మీ వద్ద ఉండే ఇతర సేవింగ్స్ కు సంబంధించిన నిధులను వెచ్చించాల్సిన అవసరం ఉండదు. దీర్ఘకాల అవసరాలకోసం ఏర్పాటు చేసుకున్న ఇతర మెుత్తాలను అలాగే కొనసాగించవచ్చు. ప్రతి నెలా చేసే ఖర్చులతో పాటు ప్రతి కుటుంబం కొంత మెుత్తాన్ని ఈ ఎమర్జెన్సీ ఫండ్ కు జోడించాలి. ఇలా ప్రత్యేకంగా పక్కన పెట్టిన సొమ్ము ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ అనుకోకుండా అనారోగ్యానికి గురైనప్పుడు ఉపయోగపడుతుంది.

అసలు ఒక వ్యక్తి ఎమర్జెన్సీ ఫండ్ ను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అతను ముందుగా.. నెల వారీ అయ్యే ఖర్చులు అంటే.. ఇంటి నిర్వహణ ఖర్చులు, పిల్లల చదువుల కోసం అయ్యే ఖర్చు, బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎమ్ఐలు, ఇన్సూరెన్స్ ప్రీమియం మెుత్తాలు వంటి వాటిని ముందుగా పరిగణలోకి తీసుకోవాలి. ఇలా అన్ని ఖర్చులను కలుపుకుంటే వచ్చే మెుత్తం డబ్బు ఒక ఆరు నుంచి తొమ్మిది నెలల కాలానికి గుణించాలి. ఈ లెక్కగట్టిన సొమ్మును ఏదైనా గుర్తింపు కలిగిన బ్యాంక్ లో ఎఫ్ డి రూపంలో సేవ్ చేయాలి. లేదా ఇతర ఏదైనా లిక్విడ్ ఫండ్, స్వల్ప కాలం ఫండ్లలో పెట్టుబడి రూపంలో సేవ్ చేయాలి.

అసలు ఈ ఎమర్జెన్సీ ఫండ్ ను ఎన్ని నెలల ఖర్చులకు సరిపడా ఉండేలా చూసుకోవాలి అనేది మీ వ్యక్తిగత ఉద్యోగం, వ్యాపారంలోని పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కనీసం ప్రతి ఒక్కరూ 6 నెలలకు అయ్యే ఖర్చుల మెుత్తాన్ని ఈ ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా ఎంత అవసరం, ఎంత సొమ్ము ఎమర్జెన్సీ ఫండ్ గా ఉంటే సేఫ్ వంటి అంశాలను గ్రహించి దానికి అనుగుణంగా చిన్న మెుత్తాల్లో సొమ్మును సేవ్ చేస్తూ ముందుకు వెళితే బాగుంటుంది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటులో ముందుగా పరిగణలోకి తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం దానిపై వచ్చే ఆదాయం కన్నా దాని భద్రత గురించే. తక్కువ రాబడి వచ్చినా పర్వాలేదు కానీ.. ఎమర్జెన్సీ ఫండ్ ను మాత్రం సేఫ్ గా పార్క్ చేయాలి. అప్పుడు అది మీ తక్షణ అవసరాలకు ఉపయోగపడుతుంది.

Also read..

Stock Markets Crash: రష్యా దెబ్బ.. దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Provident Fund: పీఎఫ్ అకౌంట్ ఉంటే ఇన్సూరెన్స్ ఉన్నట్లేనా.. మీరూ తెలుసుకోండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..