FD Interest Rates: మూడు లక్షల పెట్టుబడితో ముచ్చటైన రాబడి.. ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీపై అదిరే వడ్డీ

ఫిక్స్‌డ్ డిపాజిట్లు భారతదేశంలో పెట్టుబడిదారులకు అధిక రాబడినిచ్చే పెట్టుబడి ఎంపికగా మారాయి. ఎఫ్‌డీలు సాధారణంగా ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల వరకు స్థిరమైన వ్యవధిలో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అనువుగా ఉంటాయి. అయితే ఎఫ్‌డీల ద్వారా వచ్చే వడ్డీ రేట్లు బ్యాంక్, డిపాజిట్ మొత్తం, ఎంచుకున్న కాలవ్యవధి ఆధారంగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీల్లో పెట్టుబడుల ప్రముఖ బ్యాంకు అందించే వడ్డీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

FD Interest Rates: మూడు లక్షల పెట్టుబడితో ముచ్చటైన రాబడి.. ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీపై అదిరే వడ్డీ
Follow us
Srinu

|

Updated on: Nov 03, 2024 | 7:15 PM

పెట్టుబడిదారులు సరైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ఎంచుకోవడం వల్ల మీ పొదుపుపై ​​గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకులు పోటీ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. పెట్టుబడిదారులు వారి ఆర్థిక లక్ష్యాలు, వయస్సు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా ఉండడంతో పాటు స్థిరమైన రాబడిని అందిస్తాయి. కాలక్రమేణా మీ పొదుపులను పెంచడంలో సహాయపడతాయి. అయితే పెట్టుబడి విషయంలో పెట్టుబడిదారులు తెలివిగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లో మూడు సంవత్సరాల కాలానికి రూ.3 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత రాబడి వస్తుందో? ఓ సారి చూద్దాం. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ పౌరులకు 6.75 శాతం వడ్డీ అందిస్తుంటే సీనియర్ సిటిజన్లకు 7.25శాతం వార్షిక వడ్డీ అందిస్తుంది. మూడు సంవత్సరాల కాలానికి మూడు లక్షల పెట్టుబడిపై సాధారణ పౌరుడికి రూ.66,718 వడ్డీ వస్తుంటే సీనియర్ సిటిజన్లకు రూ. 72,164 రాబడి వస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.00 శాతం వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ అందిస్తుంది. మూడు సంవత్సరాల కాలానికి మూడు లక్షల పెట్టుబడిపై సాధారణ పౌరుడికి రూ.69,432 వడ్డీ వస్తుంటే సీనియర్ సిటిజన్లకు రూ. 74,915 రాబడి వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఐసీఐసీఐ బ్యాంక్

ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 7.00 శాతం వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ అందిస్తుంది. అంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో సమానంగా వడ్డీ రేటును అందిస్తుంది. అందువల్ల మూడు సంవత్సరాల కాలానికి మూడు లక్షల పెట్టుబడిపై సాధారణ పౌరుడికి రూ.69,432 వడ్డీ వస్తుంటే సీనియర్ సిటిజన్లకు రూ. 74,915 రాబడి వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!