ఫిక్స్‌డ్ డిపాజిట్
ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది ఒక వ్యక్తి బ్యాంక్ లేదా ఏదైనా ఆర్థిక సంస్థలో నిర్ణీత వ్యవధిలో పెట్టుబడి పెట్టే ఆర్థిక ఎంపిక. ఈ పెట్టుబడి సమయంలో పెట్టుబడిదారుడు బ్యాంకు లేదా సంస్థచే నిర్ణయించబడే స్థిర వడ్డీ రేటుతో నిర్ణీత కాల వ్యవధిలో పెట్టుబడి పెడతాడు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల కాలపరిమితి 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇన్వెస్టర్ మెచ్యూరిటీకి ముందే డబ్బును విత్‌డ్రా చేస్తే కొంత నష్టపోవాల్సి వస్తుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇందులో పెట్టుబడిదారుడు స్థిర వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని పొందుతాడు. ఇందులో స్టాక్ మార్కెట్ లాగా పెట్టుబడి తర్వాత స్థిర రాబడులలో ఎలాంటి మార్పు ఉండదు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడానికి వ్యక్తి ఇప్పటికే బ్యాంక్ లేదా సంబంధిత ఆర్థిక సంస్థలలో ఖాతాను కలిగి ఉండాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి సాధారణంగా కనీస పరిమితి ఉంటుంది. ఇది వివిధ బ్యాంకులు లేదా సంస్థలపై ఆధారపడి ఉంటుంది.
అయినప్పటికీ ఈ పెట్టుబడి ఎంపిక ఆర్థిక భద్రత, స్థిరత్వంతో పాటు వడ్డీకి హామీ ఇస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో FDపై సగటు వడ్డీ రేటు 2.75% నుండి 9.50% మధ్య ఉంది. ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పెగరవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఇలాంటి వడ్డీరేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది.