FD Interest Rates: మూడేళ్లల్లో ముచ్చటైన రాబడి.. ఆ రెండు బ్యాంకుల ఎఫ్‌డీలతోనే సాధ్యం

భారతదేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఏళ్లుగా నమ్మకమైన పెట్టుబడి సాధనంగా ఉన్నాయి. ప్రజలు తమ పెట్టుబడికి హామీతో పాటు నమ్మకమైన రాబడి ఇవ్వడంతో వీటిల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకుల కూడా ఇతర బ్యాంకులతో పాటు ఫైనాన్స్ సంస్థలతో పెరిగిన పోటీకి అనుగుణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంకుల్లో మూడేళ్ల ఎఫ్‌డీపై రాబడి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

FD Interest Rates: మూడేళ్లల్లో ముచ్చటైన రాబడి.. ఆ రెండు బ్యాంకుల ఎఫ్‌డీలతోనే సాధ్యం
Money
Follow us
Srinu

|

Updated on: Nov 21, 2024 | 3:30 PM

మారుతున్న ఆర్థిక రంగంలో స్థిరత్వం, హామీ రాబడిని కోరుకునే వారికి నమ్మకమైన ఎంపికగా ఎఫ్‌డీలు ముందు వరుసలో ఉన్నాయి. భారతదేశపు అగ్రశ్రేణి బ్యాంకులుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ల నుంచి డిపాజిట్లను ఆకట్టుకునేందుకు నమ్మలేని వడ్డీ రేటును అందిస్తున్నాయి.  మూడేళ్ల ఎఫ్‌డీపై ఈ రెండు బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీను అందిస్తున్నాయి. ఈ బ్యాంకుల వడ్డీ రేట్లు, కనీస డిపాజిట్ అవసరాలు, అకాల ఉపసంహరణకు జరిమానాలు వంటి అదనపు అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

వడ్డీ రేట్లు ఇలా

రిటైల్ డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లపై ఎస్‌బీఐలో వడ్డీ రేట్లు 3 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఎఫ్‌డీ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధిని అందిస్తుంది. మూడేళ్ల  నుంచి ఐదేళ్ల కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్‌డీ కోసం వడ్డీ రేటు సాధారణ ప్రజలకు- 6.75 శాతంగా ఉంటే సీనియర్ సిటిజన్లకు 7.25 శాతంగా ఉంది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మూడు సంవత్సరాల మెచ్యూరింగ్ ఎఫ్‌డీ కోసం వేరే కాల వ్యవధిని కలిగి ఉంది. రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల ఎఫ్‌డీ వడ్డీ రేటు సాధారణ ప్రజలకు 7 శాతం ఉంటే సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం వడ్డీను అందిస్తున్నారు. 

మెరుగైన రాబడినిచ్చే ఎఫ్‌డీ ఇదే

మూడు సంవత్సరాల ఎఫ్‌డీ కోసం పీఎన్‌బీ సాధారణ, సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ కంటే కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది. అయితే తాజా రేట్లను నేరుగా బ్యాంకులతో ధ్రువీకరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి పాలసీ అప్‌డేట్‌ల ఆధారంగా మారవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి