Apple India: లాభాల బాటలో యాపిల్ ఇండియా.. నికర లాభం ఎన్ని కోట్లంటే..?

ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐ ఫోన్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా భారతదేశంలోని ఎగువ మధ్యతరగతి యువత యాపిల్ ఫోన్లను వాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా యాపిల్ ఫోన్లను భారతదేశంలోనే రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ ఇండియా కళ్లు చెదిరే లాభాలను ఆర్జించింది. యాపిల్ ఇండియా లాభాల తాజా నివేదికల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Apple India: లాభాల బాటలో యాపిల్ ఇండియా.. నికర లాభం ఎన్ని కోట్లంటే..?
Apple India Sales
Follow us
Srinu

|

Updated on: Nov 21, 2024 | 3:17 PM

యాపిల్ ఇండియా మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.67,121.6 కోట్ల ఆదాయాన్ని నివేదించింది . ఐఫోన్ అమ్మకాలు పెరిగినందు వల్ల అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 36 శాతం పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరంలో వార్షిక లాభం రూ.2,229 కోట్ల నుంచి 2024 ఆర్థిక సంవత్సరానికి రూ.2,745 కోట్లకు పెరిగింది. టోఫ్లర్ షేర్ చేసిన కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం ఈ విషయం స్పష్టం అయ్యింది. తాజా జూలై-సెప్టెంబర్ త్రైమాసికంతో సహా యాపిల్ ఐఫోన్ అమ్మకాలను పరిగణలోకి తీసుకుంటే ఈ విషయం తెలుస్తుందని నిపుణులు చెబతున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ ఆదాయం భారీగా 47.8 శాతం పెరిగి రూ.49,321 కోట్లకు చేరుకుంది.

యాపిల్ 2025 ఆర్థిక సంవత్సరంలో ఐఫోన్‌లు, మ్యాక్, ఐ ప్యాడ్, వేరబుల్స్‌తో పాటు ఇతర సేవలతో యాపిల్ ఇండియా దాదాపు 11 బిలియన్ల డాలర్ల విక్రయాలను ఆర్జించే అవకాశం ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కి సమర్పించిన వివరాల ప్రకారం యాపిల్ ఇండియాకు సంబంధించిన ఆదాయాలు ఇప్పటికీ సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కంటే తక్కువగా ఉన్నాయి. సామ్‌సంగ్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1.03 ట్రిలియన్ల అమ్మకాలను సాధించింది. అంతకు ముందు సంవత్సరంలో రూ.98,924 కోట్లుగా ఉంది. సామ్‌సంగ్ 2024 ఆర్థిక సంవత్సరంలో సామ్‌సంగ్ లాభం రూ.8,188 కోట్లుగా ఉంటే అంతకు ముందు సంవత్సరంలో ₹ 3,452 కోట్ల నుంచి రెట్టింపు అయింది .

ఐఫోన్ అమ్మకాలతో పాటుగా యాపిల్ సంస్థ పీసీ డీల్స్‌లో కూడా పెరుగుదలను చూస్తోంది. పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేల ఆవశ్యకత ఆధారంగా ఐప్యాడ్‌ల పెరుగుదలను చూస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ బాగా రాణిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ షిప్‌మెంట్‌లు గత కొన్ని సంవత్సరాలుగా మంచి వృద్ధిని నమోదు చేశాయి. 2023లో 9.7 మిలియన్లకు చేరుకుంది. 2024లో 12 మిలియన్లకు పైగా చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి