Business Idea: కల్తీ కాలంలో కాసులు కురిపించే వ్యాపారం.. తిరుగే ఉండదు.. లాభాలే లాభాలు
మార్కెట్ లో ఉన్న అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అన్ని రకాల వస్తువులు కల్తీగా మారుతోన్న తరుణంలో మంచి నూనెను నేచురల్ గా తయారు చేసి విక్రయిస్తే వ్యాపారంలో రాణించవచ్చు. ఇంతకీ ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి.? ఎంత పెట్టుబడి అవసరపడుతుంది...
ప్రస్తుతం కల్తీ కాలం రాజ్యమేలుతోంది. మార్కెట్లో లభించే అన్ని వస్తువులు కల్తీగా మారిపోతున్నాయి. ఉప్పు మొదలు పప్పు వరకు అన్నింటినీ కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. దీంతో ఏం తినాలన్న భయపడే పరిస్థితి వచ్చింది. అటు రెస్టారెంట్స్‌లో నాణ్యత ఉండడం లేదు. పోనీ ఇంట్లోనే వంట చేసుకొని తిందామా.? అంటే కల్తీలతో భయపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా వంట నూనె విషయంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
కొన్ని రకాల ఆయిల్స్‌లో ఏకంగా పెట్రోలియం వేస్టేజీని కలుపుతున్నారన్న వార్తలు ఉలిక్కిపడేలా చేస్తోంది. అయితే ఈ తరుణంలో ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. సహజంగా పండించిన పంటలను, సహజంగా తయారు చేసిన వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు. ధర ఎక్కువైనా పర్లేదు కానీ ఆరోగ్యం బాగుండాలని ఆశపడుతున్నారు.
దీనిని మన పెట్టుబడి అంశంగా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. వంట నూనెను నేచురల్‌గా తయారు చేసి విక్రయిస్తే లాభాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ప్రస్తుతం చాలా వరకు పట్టణాల్లో ఇలా నేచురల్ ఆయిల్ తయారీకి డిమాండ్ పెరుగుతోంది. మరి మీ ఏరియాలో ఈ వ్యాపారం లేకపోతే ప్లాన్ చేయేచ్చు. ఇంతకీ నూనె తయారీకి ఎంత పెట్టుబడి కావాల్సి ఉంటుంది.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గానుగ నూనెపై ప్రస్తుతం ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అందుకే గానుగ నూనెకు డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు ఎద్దులతో గానుగ పట్టించేవారు. కానీ ప్రస్తుతం మిషిన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే సుమారు రూ. 3 నుంచి రూ. 4 లక్షల పెట్టుబడి కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక చిన్న షటర్ ఉన్నా సరిపోతుంది. వేరుశనగ, నువ్వులను పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గింజలను మిషిన్‌లో వేస్తే సరిపోతుంది నూనె వస్తుంది. వీటిని బాటిల్స్ లేదా కవర్ లో ప్యాక్ చేసి విక్రయించుకోవచ్చు.
గానుగ నూనె తయారీ మిషిన్ ధర రూ. 2 లక్షల వరకు ఉంటుంది. అలాగే రూమ్ సెటప్, కావాల్సిన రా మెటీరియల్‌కు మొత్తం మరో రూ. 1 నుంచి రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నూనెను మీ సొంత బ్రాండింగ్‌తో విక్రయించుకోవచ్చు. వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రకటనలు చేసుకోవాలి. లాభాల విషయానికొస్తే ప్రస్తుతం మార్కెట్లో లీటర్ గానుగ నూనె 300 వరకు విక్రయిస్తున్నారు. అలాగే నూనె వచ్చిన తర్వాత మిగిలిన వ్యర్థాన్ని పశువుల దానా కోసం విక్రయించుకోవచ్చు. తక్కువలో తక్కువ నెలకు రూ. 30 వేలకు పైగా ఆర్జించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..