Indian Railways: మన దేశంలో చివరి రైల్వేస్టేషన్ ఏదో తెలుసా? ఇక్కడి నుంచి గాంధీ, సుభాస్ చంద్రబోస్..
Indian Railways: మన భారత రైల్వేలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. అలాగే ఎన్నో ఆసక్తికర అంశాలు కూడా ఉన్నాయి. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో భారత రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు వివివిధ రైళ్లలో ప్రయాణిస్తున్నారు..
మనం రైల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో అనేక స్టేషన్లు వస్తుంటాయి. వీటిల్లో కొన్ని జంక్షన్లు ఉంటాయి. జంక్షన్ అంటే అక్కడి నుంచి రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ మార్గాల్లో రైళ్లు చీలిపోయి వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తాయి. అలాగే కొన్ని పెద్ద స్టేషన్లు, కొన్ని చిన్న స్టేషన్లు ఉంటాయి. అలాగే చివరి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. మన దేశంలో దాదాపు 7083కుపైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. భారతదేశంలోని అతి పెద్ద, అతి చిన్న రైల్వే స్టేషన్ గురించి చదివే ఉంటారు. అలాగే దేశంలో చివరి స్టేషన్ ఏదో మీకు తెలుసా..? దీని గురించి తెలుసుకుందాం.
దేశంలోని చివరి స్టేషన్ పేరు సింగాబాద్. ఇది పెద్ద స్టేషన్ కాదు.. కానీ ఇది చాలా పాతది. ఈ స్టేషన్ బ్రిటిష్ కాలం నాటిది. బ్రిటీష్ వారు వెళ్లిపోయినట్లే నేటికీ ఇక్కడ అంతా అలాగే ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ ఏమీ మారలేదు. ఈ స్టేషన్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంటుంది. భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్. ఇది గూడ్స్ రైళ్ల రవాణా కోసం ఉపయోగిస్తుంటారు.. ఈ స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని హబీబ్‌పూర్ ప్రాంతంలో ఉంది. సింగాబాద్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగ్లాదేశ్‌కు ప్రజలు కాలినడకన వెళ్తారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీని తర్వాత భారతదేశంలో మరే రైల్వే స్టేషన్ లేదు. ఇది నిజానికి చాలా చిన్న రైల్వే స్టేషన్.
ఈ స్టేషన్‌లో చాలా కాలంగా పనులు నిలిచిపోయాయి. స్వాతంత్ర్యం తరువాత, భారతదేశం , పాకిస్తాన్ మధ్య విభజన తర్వాత ఈ స్టేషన్ అలాగే ఉండిపోయింది. 1978లో ఈ మార్గంలో గూడ్స్ రైళ్లు నడవడం ప్రారంభించాయి. ఈ వాహనాలు భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లేవి. నవంబర్ 2011లో పాత ఒప్పందాన్ని సవరించి అందులో నేపాల్‌ను చేర్చారు. నేపాల్ వెళ్లే రైళ్లు కూడా ఇక్కడి నుంచి వెళ్లడం ప్రారంభించాయి. నేపాల్ బంగ్లాదేశ్ నుండి పెద్ద ఎత్తున ఆహారాన్ని ఎగుమతి చేస్తుంది. వీటిని రవాణా చేసే గూడ్స్ రైళ్ల సరుకు రోహన్‌పూర్-సింగాబాద్ ట్రాన్సిట్ పాయింట్ నుండి వస్తుంది.
బంగ్లాదేశ్‌లోని మొదటి స్టేషన్ రోహన్‌పూర్. ఈ స్టేషన్ కోల్‌కతా, ఢాకా మధ్య రైలు కనెక్టివిటీ కోసం ఉపయోగించారట. ఈ స్టేషన్ స్వాత్య్రానికి పూర్వం ఉన్నందున, ఈ మార్గాన్ని మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ బోస్ కూడా ఢాకా వెళ్ళడానికి చాలాసార్లు ఉపయోగించారని సమాచారం. ఒకప్పుడు డార్జిలింగ్ మెయిల్ లాంటి రైళ్లు కూడా ఇక్కడి గుండా వెళ్లేవని, కానీ ఇప్పుడు గూడ్స్ రైళ్లు మాత్రమే ఇక్కడికి వెళ్తాయి. ఈ స్టేషన్ చాలా పాతది. ఈ స్టేషన్‌లో ఉంచిన టెలిఫోన్ కూడా బాబా ఆదామ్ కాలం నాటిదే. అదేవిధంగా, సిగ్నల్స్ కోసం హ్యాండ్ గేర్లు కూడా ఉపయోగించబడతాయి.
ఇక్కడ నామమాత్రపు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఈ స్టేషన్‌లో ఏ ప్యాసింజర్ రైలు ఆగదు. అందుకే టికెట్ కౌంటర్ మూసి ఉంటుంది. కానీ ఇక్కడ రోహన్‌పూర్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లాల్సిన గూడ్స్ రైళ్లు మాత్రమే ఆగుతాయి.
బ్రిటీష్ కాలంలో నిర్మాణం
ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న మన భారతీయ రైల్వే.. లక్ష కిలోమీటర్లుగా విస్తరించి ఉంది. రైల్వే ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. మన దేశంలోని చివరి రైల్వేస్టేషన్ సింగాబాద్ స్టేషన్. పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని మాల్దా జిల్లా హబీబ్ పూర్ ప్రాంతంలో ఇది ఉంది. దీన్ని ఇండియా చివరి స్టేషన్ గా భావిస్తారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు ప్రారంభమవుతుంది. దీన్ని బ్రిటీష్ కాలంలో నిర్మించారు.
ఇవి కూడా చదవండి: Adani Case: బిలియనీర్ గౌతమ్ అదానికి షాక్.. లంచం, మోసం ఆరోపణలు.. అరెస్ట్ వారెంట్ జారీ!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి