TVS IQube: టీవీఎస్ ఐక్యూబ్ ప్రియులకు గుడ్ న్యూస్.. అదిరే క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటన
భారతదేశంలో ఈవీ రంగ మార్కెట్ రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఈ మార్కెట్‌లో తమ హవా చూపించడానికి అమ్మకాలు పెంచుకునేందుకు ఈవీ కంపెనీలు వివిధ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ టీవీఎస్ తన ఈవీ స్కూటర్ అయిన ఐక్యూబ్ కొనుగోలుపై అదిరే క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.
టీవీఎస్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లో తన హవా చూపేందుకు ఐక్యూబ్ సేల్స్‌పై దృష్టి సారిస్తోంది. అందువల్ల ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు టీవీఎస్ ‘టీవీఎస్ ఐక్యూబ్ మిడ్ నైట్ కార్నివాల్’ పేరుతో ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ఆదివారం రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది. టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసేవారికి పూర్తి నగదు వాపసు పొందేందుకు ఈ పథకం ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ఇయర్ ఎండ్ సేల్స్ పెంపే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకం కింద వారి కొనుగోలుపై 100% క్యాష్‌బ్యాక్ పొందేందుకు రోజుకు ఒక కస్టమర్ మాత్రమే ఎంపిక అవుతారు.
పది రోజుల వ్యవధిలో ఈ ఆఫర్ నుంచి ప్రయోజనం పొందేందుకు లాటరీ విధానం ద్వారా పది మంది వ్యక్తులను ఎంపిక చేస్తారు. ఈ ప్రమోషన్‌కు అనుగుణంగా ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ నిర్వహణకు టీవీఎస్ 24/7 కొనుగోలు ఎంపికలను ఏర్పాటు చేసింది. క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో పాటు టీవీఎస్ ప్రత్యేక ప్రయోజనాల రూ. 30,000 విలువపైన ఆఫర్లను అందిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపిక కోసం 5 సంవత్సరాలు లేదా 70,000 కిమీల ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్రోగ్రామ్ పొందవచ్చు.
అలాగే 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఎంపికపై 5 సంవత్సరాల లేదా 50,000 కిమీ ఎక్స్‌టెండెడ్ వారెంటీను పొందవచ్చు. భారతదేశంలో ప్రారంభ స్థాయి టీవీఎస్ ఐక్యూబ్ ధర రూ. 94,999గా ఉంది. టీవీఎస్ ఐక్యూబ్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ. మొదటి వేరియంట్ 2.2 కేడబ్ల్యూహెచ్, 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికలను అందిస్తుంది. అయితే ఐక్యూబ్ ఎస్ 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐక్యూబ్ ఎస్టీ 3.4 కేడబ్ల్యూహెచ్, 5.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ల కోసం ఎంపికలను అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి