Ritesh Agarwal: ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్.. ఓయో హోటల్స్ పెట్టేలా చేసింది.. సీఈవో చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీ..

ప్రేక్షకులకు ఎక్కువగా ఇష్టమైన రియాల్టీ షోలలో షార్ట్ ట్యాంక్ ఇండియా ఒకటి. ఇప్పటికే ఈ షో మూడు సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నాల్గవ సీజన్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ కొత్త సీజన్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త వ్యాపారవేత్తల ఆలోచనలను వెల్లడించే వేదిక ఇది.

Ritesh Agarwal: ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్.. ఓయో హోటల్స్ పెట్టేలా చేసింది.. సీఈవో చెప్పిన ఇంట్రెస్టింగ్ స్టోరీ..
Ritesh Agarwal
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 21, 2024 | 8:42 AM

షార్క్ ట్యాంక్ ఇండియా దేశంలో అత్యధికంగా వీక్షించే రియాల్టీ షోలలో ఒకటి. ఇప్పటికే ఈ షో మూడు సీజన్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు నాలుగో సీజన్ స్టార్ట్ కానుంది. కొత్త వ్యాపారవేత్తలకు, కొత్త ఆలోచనలకు వేదికగా మారింది ఈ షో. రాబోయే నాల్గవ సీజన్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా 4వ సీజన్ వచ్చే ఏడాది జనవరి 6 నుంచి సోనీ లైవ్ లో ప్రసారం కానుంది. కొత్త షార్క్‌లు , కొత్త హోస్ట్‌తో కొత్త సీజన్ తిరిగి వచ్చింది. అయితే ఈ షోలో కొత్త షార్క్‏లలో ఓయో హోటల్స్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో రితేశ్ అగర్వాల్ సైతం ఉన్నారు. ఈ క్రమంలోనే ఓయో హోటల్స్ ఎలా స్టార్ట్ అయ్యింది ? అనే విషయాలను పంచుకున్నారు.

షార్క్ ట్యాంక్ ఇండియా రియాల్టీ షో దేశం నలుమూలల నుంచి అన్ని వయసుల వ్యక్తులు, విభిన్న నేపథ్యాల ప్రజలు తమ ఆలోచనలను తెలియజేయడానికి వేదిక. ఈ రియాల్టీ షోలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి మాత్రమే కాకుకండా.. తమ అభిరుచిని తెలియజేస్తూ విజయవంతమైన వ్యాపారస్తులుగా మారేందుకు మార్గనిర్దేశం చేయడానికి సహయపడుతుంది. యంగ్ స్టర్స్ బిజినెస్ ఆలోచనలను వ్యక్తపరిచేందుకు.. వాటిని అమలు పరిచేందుకు ఈ వేదిక స్పూర్తిగా నిలుస్తుంది. అయితే తాజాగా ఈ షోలో ఓయో హోటల్స్ సీఈవో రితేశ్ అగర్వాల్ తన బిజినెస్ సీక్రెట్ రివీల్ చేశాడు. హోటల్స్ రంగంలో ఓయో విజయం సాధించడానికి గల కారణాన్ని చెబుతూ.. తన సక్సెస్ కు పూర్తి క్రెడిట్ ఒక్క సినిమాకే ఇచ్చారు. ఆ సినిమా చూసిన తర్వాతే ఓయో హెటల్స్ పెట్టడానికి ఆలోచన వచ్చిందని అన్నాడు.

రితేష్ మాట్లాడుతూ “3 ఇడియట్స్ నా జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమాలో ఫాలో యువర్ ప్యాషన్, మనీ ఆటోమేటిక్‌గా మిమ్మల్ని ఫాలో అవుతుంది అనే సినిమా సందేశం నిజంగా నా మనసును తాకింది. మీరు మీ అభిరుచిని, ఆలోచనను అనుసరిస్తే విజయం మిమ్మల్ని ఫాలో అవుతుందనేది నేను నమ్మాను. ఆ సినిమా చూసిన వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఆలోచనపై పూర్తిగా నమ్మకంతో ఉన్నాను. అలా ఓయో పుట్టింది. ఏదైనా కొత్తగా, వినూత్నంగా చేయాలనే తపనతో ఇదంతా మొదలైంది. వ్యాపారవేత్తలకు నా సలహా ఏమిటంటే ‘డబ్బు సంపాదించడంపై మాత్రమే దృష్టి పెట్టవద్దు. మీ అభిరుచిని అనుసరించండి, డబ్బు స్వయంగా మీ దగ్గరకు వస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.