Journey Movie: తస్సాదియ్యా.. అప్పుడు క్యూట్‏గా.. ఇప్పుడు హాట్‏గా.. జర్నీ సినిమా బ్యూటీని చూశారా..?

తెలుగు సినీ పరిశ్రమలో తొలి సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ మూవీతోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కొందరు తారలు.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో ఈ బ్యూటీ ఒకరు. జర్నీ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

Journey Movie: తస్సాదియ్యా.. అప్పుడు క్యూట్‏గా.. ఇప్పుడు హాట్‏గా.. జర్నీ సినిమా బ్యూటీని చూశారా..?
Ananya
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 21, 2024 | 10:35 AM

తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన సినిమాల్లో జర్నీ. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎప్పుడూ చూసిన బోర్ కొట్టని సినిమాల్లో ఇది ఒకటి. 2011లో విడుదలైన ఈ మూవీకి ఎం. శరవణన్ దర్శకత్వం వహించాడు. ఎస్.కె.పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ కొండేటి నిర్మించిన ఈ సినిమాలో శర్వానంద్, జై, అనన్య, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో ఎంగీయుం ఎప్పుతం పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో జర్నీ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. రెండు ప్రేమకథలతో మొదలైన ఈ స్టోరీలో అనుకోని ప్రమాదం ఎలాంటి మలుపులు తిప్పింది అనేది సినిమా. ఒక్క రోడ్డు ప్రమాదం ఎందరి జీవితాలను తారుమారు చేసిందనేది అడియన్స్ హృదయాలను తాకేలా చూపించారు. ఈ చిత్రంలో అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అనన్య. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

జర్నీ సినిమాలో అమృత అనే పాత్రలో నటించి మెప్పించింది అనన్య. కేరళకు చెందిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే చాలా ఫేమస్ అయ్యింది. కానీ ఆ తర్వాక కథానాయికగా తెలుగులో అంతగా అవకాశాలు అందుకోలేదు. జర్నీ మూవీ తర్వాత తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అఆ చిత్రంలో నటించింది. ఇందులో నితిన్ చెల్లిగా కనిపించింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో చిన్న పాత్ర పోషించింది. తెలుగు కంటే ఎక్కువగా మలయాళంలో అనేక సినిమాల్లో నటించింది.

2012లో ఆంజనేయన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదు. మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలోనూ అనన్య చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అప్పుడు ఎంతో క్యుట్ గా కనిపించిన అనన్య.. ఇప్పుడు గ్లామర్ ఫోటోలతో మతిపోగొడుతుంది.

View this post on Instagram

A post shared by Ananyaa (@ananyahere)

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పుడు క్యూట్‏గా.. ఇప్పుడు హాట్‏గా..
అప్పుడు క్యూట్‏గా.. ఇప్పుడు హాట్‏గా..
శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఉలవలతో ఇంత మేలు జరుగుతుందా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్.. ఓయో హోటల్స్ పెట్టేలా చేసింది
ఆ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్.. ఓయో హోటల్స్ పెట్టేలా చేసింది